News


కరోనా దెబ్బతో కుప్పకూలిన 'ఫ్లైబీ'

Friday 6th March 2020
news_main1583474502.png-32323

లండన్: కరోనా వైరస్ మహమ్మారి ధాటికి బ్రిటన్‌కు చెందిన విమానయాన సంస్థ 'ఫ్లైబీ' కుప్పకూలింది. విమాన సేవలు నిర్వహించలేమంటూ చేతులెత్తేసింది.  ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఫ్లైట్స్ ఏర్పాటు చేసే పరిస్థితుల్లో లేమని తమ వెబ్‌సైట్లో ప్రకటించింది. అన్ని ఫ్లైట్స్‌ను నిలిపివేశామని, బ్రిటన్‌లో తక్షణం వ్యాపారం నిలిపివేస్తున్నామని పేర్కొంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే ఎయిర్‌లైన్ మూతబడే పరిస్థితి ఎదురైనా.. బ్రిటన్ ప్రభుత్వం పన్నులపరంగా కొంత వెసులుబాటునివ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. ఇంతలోనే పులిమీద పుట్రలా కరోనా వైరస్ సెగకు విమానసేవలు రద్దు అవుతుండటంతో కంపెనీ కోలుకోలేని పరిస్థితులు తలెత్తాయి. బ్రిటన్‌లో దేశీయంగా విమానసేవలు అందించే భారీ సంస్థ అయిన ఫ్లైబీలో సుమారు 2,000 మంది సిబ్బంది ఉన్నారు. కనెక్ట్ ఎయిర్‌వేస్ కన్సార్షియం గతేడాదే దీన్ని కొనుగోలు చేసింది. అయితే, డిమాండ్ అంతగా లేకపోవడంతో పాటు ఇతర సంస్థలతో పోటీపడటంలో ఫ్లైబీ వెనుకబడింది. 



You may be interested

ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, టెక్నాలజీ.. గుడ్‌!

Friday 6th March 2020

వేల్యుయేషన్స్‌ రీత్యా ఫార్మా, టెక్నాలజీ రంగాలు వృద్ధి అవకాశాల ఆధారంగా ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్స్‌ పెట్టుబడులకు పరిశీలించవచ్చు - సంపత్‌ రెడ్డి, బజాజ్‌ అలయెంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సాధారణంగా మార్కెట్లలో వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్న రంగాలకు ప్రీమియం ధరలు పలుకుతుంటాయని బజాజ్‌ అలయెంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీఐవో సంపత్‌ రెడ్డి చెబుతున్నారు. వెరసి ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్‌ రంగాలను ఈ బాటలో పెట్టుబడులకు సూచిస్తున్నారు. ఇదే విధంగా వేల్యుయేషన్స్‌ రీత్యా ఫార్మా, టెక్నాలజీ రంగాలవైపు దృష్టి సారించవచ్చని

27 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ

Friday 6th March 2020

ఈ నెల 16న స్టాక్‌ మార్కె‍ట్లో లిస్టింగ్‌  న్యూఢిల్లీ: ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ కంపెనీ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ నెల 2న మొదలై గురువారం ముగిసిన ఈ ఐపీఓ 27 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. కరోనా వైరస్‌ స్టాక్‌ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నప్పటికీ, ఈ ఐపీఓ విశేషంగా విజయవంతం కావడం విశేషం. గత 12 ఏళ్లలో ఈ

Most from this category