News


మెహుల్‌ చోక్సీ ఆస్తులు ఈడీ జప్తు

Friday 12th July 2019
news_main1562913844.png-27005

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో రూ.13,000 కోట్లకుపైగా రుణ ఎగవేతల కేసులో మెహుల్‌ చోక్సీకి చెందిన రూ.22.77 కోట్ల విలువైన ఆస్తులనున ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం జప్తు చేసింది. దుబాయ్‌లో మూడు కమర్షియల్‌ అసెట్స్‌, మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు, దేశ విదేశాల్లో బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న కొన్ని ఫిక్డ్డ్స్‌ డిపాజిట్లు జప్తు చేసిన వాటిలో ఉన్నాయి. అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద చోక్సీపై ఉత్తర్వులు జారీ అయినట్లు కూడా ఈ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా చర్యలతో కలుపుకుంటే, మొత్తం రూ.2,535 కోట్ల చోక్సీ ఆస్తుల జప్తు జరిగింది.You may be interested

ఆప్టికల్‌ ఫైబర్‌కు భారీ డిమాండ్‌

Friday 12th July 2019

5జీ సేవలకు కీలకమైన ఓఎఫ్‌సీ నెట్‌వర్క్‌ 2022 నాటికి 4 రెట్లు పెరగాలి రూ. 1,80,000 కోట్ల పెట్టుబడులు కావాలి న్యూఢిల్లీ: హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందించే 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కీలకమైన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ (ఓఎఫ్‌సీ)కు గణనీయంగా ప్రాధాన్యం పెరుగుతోంది. టెలికం శాఖ అంచనాల ప్రకారం 2018లో ఓఎఫ్‌సీ నెట్‌వర్క్‌ సుమారు 1.4–1.5 మిలియన్‌ కేబుల్‌ రూట్‌ కిలోమీటర్స్‌ మేర విస్తరించి ఉంది. ఇంటర్నెట్‌ విస్తృతిని మరింత పెంచే దిశగా ప్రభుత్వం

గూగుల్ మ్యాప్స్‌లో డైనింగ్ ఆఫర్లు

Friday 12th July 2019

న్యూఢిల్లీ: భారతీయ యూజర్స్‌ కోసం గూగుల్ మ్యాప్స్ తాజాగా మరో మూడు ఫీచర్స్‌ ప్రవేశపెట్టింది. 11 నగరాల్లోని స్థానిక హోటళ్లలో డీల్స్‌ను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఆఫర్ ఫీచర్ వీటిలో ఉంది. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ఈజీడైనర్ సంస్థతో కలిసి 'ఆఫర్‌' ఫీచర్ అందిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. దీనితో 4,000 పైచిలుకు రెస్టారెంట్స్‌లో ఆఫర్స్ గురించి తెలుసుకోవచ్చు. ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లో ఆఫర్స్‌ షార్ట్‌కట్‌ను

Most from this category