News


ఈబీ5 పెట్టుబడులతో అమెరికాలో ప్రయోజనాలు

Friday 21st June 2019
news_main1561099235.png-26471

- అక్టోబర్‌ నుంచి పెరగనున్న పెట్టుబడుల పరిమితి
- ఎంసీఎఫ్‌ఐ ఇండియా డైరెక్టర్‌ వివేక్‌ రావు

హైదరాబాద్‌, బిజినెస్ బ్యూరో: అమెరికాలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అక్కడ స్థానికత్వ ప్రయోజనాలు పొందడానికి ఉపయోగపడే ప్రస్తుత ఈబీ5 విధానం గడువు త్వరలో ముగిసిపోనుందని మేరీల్యాండ్‌ సెంటర్‌ ఫర్‌ ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (ఎంసీఎఫ్‌ఐ) ఇండియా డైరెక్టర్‌ వివేక్‌ రావు తెలిపారు. ప్రస్తుత విధానం కింద 5 లక్షల డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ సరిపోతుందని కొత్తగా అక్టోబర్‌ నుంచి అమల్లోకి వచ్చే విధానం ప్రకారం ఇది 13.5 లక్షల డాలర్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పెట్టుబడి మొత్తం ఈ స్థాయిలో పెరిగితే భారత్‌ నుంచి వచ్చే దరఖాస్తుదారుల సంఖ్య దాదాపు 80-90 శాతం తగ్గిపోవచ్చని రావు అంచనా వేశారు. అక్టోబర్‌లోగా దరఖాస్తు చేసుకున్నవారికి పాత పరిమితులే వర్తిస్తాయని, భారతీయ ఇన్వెస్టర్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. ఈ విధానం కింద సమీకరించే పెట్టుబడులను ఉపాధి కల్పనకు ఊతమిచ్చే రియల్‌ ఎస్టేట్, నిర్మాణ తదితర రంగాల్లో ఇన్వెస్ట్‌ చేయడం జరుగుతుంది. అమెరికాలో ఎక్కడైనా పనిచేసేలా ఇన్వెస్టరుకు గ్రీన్‌కార్డు లభిస్తుంది. ఇన్వెస్టరుతో పాటు వారి కుటుంబానికి కూడా స్థానికత ప్రయోజనాలు అందించే వెసులుబాటు ఈ విధానంలో ఉందని రావు చెప్పారు. అలాగే, నిర్దిష్ట సమయం తర్వాత పెట్టుబడిని కూడా తిరిగి పొందవచ్చు. 
అమెరికాలో గ్రీన్‌కార్డ్‌ పొందే అవకాశం లేనివారు ఇలా ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా గ్రీన్‌కార్డ్‌ను పొందేందుకు అగ్రరాజ్యం వెసులుబాటు కల్పిస్తోంది. ప్రస్తుతం సమీకరించే నిధులను మేరీల్యాండ్‌ రాష్ట్రం వెస్ట్‌ఫేలియా టౌన్‌ సెంటర్‌ నిర్మాణానికి ఉపయోగిస్తోందని, దీని విలువ సుమారు 226 మిలియన్‌ డాలర్లుగా ఉండగా.. 2021లో పూర్తయ్యే నాటికి 624 మిలియన్‌ డాలర్లకు చేరగలదని అంచనాలు ఉన్నట్లు రావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ రాబడులు కూడా అందుకోవచ్చన్నారు.



You may be interested

ఆ లక్ష్యానికి మరో రెండేళ్లు ఆలస్యం:హెరిటేజ్‌

Friday 21st June 2019

హైదరాబాద్‌: డెయిరీ కంపెనీ హెరిటేజ్‌ నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి మరో రెండేళ్లు ఆలస్యం కానుంది. 2022 నాటికి రూ.6,000 కోట్ల టర్నోవర్‌ స్థాయికి చేరుకుంటామని గతంలో కంపెనీ వెల్లడించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది 2024 అవుతుందని తెలిపింది. ‘సరఫరా అధికం కావడంతో పాల సేకరణ ధర తగ్గింది. దీంతో కొన్ని మార్కెట్లలో పాలు, పాల ఉత్పత్తుల ధర తగ్గించాల్సి వచ్చింది. ఈ కారణంగా వృద్ధి మందగించింది. ప్రస్తుతం

టాటా మోటార్స్‌ సీఎఫ్‌ఆర్‌ రేటింగ్‌ తగ్గింపు

Friday 21st June 2019

జేఎల్‌ఆర్‌ బలహీన పనితీరే కారణం  మూడీస్‌ వెల్లడి  న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ కార్పొరేట్‌ ఫ్యామిలీ రేటింగ్‌(సీఎఫ్‌ఆర్‌)ను అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ, మూడీస్‌ తగ్గించింది. అంతే కాకుండా సీనియర్‌ అన్‌సెక్యూర్డ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ రేటింగ్‌ను కూడా తగ్గించింది. టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ పనితీరు బలహీనంగా ఉండటంతో కంపెనీ రుణ స్థితిగతులు దిగజారడం కొనసాగుతోందని, అందుకే రేటింగ్‌ను తగ్గించామని మూడీస్‌ పేర్కొంది. టాటా మోటార్స్‌ అవుట్‌లుక్‌ను ప్రతికూలం స్థాయిలోనే కొనసాగిస్తున్నామని తెలిపింది. కంపెనీ

Most from this category