దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం
By Sakshi

బెంగళూరు: ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ తోడ్పాటుతో ఒక స్టార్టప్ సంస్థ బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ స్థాయికి చేరింది. క్లౌడ్ ఆధారిత కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ సేవలు అందించే ఐసెర్టిస్ సంస్థలో అజీం ప్రేమ్‌జీ కుటుంబానికి చెందిన ప్రేమ్‌జీఇన్వెస్ట్ ఫండ్, గ్రేక్రాఫ్ట్ పార్ట్నర్స్ తదితర సంస్థలు 115 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. వీటిలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన బి క్యీపిటల్ గ్రూప్, ఎయిట్ రోడ్స్ మొదలైనవి కూడా ఉన్నాయి. తాజా పెట్టుబడులతో ఐసెర్టిస్ మొత్తం 211 మిలియన్ డాలర్లు సమీకరించినట్లయింది. ఈ విడత నిధుల సమీకరణతో సంస్థ విలువ 1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్లవుతుందని ఐసెర్టిస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ బోదాస్ తెలిపారు. 2009లో సమీర్, ఆయన మిత్రుడు మనీష్ దర్దా కలిసి ఐసెర్టిస్ను ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో 850 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 600 మంది పుణె కేంద్రంలో పనిచేస్తున్నారు. సరుకుల కొనుగోళ్ల నుంచి ఉద్యోగులతో ఒప్పందాలు దాకా ప్రపంచవ్యాప్తంగా పలువురు క్లయింట్లకు 57 లక్షల పైగా కాంట్రాక్టుల నిర్వహణకు సేవలు అందిస్తున్నట్లు సమీర్ వివరించారు. వీటి మొత్తం విలువ 1 లక్ష కోట్ల డాలర్ల పైగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ సేవలపై కంపెనీలు 2018-2022 మధ్య కాలంలో 20 బిలియన్ డాలర్ల దాకా వెచ్చించనున్నట్లు పరిశ్రమవర్గాల అంచనా.
You may be interested
భారత్‌లోకి 2,500 కోట్ల డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు: మోర్గాన్ స్టాన్లీ
Thursday 18th July 2019దేశియ మార్కెట్లలో ఫ్రీ ఫ్లోట్ సమస్యలను పరిష్కరించడానికి కొన్ని ప్రతిపాదనలను తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. వీటి ఫలితంగా ఇండియా ఈక్విటీ మార్కెట్లలోకి 2,500 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చి చేరతాయని, అంతేకాకుండా ఎంఎస్సీఐ ఎమర్జింగ్ మార్కెట్ల సూచీలో ఇండియా వెయిటేజీ 146 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. ఇండియా స్టాక్స్ ఫ్రీ ఫ్లోట్ (ప్రమోటర్ల వాటా మినహా మిగతా పబ్లిక్ వాటా) పెంచడానికి బడ్జెట్లో
దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం
Thursday 18th July 2019టెక్నాలజీ సంస్థ ఐసెర్టిస్‌లో పెట్టుబడులు బిలియన్ డాలర్లకు సంస్థ విలువ బెంగళూరు: ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ తోడ్పాటుతో ఒక స్టార్టప్ సంస్థ బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ స్థాయికి చేరింది. క్లౌడ్ ఆధారిత కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ సేవలు అందించే ఐసెర్టిస్ సంస్థలో అజీం ప్రేమ్‌జీ కుటుంబానికి చెందిన ప్రేమ్‌జీఇన్వెస్ట్ ఫండ్, గ్రేక్రాఫ్ట్ పార్ట్నర్స్ తదితర సంస్థలు 115 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. వీటిలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన బి