News


డాక్టర్‌ రెడ్డీస్‌ చేతికి వొకార్డ్‌ దేశీ బిజినెస్‌

Wednesday 12th February 2020
news_main1581501886.png-31730

డీల్‌ విలువ రూ. 1850 కోట్లు
విభిన్ని విభాగాల 62 బ్రాండ్లు కొనుగోలు
6.5 శాతం పతనమైన వొకార్డ్‌ షేరు

దేశీ ఫార్మా రంగం‍లో తాజాగా కన్సాలిడేషన్‌కు తెరలేచింది. ఫార్మా రంగ హైదరాబాద్‌ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌.. హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ వొకార్డ్‌ లిమిటెడ్‌ దీనిలో భాగంకానున్నాయి. వొకార్డ్‌కు చెందిన దేశీ బిజినెస్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ కొనుగోలు చేయనుంది. ఎంపిక చేసిన కొన్ని విభాగాలను కొనుగోలు చేసేందుకు వొకార్డ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తాజాగా వెల్లడించింది. ఇండియాతోపాటు.. నేపాల్‌, శ్రీలంక, భూటాన్‌, మాల్టీవుల బిజినెస్‌ను సొంతం చేసుకోనున్న ఈ డీల్‌ విలువ రూ. 1850 కోట్లుకాగా.. వొకార్డ్‌కు చెందిన 62 బ్రాండ్లు డాక్టర్‌ రెడ్డీస్‌ పరంకానున్నాయి. శ్వాసకోస, కేంద్ర నాడీమండల, చర్మ వ్యాధుల విభాగాలకు చెందిన పలు బ్రాండ్లను డాక్టర్‌ రెడ్డీస్‌ సొంతం చేసుకోనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఉదరకోశ వ్యాధులు, నొప్పి నివారణ తదితర విభాగాల బ్రాండ్లతోపాటు.. కొన్ని వ్యాక్సిన్లను సైతం డాక్టర్‌ రెడ్డీస్‌ పోర్ట్‌ఫోలియోలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. 

ప్లాంటు సైతం
వొకార్డ్‌కు చెందిన అమ్మకాలు, మార్కెటింగ్‌ టీములతోపాటు.. హిమాచల్‌ప్రదేశ్‌లోని బడ్డిలోగల తయారీ ప్లాంటు సైతం డాక్టర్‌ రెడ్డీస్‌ చేజిక్కించుకోనుంది. స్లంప్‌సేల్‌ ప్రాతిపదికన ఈ డీల్‌ కుదుర్చుకున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలియజేసింది. దేశీ మార్కెట్‌కు ప్రాధాన్యత ఉన్నదని, వొకార్డ్‌ బిజినెస్‌ కొనుగోలు ద్వారా ఇక్కడ మరింత విస్తరించేందుకు వీలు చిక్కనుందని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబ్‌ కోచైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాజా కొనుగోలుతో అధిక వృద్ధికి అవకాశమున్న విభాగాలలో కంపెనీకి మరిన్ని అవకాశాలు లభించనున్నట్లు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో డీల్‌ను పూర్తిచేసే వీలున్నట్లు వెల్లడించారు. 

2015లోనూ
ఇంతక్రితం 2015లో బెల్జియం కంపెనీ యూసీబీకి చెందిన దేశీ బిజినెస్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ లేబ్‌ కొనుగోలు చేసింది. ఎంపిక చేసిన ప్రొడక్టు పోర్ట్‌ఫోలియో కోసం రూ. 800 కోట్లు వెచ్చించింది. తద్వారా ఇండియాసహా, నేపాల్‌, శ్రీలంక, మాల్టీవులలో యూసీబీ బిజినెస్‌ను సొంతం చేసుకుంది. శ్వాసకోస, చర్మ సంబంధ, చిన్న పిల్లల వ్యాధుల చికిత్సకు సంబంధించిన బ్రాండ్లను యూసీబీ నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌ దక్కించుకుంది. దేశీ మార్కెట్లలోని టాప్‌-5 కంపెనీలలో ఒకటిగా నిలవాలని చూస్తున్నట్లు ఇటీవల డాక్టర్‌ రెడ్డీస్‌ లేబ్‌ పేర్కొనడం గమనార్హం!

వొకార్డ్‌ డౌన్‌
వొకార్డ్‌ దేశీ బిజినెస్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌కు విక్రయిస్తున్న వార్తల నేపథ్యంలో ఈ కౌంటర్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. సాయంత్రం 3.20 ప్రాంతంలో డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు నామమాత్ర లాభంతో రూ. 3196 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 3214-3164 మధ్య ఊగిసలాడింది. ఇక వొకార్డ్‌ షేరు 6.5 శాతం పతనమై రూ. 368 వద్ద ట్రేడవుతోంది. తొలుత 406 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 362 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది.You may be interested

8శాతం నష్టంతో ముగిసిన వోడాఫోన్‌ ఐడియా

Wednesday 12th February 2020

ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత   వోడాఫోన్‌ ఐడియా కంపెనీ షేరు బుధవారం 8శాతం నష్టంతో ముగిసింది. కంపెనీ గురువారం మూడో త్రైమాసిక ఫలితాల విడుదల నేపథ్యంలో అప్రమత్తత వహిస్తుండటం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో రూ.4.87ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో షేరు ఒక దశలో 9.50శాతం క్షీణించి రూ.4.87 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్‌ ముగిసే

క్యూ3 ఓకే కానీ అప్‌ట్రెండ్‌కు చాన్స్‌ తక్కువే!!

Wednesday 12th February 2020

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18 పీఈలో ట్రేడవుతోంది కార్పొరేట్‌ ట్యాక్స్‌ కోతతో ఫలితాలు గుడ్‌ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే వెలువడ్డాయి. అయితే ఇప్పటికే ర్యాలీ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లకు మరింత పుష్‌నిచ్చే అంశాలు కొరవడ్డాయంటున్నారు సిద్ధార్థ ఖేమ్కా. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కార్పొరేట్ల లాభదాకయతను పెంచినట్లు పేర్కొన్నారు. మార్కెట్లతోపాటు.. మెటల్స్‌, ఎన్‌బీఎఫ్‌సీ తదితర రంగాలపై ఒక

Most from this category