ఈబే చేతికి పేటీఎమ్ మాల్లో 5.5 శాతం వాటా
By Sakshi

న్యూఢిల్లీ: భారత ఈ కామర్స్ ప్లాట్ఫార్మ్, పేటీఎమ్ మాల్లో 5.5 శాతం వాటాను అమెరికా ఈ-టైలర్ ఈబే కొనుగోలు చేసింది. ఈ వాటా కొనుగోలుకు సంబంధించి ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. ఈ డీల్‌లో భాగంగా పేటీఎమ్ మాల్లో ఒక స్టోర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ఈబే ప్రెసిడెంట్, సీఈఓ డెవిన్ వెన్ చెప్పారు. భారత ఈ కామర్స్ రంగంలో ఈబేకు ఇది మూడో పెట్టుబడి. గతంలో స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఈబే పెట్టుబడులు పెట్టింది.
You may be interested
అలహాబాద్ బ్యాంకులో మరో ఫ్రాడ్
Friday 19th July 2019రూ. 688 మోసానికి పాల్పడిన ఎస్‌ఈఎల్‌ఎం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ కార్యకలాపాల తీరుపై సందేహాలు రేకెత్తించేలా తాజాగా మరో మోసం బైటపడింది. ఎస్ఈఎల్ మ్యాన్యుఫాక్చరింగ్ (ఎస్‌ఈఎల్‌ఎం) రూ. 688.27 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు అలహాబాద్ బ్యాంకు వెల్లడించింది. దీనికి సంబంధించి ప్రొవిజనింగ్ చేసినట్లు, ఫ్రాడ్ గురించి ఆర్బీఐకి కూడా తెలియజేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఎస్‌ఈఎల్‌ఎం దివాలా పిటీషన్‌పై ఎన్సీఎల్టీలో విచారణ జరుగుతున్నట్లు వివరించింది. వారం
తప్పనిసరై జాతీయం
Friday 19th July 2019- బ్యాంకుల జాతీయీకరణకు 50 ఏళ్లు - వ్యవసాయం, చిన్న సంస్థలకు పెరిగిన రుణాలు - నలు దిశలా విస్తరించిన బ్యాంకు శాఖలు - అందరికీ అందుబాటులోకి బ్యాంకింగ్... - ప్రభుత్వ అజమాయిషీతో తప్పుడు నిర్ణయాలు - మొండిబాకీలతో కుదేలవుతున్న పీఎస్‌బీలు - ప్రైవేటీకరణే సరైన పరిష్కారమంటూ సూచనలు!! (సాక్షి, బిజినెస్ విభాగం) సాగుకు రుణాల్లేవు. చిన్న సంస్థలను పట్టించుకునే వారే లేదు. అలాంటి దశలో బ్యాంకుల్ని జాతీయీకరించి... వాటి రుణ ప్రాధాన్యాలను పునఃనిర్వచించింది నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం. చాలా వర్గాలు