News


చందా కొచర్‌ ఆస్తులు ఈడీ జప్తు

Saturday 11th January 2020
news_main1578716765.png-30853

న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన కేసులో ఐసీఐసీఐ మాజీ చైర్మన్‌ చందా కొచర్‌, మరికొందరికి చెందిన రూ.78 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఈ మేరకు అక్రమ ధనార్జనా  నిరోధక చట్టం నిబంధనల కింద ఒక ఉత్తర్వ్యు జారీ అయ్యింది. ముంబైలో కొచర్‌కు ఉన్న ఇల్లు, అమెతో సంబంధం ఉన్న ఒక కంపెనీకి చెందిన ఆస్తులు... జప్తు అయిన వాటిలో ఉన్నట్లు శుక్రవారం అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి ఇచ్చిన రుణాలకు సంబంధించి అవినీతి చోటుచేసుకున్నట్లు వచ్చిన ఆరోపణల కేసులో కొచర్‌, ఆమె భర్త దీపక్‌ కొచర్‌ తదితరులను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. 



You may be interested

పాజిటివ్‌ జోన్‌లో ఇన్ఫోసిస్‌

Saturday 11th January 2020

విజిల్‌ బ్లోయర్‌ ఆరోపణలు తేలిపోవడం సానుకూలం పటిష్ట ఫలితాలు, గైడెన్స్‌ పెంపుతో షేరుకి జోష్‌  ప్రధాన విభాగాల్లో వృద్ధిపైనే భవిష్యత్‌ కదలికలు క్యూ3 తదుపరి మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ పనితీరు ఆకట్టుకున్నప్పటికీ కొన్ని అంశాలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే.. ఆదాయ అంచనాలు(గైడెన్స్‌) పెంపుతోపాటు..విజిల్‌ బ్లోయర్‌ ఆరోపణల్లో వాస్తవాలు లేవంటూ ఆడిట్‌ కమిటీ తోసిపుచ్చడం కంపెనీకి సానుకూల అంశాలని తెలియజేశారు. స్వతంత్ర న్యాయ సంస్థ

సెన్సెక్స్‌ను శాసించే షేరు ఇదే!

Saturday 11th January 2020

దేశీయ ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈక్విటీ సూచీలకే సూచికగా మారింది. భవిష్యత్‌లో సెన్సెక్స్‌ కదలికలు పసిగట్టాలంటే ఈ షేరును పరిశీలిస్తే చాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు దశాబ్దాల బ్యాంకు షేరు, సెన్సెక్స్‌ల కదలికలను సామ్‌కో సెక్యూరిటీస్‌ మదింపు చేసింది. ఎప్పుడైతే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు ఒక కొత్త గరిష్ఠాన్ని చేరిందో, అప్పుడల్లా సెన్సెక్స్‌ కూడా స్వల్ప వ్యవధిలోనే కొత్త గరిష్ఠాలను చేరిందని ఈ మదింపులో బ్రోకరేజ్‌

Most from this category