News


పండుగల సీజన్‌లో 1.40 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు

Wednesday 25th September 2019
news_main1569384037.png-28527

- అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ భారీ నియామకాలు
న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ సంస్థలు పండుగల సీజన్‌లో భారీ తాత్కాలిక ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. దసరా, దీపావళి పండుగల అమ్మకాల కోసం 90,000 మందిని తాత్కాలికంగా నియమించుకోనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. క్రమబద్ధీకరణ కేంద్రాలు, డెలివరీ స్టేషన్లు, కస్టమర్ సేవా వంటి విభాగాల్లో వీరి నియామకం జరగనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే నగరాల్లో తాత్కాలిక ఉద్యోగుల నియామకం జరగనున్నట్లు వివరించింది. మరో ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఈ సీజన్‌లో తాత్కాలికంగా 50,000 ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించనున్నట్లు ప్రకటించింది. సప్లై చైన్‌, కస్టమర్ సపోర్ట్‌, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో వీరి అవసరం ఉందని తెలిపింది. 



You may be interested

పీఎంసీ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు

Wednesday 25th September 2019

-పెద్ద ఎత్తున ఎన్‌పీఏల దాచివేత  -ఎన్నో నిబంధనల ఉల్లంఘన -వెలుగు చూడడంతో ఆరు నెలలపాటు ఆంక్షలు -ఒక్కో ఖాతా నుంచి రూ.1,000 మాత్రమే ఉపసంహరణ ముంబై: ముంబై కేంద్రంగా, పలు రాష్ట్రాల్లోని పట్టణాల్లో కార్యకలాపాలు నిర్వహించే.. పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంకుపై ఆరు నెలల పాటు ఆంక్షలు విధిస్తూ ఆర్‌బీఐ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వసూలు కాని మొండి బకాయిలను (ఎన్‌పీఏలు) తక్కువగా చూపించడంతోపాటు పీఎంసీలో ఎన్నో నిబంధనల ఉల్లంఘనను ఆర్‌బీఐ

పెట్టుబడుల ఆకర్షణీయ దేశంగా భారత్‌!

Wednesday 25th September 2019

- కార్పొ పన్ను కోతతో కీలక పరిణామం - ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ - ఆర్థికమంత్రితో భేటీ న్యూఢిల్లీ: కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో భారత్‌ పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా మారిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనదిగా ఆయన అభివర్ణించారు.   ఆర్థిక మందగమనానికి మందుగా దేశీయ కంపెనీలపై 30 శాతంగా ఉన్న పన్నును 25.2 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మలా

Most from this category