News


హెచ్‌సీఎల్‌ టెక్‌ 1:1 బోనస్‌

Thursday 24th October 2019
news_main1571887214.png-29093

  • 7 శాతం వృద్ధితో రూ.2,711 కోట్లకు నికర లాభం 
  • ఒక్కో షేర్‌కు రూ. 2 డివిడెండ్‌
  • ఆదాయ అంచనాలు పెంపు 

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ బోనస్‌ షేర్లను ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు ఒక్కో షేర్‌ను (1:1)ఉచితంగా ఇవ్వనునున్నది. అంతే కాకుండా ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 2 డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో నికర లాభం 7 శాతం పెరిగిందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. గత క్యూ2లో రూ.2,534 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.2,711 కోట్లకు పెరిగిందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ సి. విజయ్‌ కుమార్‌ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.14,860 కోట్ల నుంచి 18 శాతం ఎగసి రూ.17,527 కోట్లకు పెరిగిందని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 6 శాతం వృద్ధితో 38 కోట్ల డాలర్లకు, ఆదాయం 18 శాతం వృద్ధితో 248 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. 

15-17 శాతం ఆదాయ వృద్ధి ...! 
ఆదాయ వృద్ధి అంచనాలను(నిలకడైన కరెన్సీ మారకం రేటు పరంగా) తాజాగా ఈ కంపెనీ పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14-16 శాతం మేర ఆదాయం వృద్ధి చెందగలదని గతంలో ఈ కంపెనీ అంచనా వేసింది. ఈ ఆదాయ వృద్ధి అంచనాలను తాజాగా 15-17 శాతానికి పెంచుతున్నామని విజయ్‌ కుమార్‌ తెలిపారు.  1:1 బోనస్‌ షేర్లను ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని, వాటాదారుల, ఇతర నియంత్రణ సం‍స్థల ఆమోదాలు పొందాల్సి ఉందని వివరించారు. తమ విభాగం హెచ్‌సీఎల్‌ లైట్స్‌ మరోసారి మంచి వృద్ధిని సాధించిందని చెప్పారు.  ఐటీ సేలవకు సంబంధించిన ధరల నిర్ణయం, వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా స్థూల లాభం 20 శాతం మేర పెరిగిందని చెప్పారు. 

13,430 కొత్త ఉద్యోగాలు...! 
ఈ క్యూ2లో కొత్తగా 13,430 మందికి ఉద్యోగాలిచ్చామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.47,123కు పెరిగిందని విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఉద్యోగుల వలస(ఆట్రీషన్‌ రేటు) 16.9 శాతంగా ఉందని చెప్పారు. You may be interested

వియ్‌వర్క్‌కు సాఫ్ట్‌బ్యాంకు 9.5 బిలియన్ డాలర్ల ప్యాకేజీ

Thursday 24th October 2019

టోక్యో: సంక్షోభంలో చిక్కుకున్న ఆఫీస్‌-షేరింగ్ సేవల స్టార్టప్ సంస్థ వియ్‌వర్క్‌ను గట్టెక్కించేందుకు ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్‌ తాజాగా 9.5 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో 5 బిలియన్ డాలర్లు కొత్తగా ఇన్వెస్ట్ చేయడంతో పాటు ప్రస్తుత షేర్‌హోల్డర్ల నుంచి షేర్లను కొనుగోలు చేసేందుకు 3 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. షేర్ల కొనుగోలు ప్రక్రియ ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో చేపట్టనున్నట్లు సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్‌ మసయోషి సన్ తెలిపారు. ప్రస్తుతం

ఇండియన్‌ బ్యాంక్‌ లాభం రెట్టింపు

Thursday 24th October 2019

మొత్తం ఆదాయం రూ.6,045 కోట్లు  నిలకడగా రుణ నాణ్యత న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రెండింతలు పెరిగింది. గతక్యూలో రూ.150 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.359 కోట్లకు పెరిగిందని ఇండియన్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,219 కోట్ల నుంచి రూ.6,045 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  తగ్గిన కేటాయింపులు... ఈ బ్యాంక్‌ రుణ నాణ్యత నిలకడగా ఉంది. గత క్యూ2లో

Most from this category