News


డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ లాభంలో భారీ వృద్ధి

Saturday 1st June 2019
news_main1559364679.png-26033

  • 2018-19లో రూ.44.59 కోట్లుగా నమోదు
  • ఒక్కో షేరుకు రూ.3 డివిడెండ్‌

పాతపోస్టాఫీసు (విశాఖ): డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) టర్నోవర్‌ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.698.51 కోట్లకు చేరుకుందని ఆ  సంస్థ శుక్రవారం ప్రకటించింది. 2017–18 సంవత్సరంలో సంస్థ టర్నోవర్‌ రూ.612.12 కోట్లుగా ఉండడం గమనార్హం. 2017–18 ఆర్ధిక సంవత్సరంలో డీసీఐకి రూ.17.14 కోట్ల నికర లాభం రాగా, అది 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రూ.44.59 కోట్లకు వృద్ధి చెందింది. వాటాదారులకు 2018-19 సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.3 డివిడెండ్‌గా చెల్లించేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కోల్‌కతా (హాల్దియా) పోర్ట్, కొచ్చిన్‌ పోర్ట్, కామరాజార్‌ (ఎన్నొర్‌) పోర్ట్, పారదీప్‌ పోర్ట్, కొచ్చిన్‌ షిప్‌యార్డ్, విశాఖపట్నం పోర్ట్, మోంగ్ల పోర్ట్‌ (బంగ్లాదేశ్‌), గుజరాత్‌ మేరీటైం బోర్డ్, ఇండియన్‌ నేవీ (కొచ్చి), గంగవరం పోర్ట్, ముంబై పోర్ట్‌లలో డ్రెడ్జింగ్‌ పనులను చేపట్టినట్టు వెల్లడించింది. 



You may be interested

ఉద్యోగుల రవాణాకు ఈ–వాహనాలు

Saturday 1st June 2019

నెల రోజుల్లో హైదరాబాద్‌లో రూట్‌మ్యాటిక్‌ సేవలు షురూ తొలుత 10.. సెప్టెంబర్‌ కల్లా 600 వాహనాలు అందుబాటులోకి ప్రస్తుతం 12 నగరాల్లో సేవలు; రోజుకు 1.50 లక్షల మంది ప్రయాణం ఈ ఏడాది ముగింపులోగా రూ.175 నిధుల సమీకరణ ‘స్టార్టప్‌ డైరీ’తో కో–ఫౌండర్‌ సురాజిత్‌ దాస్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఉద్యోగులకు రవాణా సేవలందిస్తున్న రూట్‌మ్యాటిక్‌ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తొలుత 10 వాహనాలతో నెల రోజుల్లో సేవలను ప్రారంభించనుంది. ఇప్పటికే సాంకేతికత, మార్కెటింగ్‌ నిపుణులు

హిందుజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌ లాభం 55 కోట్లు

Saturday 1st June 2019

6శాతం వృద్ధి  న్యూఢిల్లీ: హిందుజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌(హెచ్‌జీఎస్‌) కంపెనీ గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.55 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం(రూ.51 కోట్లు)తో పోల్చితే 6 శాతం వృద్ధి సాధించామిన హిందుజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.1,004 కోట్ల నుంచి 28 శాతం వృద్ధితో రూ.1,285 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ పార్థ

Most from this category