News


నిత్యావసరాలకు మాత్రమే ఓకే..

Friday 27th March 2020
news_main1585283174.png-32703

  • ఇతర ఆర్డర్లకు నో..
  • ఈ-కామర్స్ సంస్థల నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో నిత్యావసర ఉత్పత్తులే సరఫరా చేయాలని ఈ-కామర్స్ సంస్థలు భావిస్తున్నాయి. నిత్యావసరయేతర ఉత్పత్తులకు తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోరాదని నిర్ణయించుకున్నాయి. "నిత్యావసరాలు, హెల్త్‌కేర్‌, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల కొనుగోలుదారులకు తోడ్పాటు అందించాలని నిర్ణయించుకున్నాం. ఫ్యాషన్‌, మొబైల్‌, యాక్సెసరీస్‌, ఎలక్ట్రానిక్స్ తదితర నిత్యావసరయేతర ఉత్పత్తులకు తాత్కాలికంగా కొత్త ఆర్డర్లు తీసుకోబోము" అని పేటీఎం మాల్ ఒక ప్రకటనలో తెలిపింది. డెలివరీలు సత్వరం చేసేందుకు వెసులుబాటు లభించేలా ప్రభుత్వ వర్గాలు, లాజిస్టిక్స్ సంస్థలతో సంప్రతింపులు జరుపుతున్నట్లు వివరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉపయోగపడే ఆయుర్వేద ఔషధాలు, హ్యాండ్ శానిటైజర్లు మొదలైనవి తక్షణం సరఫరా చేయగలిగే విక్రేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది.

ఆర్డర్ల డెలివరీల్లో జాప్యం: అమెజాన్‌
లాక్‌డౌన్‌పరమైన ఆంక్షల కారణంగా ఆర్డర్ల డెలివరీల్లో మరికాస్త జాప్యం జరిగే అవకాశం ఉందని అమెజాన్‌ ఇండియా తన వెబ్‌సైట్లో పేర్కొంది. "ప్రీపెయిడ్ పేమెంట్ విధానంలో అత్యవసర ఉత్పత్తులకు మాత్రమే కొత్త ఆర్డర్లు తీసుకుంటున్నాం.  ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించుకుంటూ, సాధ్యమైనంత త్వరగా డెలివరీ సేవలు పునరుద్ధరించేంుకు ప్రయత్నిస్తున్నాం" అని వివరించింది. 

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం...
అటు మరో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. నిత్యావసర సరుకుల డెలివరీ సేవలను ప్రారంభించింది. "ఆర్డర్ల ప్రాధాన్యాన్ని బట్టి సాధ్యమైనంత త్వరగా మీకు డెలివర్ చేస్తాము. ఇతర ఉత్పత్తులకు ఆర్డర్లు తాత్కాలికంగా తీసుకోవడం లేదు. కానీ వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాము" అని తమ వెబ్‌సైట్‌లో ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. స్థానిక అధికారుల తోడ్పాటుతో కార్యకలాపాలన్నీ యథావిధిగా ప్రారంభించినట్లు ఆన్‌లైన్‌ గ్రోసరీ సంస్థ గ్రోఫర్స్‌ వెల్లడించింది. అయితే, గ్రోఫర్స్‌ పోటీ సంస్థ అయిన బిగ్‌బాస్కెట్ వెబ్‌సైట్‌ మాత్రం కొత్త కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకోవడం లేదు. క్లిక్‌పోస్ట్-షాడోఫ్యాక్స్‌ నివేదిక ప్రకారం.. మార్చి 10-20 మధ్య ఈ-కామర్స్ కంపెనీలు తీసుకున్న ఆర్డర్ల డెలివరీల్లో తీవ్ర జాప్యం ఉంటోంది.  



You may be interested

ప్రభుత్వం నుంచి మరిన్ని చర్యలు

Friday 27th March 2020

ఎస్‌బీఐ చీఫ్‌ రజనీష్‌కుమార్‌ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సకాలంలో ఉపశమన ప్యాకేజీని తీసుకొచ్చిందని ఎస్‌బీఐ చీఫ్‌ రజనీష్‌కుమార్‌ అన్నారు. పేద వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.1.7  లక్షల కోట్ల ప్యాకేజీని గురువారం ప్రకటించిన విషయం తెలిసినదే. కోవిడ్‌-19 మహమ్మారి ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలియదు కనుక రానున్న రోజుల్లో ప్రభుత్వం మరిన్ని చర్యలను ప్రకటించే అవకాశం ఉంటుందని రజనీష్‌కుమార్‌ అంచనా వేశారు. అంతర్జాతీయంగా ఆర్థిక

సెన్సెక్స్‌.. రాకెట్‌ స్పీడ్‌

Friday 27th March 2020

31,000 పాయింట్ల ఎగువకు నిఫ్టీ 330 పాయింట్ల హైజంప్‌ అన్ని రంగాలూ లాభాల్లోనే మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 3 శాతం అప్‌ సెన్సెక్స్‌ 1150 పాయింట్లు ప్లస్‌ ఇండస్‌ఇండ్‌, యాక్సిస్‌ దూకుడు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు జోరందుకున్నాయి.  ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇండెక్సులు మరోసారి దూకుడు చూపుతున్నాయి. తొలుత సెన్సెక్స్‌  1150 పాయింట్లు దూసుకెళ్లి 31,105కు చేరింది. తద్వారా తిరిగి 31,000 పాయింట్ల

Most from this category