News


డాక్టర్‌ రెడ్డీస్‌కు రూ.570 కోట్ల నష్టం

Tuesday 28th January 2020
news_main1580180710.png-31249

(అప్‌డేటెడ్‌...)

  • ఆదాయం 14 శాతం పెరిగి రూ.4,384 కోట్లు
  • ఎబిటా 24 శాతం అధికమై రూ.1,074 కోట్లకు

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఆర్థిక ఫలితాల విషయంలో అనలిస్టుల అంచనాలు తారుమారయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో భారీ నష్టం చవిచూసింది. ఈ కాలంలో కంపెనీ రూ.569.7 కోట్ల నష్టం ప్రకటించింది. 2018-19 క్యూ3లో రూ.485 కోట్ల నికరలాభం ఆర్జించింది. డిసెంబరు త్రైమాసికంలో ఆదాయం రూ.4,384 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 14 శాతం పెరుగుదల. ఇక ఎబిటా క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 24 శాతం అధికమై రూ.1,074 కోట్లుగా ఉంది. డిసెంబరు త్రైమాసికంలో అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచామని డాక్టర్‌ రెడ్డీస్‌ కో-చైర్మన్‌ జి.వి.ప్రసాద్‌ తెలిపారు. బలమైన ఎబిటా మార్జిన్స్‌ నమోదు చేశామని చెప్పారు. జి-నువారింగ్‌తోపాటు కొన్ని ఉత్పత్తుల బ్రాండ్‌ విలువ పడిపోవడం, ఆ మేరకు కేటాయింపులు చేయడం వల్ల నష్టం చవిచూడాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది. ఈ కేటాయింపులు రూ.1,320 కోట్లుగా ఉన్నాయని డాక్టర్‌ రెడ్డీస్‌ సీఎఫ్‌ఓ సౌమెన్‌ చక్రవర్తి, సీఈవో ఎరెజ్‌ ఇజ్రాయెలి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు.
కలిసొచ్చిన గ్లోబల్‌ జనరిక్స్‌...
కంపెనీకి గ్లోబల్‌ జనరిక్స్‌ కలిసొచ్చాయి. ఈ విభాగం నుంచి ఆదాయం రూ.3,593 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం పెరుగుదల. యూరప్‌, కొత్తగా ఉద్భవిస్తున్న మార్కెట్లు, భారత్‌ ఈ ఆదాయ వృద్ధికి దోహదం చేశాయి. ఉత్తర అమెరికా నుంచి 8 శాతం వృద్ధితో రూ.1,600 కోట్ల ఆదాయం సమకూరింది. యూఎస్‌ మార్కెట్లో ఈ త్రైమాసికంలో కంపెనీ అయిదు కొత్త ఉత్పత్తులు విడుదల చేసింది. ఎమర్జింగ్‌ మార్కెట్ల నుంచి రూ.920 కోట్లు, భారత్‌ నుంచి రూ.763 కోట్ల రెవెన్యూ నమోదైంది. యూరప్‌ నుంచి 52 శాతం వృద్ధితో రూ.310 కోట్ల రెవెన్యూ సాధించింది. ఫార్మాస్యూటికల్‌ సర్వీసులు, యాక్టివ్‌ ఇంగ్రీడియెంట్స్‌ నుంచి ఆదాయం రూ.690 కోట్లు వచ్చింది. 2018-19 క్యూ3తో పోలిస్తే ఇది 16 శాతం పెరుగుదల. ప్రొప్రైటరీ ప్రొడక్ట్స్ విభాగం రెవెన్యూ 18 శాతం తగ్గి రూ.100 కోట్లుగా ఉంది. పరిశోధన, అభివృద్ధికి అక్టోబరు-డిసెంబరు కాలంలో డాక్టర్‌ రెడ్డీస్‌ రూ.390 కోట్లు వెచ్చించింది. 



You may be interested

రెండు రెట్లకు మించిన ఇండిగో లాభం

Tuesday 28th January 2020

మొత్తం ఆదాయం 26 శాతం అప్‌ 2 శాతం తగ్గిన ఇంధన వ్యయాలు  న్యూఢిల్లీ/ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ, ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో రెండు రెట్లకు మించి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.185 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.496 కోట్లకు పెరిగిందని ఇండిగో సీఈఓ రనోజాయ్‌ దత్తా తెలిపారు.  మొత్తం

దిగుమతి సుంకాలు తగ్గించాలి..

Tuesday 28th January 2020

పసిడి.. వజ్రాభరణాల పరిశ్రమ డిమాండ్‌ భారత్‌ ఏటా 800–900 టన్నుల పసిడి దిగుమతి చేసుకుంటోంది. 2018–19లో పసిడి దిగుమతులు 22.16 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. భారీగా పెరుగుతున్న కరెంటు అకౌంటు లోటును కట్టడి చేసే దిశగా పసిడిపై విధించిన సుంకాలతో.. దిగుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య కాలంలో 7 శాతం క్షీణించి 20.57 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. అదే సమయంలో వజ్రాభరణాల దిగుమతులు కూడా

Most from this category