News


కరోనా ఎఫ్టెక్ట్‌- ఫార్మా ఎగుమతులకు చెక్‌?!

Monday 10th February 2020
news_main1581310828.png-31648

చైనా నుంచి తగ్గుతున్న బల్క్‌డ్రగ్‌ దిగుమతులు
యాంటిబయోటిక్స్‌ తయారీకి ముడిసరుకుల కొరత?
ఇప్పటికే ఏపీఐ, తదితరాల ధరలు పెంచిన ట్రేడర్లు

కొన్ని కీలకమైన యాంటీబయోటిక్స్‌ ఎగుమతులను నియంత్రించాలని దేశీ ఔషధ శాఖ(డీఓపీ) భావిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇందుకు వీలుగా ఒక అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ కారణంగా చైనాలో పలు ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోవడంతో కొంతమంది ట్రేడర్లు బల్క్‌డ్రగ్స్‌ ధరలను పెంచుతున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో దేశీయంగా అత్యవసరమైన ఔషధాల కొరత ఏర్పడకుండా చూసే యోచనతో అత్యున్నత కమిటీ పనిచేయనున్నట్లు తెలియజేశాయి. యాంటిబయోటిక్స్‌ తయారీకి అవసరమయ్యే బల్క్‌డ్రగ్స్‌ను దేశీ కంపెనీలు చైనా నుంచి దిగుమతి చేసుకునే సంగతి తెలిసిందే. తద్వారా ఫినిష్‌డ్‌ డోసేజీలను రూపొందించి విదేశాలకు ఎగుమతి చేస్తుంటాయి. చైనాలో ప్లాంట్ల మూసివేత కొనసాగితే.. దేశీయంగా కీలక ఔషధాలకు కొరత ఏర్పడకుండా చూసేందుకు తగిన చర్యలను డీవోపీ కమిటీ తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

హుబే ప్రావిన్స్‌ కీలకం
మెట్రోనైజడోల్‌, క్లోరమ్‌ఫెనికోల్‌, అజిత్రోమైసిన్‌ తదితర యాంటిబయోటిక్స్‌ తయారీతోపాటు..  విటమిన్‌ B1, B6 తయారీలో వినియోగించే యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రెడియంట్స్‌(ఏపీలు) ప్రధానంగా చైనాలోని హుబే ప్రొవిన్స్‌నుంచి దేశీయంగా సరఫరా అవుతుంటాయని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. అయితే హుబే కేపిటల్‌ వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో పలు ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. దేశీ బల్క్‌డ్రగ్స్‌ దిగుమతుల్లో హుబే ప్రొవిన్స్‌ వాటా 70 శాతం వరకూ ఉంటుంది. చైనాలో లునార్‌ కొత్త ఏడాది సెలవులు జనవరి 24న ప్రారంభమయ్యాయి. 30తో ముగియవలసి ఉన్నప్పటికీ కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో సెలవులను ఫిబ్రవరి 10వరకూ పొడిగించారు. సెలవులను మరోసారి 14 వరకూ పొడిగించినట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా.. హుబే ప్రొవిన్స​ నుంచి దేశీయంగా బోరక్స్‌, కాపర్‌, జిప్సమ్‌, రాక్‌ సాల్ట్‌, కోల్‌, మెగ్నీషియం తదితర మినరల్స్‌ సైతం దిగుమతి అవుతుంటాయని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. 

పరిస్థితుల సమీక్ష
బల్క్‌డ్రగ్స్‌, ఫినిష్డ్‌ ప్రొడక్టుల... ఎగుమతి, దిగుమతుల గణాంకాలను పరిశీలిస్తున్నట్లు డీవోపీ అధికారి ఒకరు చెప్పారు. అంతేకాకుండా నిల్వలపై వివరాలు అందిం‍చవలసిందిగా ఫార్మా కంపెనీలను ఆదేశించినట్లు తెలియజేశారు. కరోనా పరిస్థితుల కారణంగా అవసరమైతే ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులను నియం‍త్రించే అవకాశమున్నట్లు తెలియజేశారు. చైనా ఏపీఐల సరఫరాల అంతరాయం నేపథ్యంలో దేశీయంగా ఔషధ పరిశ్రమ పరిస్థితులపై నివేదిక ఇవ్వమంటూ కేంద్ర ఔషధ ప్రామాణిక నియం‍త్రణ సంస్థ(సీడీఎస్‌సీవో)ను డీవోపీ కోరినట్లు తెలుస్తోంది. దేశీయంగా అత్యవసర ఔషధాల కొరత తలెత్తకుండా పరిస్థితులను నియంత్రించేందుకు పరిశ్రమల నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. 

ప్రస్తుతానికి ఓకే
సాధారణంగా రెండు నెలలకు సరిపడా ఏపీలు, ఇంటర్మీడియెట్స్‌ను నిల్వచేస్తుంటామని, దీంతో ప్రస్తుతానికి ఇబ్బందులు లేవని దేశీ ఫార్మా కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఫిబ్రవరి చివరికల్లా చైనా నుంచి సరఫరాలు ప్రారంభంకాకపోతే.. కొంతమేర సమస్యలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇది దేశీయంగా మొత్తం ఫార్మా పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని వివరించారు. హుబేకు 600-700 కిలోమీటర్ల దూరంలోగల జియాం‍గ్సు ప్రొవిన్స్‌, షాన్‌డాంగ్‌ ప్రొవిన్స్‌ల నుంచి సైతం దేశీ కంపెనీలకు బల్క్‌డ్రగ్స్‌ సరఫరా అవుతుంటాయని తెలియజేశారు. ఈ రెండు చోట్ల కలిపి సుమారు 250 ఫార్మా యూనిట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇక్కడి పరిస్థితులు మూడు, నాలుగు వారాల్లోగా మెరుగుపడకపోతే.. దేశీ ఫార్మా పరిశ్రమకు సమస్యలు తలెత్తే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. 

ధరల పెంపు
కరోనా పరిస్థితుల కారణంగా ఇటీవల ట్రేడర్లు ఏపీఐలు తదితరాల ధరలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్‌, సిరప్‌ల తయారీలో వినియోగించే కీలక ముడిసరుకుల ధరలను 10-15 శాతం మధ్య పెంచినట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కొన్నింటి విషయంలో ఈ పెంపు 50 శాతంవరకూ ఉన్నట్లు తెలియజేశాయి. దీంతో దేశీ ఫార్మా పరిశ్రమ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చునని అంచనా వేస్తున్నాయి. You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Monday 10th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు సెయిల్‌: ఖజానాకు రూ.1,000 కోట్లను సమీకరించేందుకు సెయిల్‌లోని 5 శాతం వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్‌బీఐ, బీఓబీ అండ్‌ హెచ్‌డీఎఫ్‌సీ: రిలయన్స్‌ జియో ఇన్‌ఫ్రాటెల్‌ పబ్లిక్‌ ఇష్యూ జారీ ద్వారా రూ.25,000 కోట్ల నిధులు సమీకరించి, దీనిలో మూడోవంతును ఈ బ్యాంకుల రుణాలను చెల్లించనుంది. డీఎల్‌ఎఫ్‌: హర్యాణాలోని గురుగావ్‌, పంచకులలో ఇండిపెండెంట్‌ గృహాలను అమ్మడం ద్వారా వచ్చే రెండేళ్లల్లో రూ.5,000 కోట్ల

ఎప్పుడైనా ఇన్వెస్ట్‌ చేసుకోతగినది.!

Monday 10th February 2020

మిరే అస్సెట్‌ ఎమర్జింగ్‌ బిజినెస్‌ ఫండ్‌ దీర్ఘకాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు, అందులోనూ లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ పట్ల సానుకూలంగా ఉన్న వారు.. ఈ విభాగంలో మిరే అస్సెట్‌ ఎమర్జింగ్‌ బ్లూచిప్‌ ఫండ్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆరంభం నుంచి ఇప్పటి వరకు మధ్యలో కొన్ని సంవత్సరాలు మినహాయిస్తే చక్కని పనితీరుతో దూసుకుపోతోంది. గతంలో మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎక్కువ ఎక్స్‌పోజర్‌తో ఉండే ఈ పథకం, మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల

Most from this category