News


ఆర్థిక మందగమనం తీవ్ర ఆందోళనకరం

Tuesday 20th August 2019
news_main1566277491.png-27882

  • ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రాజన్‌
  • విద్యుత్‌ రంగంలో సమస్యల
  • తక్షణ పరిష్కారం అవసరం
  • నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ 
  • రంగాల్లోనూ ఇదే చర్యలకు సూచన
  • ప్రైవేటురంగ పునరుత్తేజానికి పిలుపు

న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం పట్ల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌, బ్యాంకింగ్‌ యేతర ఫైనాన్షియల్‌ రంగాల్లో సమస్యల తక్షణ పరిష్కారంపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రైవేటు రంగ పునరుత్తేజానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనీ సూచించారు. భారత్‌లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు లెక్కింపు విధానంపై తాజాగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వంలో చీఫ్‌ ఎకనమిస్ట్‌గా పనిచేసిన అరవింద్‌ సుబ్రమణ్యం జీడీపీ లెక్కలపై చేసిన విమర్శలనూ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒక టీవీ చానెల్‌కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...

  • భారత్‌ వృద్ధికి సంబంధించి ప్రైవేటు సంస్థల నుంచి వేర్వేరు అంచనాలు వెలువడ్డాయి. వాటిలో అధికభాగం అంచనాలు ప్రభుత్వ అంచనాలకన్నా తక్కువగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే, ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉన్నట్లు నేను భావిస్తున్నాను. 
  • 2018-19తో భారత్‌ ఆర్థిక వృద్ధి 6.8 శాతంగా ఉంది. 2014-15 తరువాత ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి. ప్రభుత్వం 2019-2020లో 7 శాతం వృద్ధి అంచనావేస్తున్నా... అంతకన్నా తక్కువగానే ఉంటుందన్నది పలు ప్రైవేటు సంస్థల అంచనా. 
  • పలు వ్యాపారాల గురించి మీరు విన్నప్పుడు ఆందోళన కలిగించే వార్తలే ఉంటున్నాయి. తమకు ఉద్దీపన చర్యలు ఏదో ఒక రూపంలో కావాలని పలు రంగాలు కోరుతున్నాయి. 
  • అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రుణాలు నిజానికి సంస్కరణగా భావించడానికి వీలు లేదు. ఇది ఒక వ్యూహాత్మక చర్య మాత్రమే. You may be interested

ఇక ఓయో.. కాఫీ!!

Tuesday 20th August 2019

ప్రీమియం కాఫీ చెయిన్‌ ఏర్పాటుకు సన్నాహాలు ది ఫ్రెంచ్‌ ప్రెస్‌ పేరుతో బ్రాండింగ్‌ రెస్టారెంట్లు కూడా ప్రారంభించే యోచన న్యూఢిల్లీ: చౌకగా హోటల్‌ గదులను అందుబాటులోకి తెచ్చిన ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ తాజాగా కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. ప్రీమియం కాఫీ చెయిన్, రెస్టారెంట్లు ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది. ది ఫ్రెంచ్‌ ప్రెస్‌ పేరుతో 50 పైగా ప్రీమియం కాఫీ షాప్‌లను ఏర్పాటు చేసేందుకు ఓయో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే నాలుగు

నిరాశావాదంపైకాదు... ఆశావాదంవైపు దృష్టి!

Tuesday 20th August 2019

  ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పిలుపు ఆర్థికం మందగమనమే అయినా...- అంతా బలహీనమే కాదు రుణ రేటు మరింత తగ్గాలని - బ్యాంకులకు పిలుపు ఎన్‌బీఎఫ్‌సీ రుణ నాణ్యతపై - తక్షణ సమీక్ష ఉండబోదు ముంబై: ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన మాట వాస్తవమని రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అంగీకరించారు. ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న మాటా వాస్తవమన్నారు. అయితే ప్రతిఒక్కరూ అవకాశాలు, ఆశావాదంపై దృష్టి పెట్టాలితప్ప నిరాశావాదంపై వద్దని కూడా ఆయన

Most from this category