News


ఈ-అసెస్‌మెంట్ వ్యవస్థ ప్రారంభం

Tuesday 8th October 2019
news_main1570510286.png-28768


- తొలిదశలో పరిశీలనకు 58 వేల కేసులు
- ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు నోటీసులు

న్యూఢిల్లీ: పన్ను విధానాల సంస్కరణల్లో భాగంగా ఆదాయపు పన్ను శాఖ మరో కీలక ప్రతిపాదనను అమల్లోకి తెచ్చింది. పన్నుల మదింపు ప్రక్రియలో అధికారుల ప్రమేయాన్ని గణనీయంగా తగ్గించే దిశగా ఎలక్ట్రానిక్‌ (ఫేస్‌లెస్‌) అసెస్‌మెంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన నేషనల్ ఈ-అసెస్‌మెంట్ సెంటర్‌ను (ఎన్‌ఈఏసీ) కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్‌ భూషణ్ పాండే సోమవారం ప్రారంభించారు. ఈ-అసెస్‌మెంట్ అందుబాటులోకి రావడంతో అసెసింగ్ అధికారులను పన్ను చెల్లింపుదారులు ప్రత్యక్షంగా కలవాల్సిన సందర్భాలు గణనీయంగా తగ్గనున్నాయి. ఈ-అసెస్‌మెంట్ ప్రక్రియ కోసం మొదటి దశలో ఎన్‌ఈఏసీ ప్రత్యేకంగా 58,322 ఆదాయపు పన్ను కేసులను ఎంపిక చేసినట్లు పాండే తెలిపారు. 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ 30 నాటికి ఆయా పన్ను చెల్లింపుదారులకు ఈ-నోటీసులు కూడా జారీ అయినట్లు ఆయన వివరించారు. ఈ-మెయిల్స్‌, ఈ-ఫైలింగ్ అకౌంట్స్‌ ద్వారా నోటీసులు అందుకున్న వారు 15 రోజుల్లోగా వివరణ సమర్పించాల్సి ఉంటుంది. "స్క్రూటినీ కోసం ఎంపికైన వారు అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లోనే సమర్పించవచ్చు.  అసెస్‌మెంట్‌లో ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది ప్రమేయాన్ని గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రవేశపెట్టడం జరిగింది. దీనితో పన్నుల చెల్లింపు ప్రక్రియ సులభతరంగాను, పారదర్శకంగాను, సమర్ధమంతంగాను మారగలదు. అసెస్‌మెంట్ విధానం కూడా మెరుగుపడుతుంది. కేసులను సత్వరం పరిష్కరించే వీలవుతుంది" అని పాండే చెప్పారు. వాస్తవానికి దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. అధికారిక కార్యక్రమాలతో ఆమెకు తీరిక లేకపోవడంతో పాండే ఆవిష్కరించారు. 
8 ప్రాంతీయ కేంద్రాలు..
పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా ఎన్‌ఈఏసీ కీలక అడుగని ఆర్థిక శాఖ పేర్కొంది. ఇది స్వతంత్ర కార్యాలయంగా పని చేస్తుంది. ఢిల్లీలోని ఎన్‌ఈఏసీకి ఆదాయపు పన్ను విభాగం ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌ సారథ్యం వహిస్తారు. హైదరాబాద్‌ సహా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా తదితర ఎనిమిది నగరాల్లో ప్రాంతీయ ఈ-అసెస్‌మెంట్ కార్యాలయాలు (ఆర్‌ఈఏసీ) ఉంటాయి. వీటిల్లో ఒక అసెస్‌మెంట్ విభాగం, సమీక్ష, సాంకేతిక, ధృవీకరణ విభాగాలు ఉంటాయి. ప్రతీ ఆర్‌ఈఏసీకి ఆదాయపు పన్ను విభాగం చీఫ్ కమిషనర్‌ సారథ్యం వహిస్తారు. ఈ విధానం అమలు కోసం 2,686 మంది ఆదాయపు పన్ను విభాగం (ఐటీ) అధికారులను నియమించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 12న ఈ-అసెస్‌మెంట్ స్కీమ్‌ 2019ని ప్రకటించడం జరిగింది. 



You may be interested

నిప్పన్‌ చేతికి రిలయన్స్‌ ఏఎంసీ వ్యాపారం

Tuesday 8th October 2019

- రూ. 6,000 కోట్లు చెల్లించి 75 శాతం వాటా కైవసం - నిప్పన్‌ ఇండియా ఎంఎఫ్‌గా పేరు మార్పు ముంబై: రిలయన్స్‌ క్యాపిటల్‌కు చెందిన అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ)లో.. జపాన్‌కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం నిప్పన్‌ లైఫ్ తనకు ఉన్న వాటాను పెంచుకోవడం ద్వారా ఏఎంసీ వ్యాపారాన్ని కైవసం చేసుకుంది. అనీల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌కు రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌ (ఆర్‌నామ్‌)లో ఉన్న మొత్తం

రూ. 10వేల కోట్ల సమీకరణలో ఓయో

Tuesday 8th October 2019

అమెరికా, యూరప్‌లో విస్తరణకు వినియోగం న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సంస్థ ఓయో తాజాగా 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10,650 కోట్లు) సమీకరించనున్నట్లు వెల్లడించింది. అమెరికాలో విస్తరణకు, యూరప్‌లో కార్యకలాపాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వివరించింది. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్.. ఆర్‌ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్‌ ద్వారా 700 మిలియన్ డాలర్లు సమకూర్చనుండగా, మిగతా 800 మిలియన్ డాలర్ల నిధులను ప్రస్తుతం ఉన్న

Most from this category