ఈజ్‌మైట్రిప్ డిస్కౌంట్ ఆఫర్
By Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ ట్రావెల్ సేవల సంస్థ ఈజ్‌మైట్రిప్ తెలంగాణ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా డిస్కౌంటు ఆఫర్లు ప్రకటించింది. తమ పోర్టల్ ద్వారా ఫ్లయిట్ టికెట్లు బుక్ చేసుకునే తెలంగాణవాసులకు దేశీ ఫ్లయిట్స్‌పై రూ.500, అంతర్జాతీయ ఫ్లయిట్స్‌పై రూ. 2,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకురాలు, సీవోవో రికాంత్ పిట్టి తెలిపారు. ఇందుకోసం ఈఎంటీతెలంగాణ అనే ప్రమో కోడ్ అప్లై చేయాల్సి ఉంటుందని గురువారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె వివరించారు. ప్రస్తుతం తమ పోర్టల్‌ను ఉపయోగించే యూజర్లలో 7.5 శాతం మంది తెలంగాణ నుంచే ఉంటున్నారని, ఈ ఏడాది ఆఖరు నాటికి దీన్ని కనీసం 20 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నామని రికాంత్ చెప్పారు. తమ వెబ్సైట్ నుంచి టికెట్ బుకింగ్స్‌పై కన్వీనియన్స్ చార్జీలవంటివి విధించడం లేదని పేర్కొన్నారు.
You may be interested
ఏప్రిల్‌లో 61% తగ్గిన ఈక్విటీ ఎంఎఫ్‌లు
Friday 10th May 2019న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు పెరిగిన కారణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి ప్రవేశించే పెట్టుబడులు మొత్తం ఏకంగా 61 శాతం తగ్గిపోయింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం.. గతనెల్లో కేవలం రూ.4,609 కోట్లు మాత్రమే ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి ప్రవేశించగా, మార్చిలో ఈ మొత్తం రూ.11,756 కోట్లుగా ఉంది. ఫిక్సిడ్ మెచ్యూరిటీ ప్లాన్ల(ఎఫ్ఎంపీ) నుంచి రూ.17,644 కోట్లు, డెట్ ఓరియంటెడ్ స్కీంల
ఏపీ నుంచి మెడికల్..
Friday 10th May 2019తెలంగాణ నుంచి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు స్నాప్‌డీల్‌లో ఎక్కువగా అమ్ముడయ్యేవివే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా అమ్ముడుపోయేవి మెడికల్ ఉత్పత్తులు కాగా, తెలంగాణ నుంచి ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలే ఎక్కువగా కొంటున్నారు. ‘‘హైదరాబాద్ నుంచి కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్స్ మదర్‌బోర్డ్స్, ర్యామ్, బ్యాటరీలు, అడాప్టర్లు, హార్డ్ డివైజ్‌లకు డిమాండ్ ఉంది. కర్నూల్లో స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ డివైజ్‌లు, కేబుల్ చార్జర్లు, స్పీకర్లు, హెడ్ఫోన్లకు, కడప నుంచి ధర్మామీటర్లు, బీపీ,