News


ఆర్థిక క్రియాశూన్యత సుస్పష్టం

Friday 21st June 2019
Markets_main1561098300.png-26468

  • ఎంపీసీ భేటీలో ఆర్‌బీఐ గవర్నర్‌ వ్యాఖ్య

ముంబై: ఆర్థిక వ్యవస్థలో క్రియాశూన్యత సుస్పష్టంగా కనిపిస్తోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ పేర్కొన్నారు. జూన్‌ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ జరిగిన సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 5.75 శాతం) పావుశాతం తగ్గించింది. రేటు తగ్గింపు వరుసగా ఆరు నెలల్లో మూడవసారి. ఈ కాలంలో రేటు 75 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. కమిటీ సమావేశ మినిట్స్‌ గురువారం విడుదల అయ్యాయి. ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధిరేటు 5.8 శాతానికి పడిపోయిన విషయాన్ని గవర్నర్‌ ప్రస్తావించారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతకు రేటు తగ్గింపు తప్పనిసరి పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. పరపతి విధాన కమిటీలోని ఆరుగురు సభ్యులూ ఏకగ్రీవంగా రేటు తగ్గింపునకు సానుకూల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత తగ్గిపోయింది. మందగమనం చోటు చేసుకుంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో... రెపో రేటు తగ్గింపునకు ఆర్‌బీఐ శ్రీకారం చుట్టింది. బ్యాంకులకు తగ్గించిన రేటు ప్రయోజనం... సాధారణ వినియోగదారు నుంచి పరిశ్రమల వరకూ అందినప్పుడు అది వ్యవస్థలో రుణ రేటు తగ్గుదలకు తోడ్పడుతుంది. రుణాలపై వడ్డీ తక్కువ కనక రుణాలు ఎక్కువ తీసుకుంటారు. ఇది వృద్ధి మెరుగుదలకు దోహదపడుతుందనేది క్లుప్తంగా ఆర్థిక విశ్లేషణ. 



You may be interested

ఫిచ్‌ బాటలోనే డీబీఎస్‌

Friday 21st June 2019

2019-20లో భారత్‌ వృద్ధి అంచనా కోత  7 శాతం నుంచి 6.8 శాతానికి డౌన్‌ సింగపూర్‌: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రముఖ బ్యాంకింగ్‌ సేవల సంస్థ- డీబీఎస్‌ కుదించింది. 2019- 2020లో కేవలం 6.8 శాతమే నమోదవుతుందని అంచనా వేసింది. ఇప్పటి వరకూ ఈ అంచనాలను డీబీఎస్‌ 7 శాతంగా పేర్కొంది. ఇటీవలే అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ- ఫిచ్‌ 2019- 20 వృద్ధి

నష్టాలలో ట్రేడవుతున్న స్పైస్‌ జెట్‌, ఇండిగో

Friday 21st June 2019

పెరిగిన చమురు ధరలే కారణం చమురు ధరలు గత మూడు వారల గరిష్ఠానికి పెరగడంతో శుక్రవారం స్పైస్‌జెట్‌ షేరు విలువ 5శాతం, ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ (ఇండిగో) షేరు విలువ 3 శాతం నష్టపోయాయి. అమెరికా డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చివేసిందనే వార్తల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలలో ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరిగాయి. మూడు నెలల కోసం  జెట్‌ ఎయిర్‌వేస్‌ విదేశి విమాన సర్విసుల హక్కులను విమానయాన మంత్రిత్వ శాఖ దేశియ

Most from this category