News


ఎయిర్‌టెల్‌, వొడా ఐడియాలకు రూ.3,050 కోట్ల పెనాల్టీ!

Tuesday 18th June 2019
news_main1560836718.png-26368

  • డిజిటల్‌ కమ్యూనికేసన్‌ కమిషన్‌ ఆమోదముద్ర
  • జియోకు ఇంటర్‌కనెక్షన్‌ పాయింట్లు ఇవ్వని ఫలితం
  • పెనాల్టీ వేసే ముందు ట్రాయ్‌ సూచనలు పరిగణనలోకి

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ కాల్స్‌కు ఇంటర్‌ కనెక్షన్‌ పాయింట్లను సమకూర్చనందుకు గాను భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలకు భారీ పెనాల్టీ భారం పడింది. టెలికం శాఖ అత్యున్నత నిర్ణయాల విభాగం డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (డీసీసీ) పెనాల్టీ విధించే నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. అయితే, టెలికం రంగంలో తీవ్ర ఆర్థిక సమస్యల నేపథ్యంలో రూ.3,050 కోట్ల జరిమానాను అమలు చేసే ముందు దీన్ని సవరించే విషయంలో ట్రాయ్‌ సూచనలను తీసుకోవాలని కమిషన్‌ నిర్ణయించింది. టెలికం రంగంలోకి కొత్తగా ప్రవేశించిన జియోకు ఇంటర్‌కనెక్షన్‌ పాయింట్లను ఇచ్చేందుకు నిరాకరించిన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలపై రూ.3,050 కోట్ల పెనాల్టీని విధించాలని 2016 అక్టోబర్‌లో ట్రాయ్‌ సిఫారసు చేసింది. ఇందులో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లకు రూ.1,050 కోట్ల చొప్పున, ఐడియాపై రూ.950 కోట్ల జరిమానా అమలు చేయాల్సి ఉంది. వొడాఫోన్‌, ఐడియాలు విలీనమై ఒకే సంస్థగా ఏర్పడడంతో ఇప్పుడు ఉమ్మడి జరిమానాను వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సి ఉంటుంది. పోటీ సంస్థలు సరిపడా ఇంటర్‌ కనెక్షన్‌ పాయింట్లను సమకూర్చకపోవడంతో తమ నెట్‌వర్క్‌కు సంబంధించి 75 శాతం కాల్స్‌ ఫెయిల్‌ అవుతున్నాయంటూ జియో చేసిన ఫిర్యాదు ఆధారంగా ట్రాయ్‌ నాడు చర్యలకు ఆదేశించింది. అయితే, నాణ్యమైన సేవలను తన కస్టమర్లకు అందించనందుకు రిలయన్స్‌ జియోపై కూడా పెనాల్టీ విధించాల్సి ఉంటుందని, నాణ్యమైన సేవలందించే ప్రాథమిక బాధ్యతను ఇతరులపై మోపవచ్చా? అంటూ డీసీసీలో భాగమైన ఓ శాఖా కార్యదర్శి ప్రశ్నించగా... దీన్ని డీసీసీ సభ్యులు కొట్టిపారేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 



You may be interested

టారిఫ్‌లపై దూకుడు వద్దు!!

Tuesday 18th June 2019

ట్రంప్‌కు అమెరికా కంపెనీల సూచన వినియోగదారులపై ధరల భారం కంపెనీల వ్యాపార అవకాశాలకు నష్టం పోటీలో నిలవలేమంటూ ఆందోళనలు వాషింగ్టన్‌: చైనా ఉత్పత్తులన్నింటిపైనా టారిఫ్‌లను 25 శాతానికి పెంచేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించగా... ఈ విషయంలో ఒక్క అడుగు ముందుకు వేసినా పరోక్షంగా అమెరికా కంపెనీలు, వినియోగదారులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడి కంపెనీలు దేశాధ్యక్షుడిని హెచ్చరించాయి. చైనా నుంచి దిగుమతయ్యే 250 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే

ఫ్రీగా అయితే చూసేస్తాం!!

Tuesday 18th June 2019

ఆన్‌లైన్ కంటెంట్‌పై 25 శాతం మంది అభిప్రాయమిది తక్కువ ఫీజులు కట్టేందుకు 25% మంది సంసిద్ధత బ్రైట్‌కోవ్ నివేదికలో వెల్లడి ముంబై: ప్రకటనల బెడద ఉన్నప్పటికీ దేశీయంగా 25 శాతం మంది వినియోగదారులు ఓవర్‌ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌పై కంటెంట్‌ను ఉచితంగా చూసేందుకే ఇష్టపడుతున్నారు. పరిమితమైన ప్రకటనలతో ఎంతో కొంత చెల్లించి కంటెంట్‌ను వినియోగించుకునేందుకు ఆసక్తి చూపే వారు పాతిక శాతం మంది ఉంటున్నారు. అంతర్జాతీయంగా వీడియో క్లౌడ్ సర్వీసులు అందించే బ్రైట్‌కోవ్

Most from this category