News


రూ. 1.72 లక్షల కోట్ల బకాయిలు కట్టండి

Monday 23rd December 2019
news_main1577071954.png-30368

  • గెయిల్ ఇండియాకు టెలికం విభాగం లేఖ

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సర్వీస్ లైసెన్సు (ఐఎస్‌పీ) ఫీజులు తదితర బాకీలకు సంబంధించి ఏకంగా రూ. 1.72 లక్షల కోట్లు కట్టాలంటూ ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియాకు టెలికం విభాగం లేఖ పంపింది. ఐపీ-1, ఐపీ-2, ఐఎస్‌పీ లైసెన్సు ఫీజుల బకాయిల కింద రూ. 1,72,655 కోట్లు చెల్లించాలని ఇందులో సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఇప్పటికే కట్టాల్సినదంతా కట్టేశామని .. ఇక చెల్లించాల్సిన బాకీలంటూ ఏమీ లేవని గెయిల్ ప్రత్యుత్తరంలో పేర్కొన్నట్లు వివరించాయి. 2002లో తీసుకున్న ఐఎస్‌పీ లైసెన్సు గడువు 2017తో తీరిపోయిందని గెయిల్ తెలిపింది. అసలు దీనితో వ్యాపారమేమీ చేయనందున ఆదాయార్జన ప్రసక్తే లేదని పేర్కొంది. ఇక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ కేటగిరీ 1, 2 కింద తీసుకున్న లైసెన్సులపై 2001-02 నుంచి రూ. 35 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని.. టెలికం విభాగం చెబుతున్నట్లుగా రూ. 2,49,788 కోట్లు కాదని స్పష్టం చేసింది. మరోవైపు, టెలికం విభాగం అడుగుతున్న మొత్తం .. గెయిల్ కంపెనీ విలువకు ఏకంగా మూడు రెట్లు ఉంటుందని సంస్థ వర్గాలు వ్యాఖ్యానించాయి. టెలికంయేతర వ్యాపారాల ద్వారా వచ్చిన రెవెన్యూను కూడా ఆదాయం కిందే లెక్కించి, దాన్ని బట్టి లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీలను కట్టాలంటూ టెల్కోలను ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించింది. తాజాగా ఇదే ప్రాతిపదికన బాకీలు కట్టాలంటూ గెయిల్‌ను టెలికం విభాగం ఆదేశించింది. 



You may be interested

త్వరలో పీసీఏ నుంచి ఐడీబీఐ బ్యాంక్ బైటికి

Monday 23rd December 2019

న్యూఢిల్లీ: భారీ మొండిబాకీల రికవరీ, మరింత మూలధనం లభించడం తదితర అంశాల ఊతంతో ఐడీబీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలోనే పీసీఏ ఆంక్షల పరిధి నుంచి బైటికి వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే రుణాల మంజూరీపరమైన కొన్ని నిబంధనలను సడలించిందని వెల్లడించాయి. భారీ మొండిబాకీలు పేరుకుపోయిన ఐడీబీఐ బ్యాంక్ వంటి బ్యాంకులను సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలోకి చేరుస్తూ

నేడు ఫ్లాట్‌ ఓపెనింగ్‌ ?

Monday 23rd December 2019

నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప నష్టంతో 12,285 పాయింట్ల వద్ద కదులుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్లలో ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ​వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు మరోసారి చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిశాయి. అమెరికా, చైనా మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న వాణిజ్య వివాద పరిష్కారానికి ప్రాథమిక దశ

Most from this category