News


బ్యాంకుల వద్ద తగినన్ని నిధులు.. ఆందోళన వద్దు

Monday 9th March 2020
news_main1583738950.png-32369

  • ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్‌

న్యూఢిల్లీ: యస్‌ బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగ ఆరోగ్యంపై వస్తున్న ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ స్పందించారు. దేశంలోని అన్ని బ్యాంకుల వద్ద పుష్కలంగా నిధులున్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డిపాజిట్‌ రేషియోను మార్కెట్‌ విలువతో ముడిపెట్టి చూసి బ్యాంకు ఆరోగ్యాన్ని అంచనా వేయడం తప్పుడు విధానంగా పేర్కొన్నారు. ఏ బ్యాంకింగ్‌ నిపుణుడు లేదా ఆర్‌బీఐ ఈ విధానాన్ని అనుసరించవన్నారు. సీఆర్‌ఏఆర్‌, ఇతర కొలమానాలు బ్యాంకుల ఆరోగ్యాన్ని కచ్చితంగా అంచనా వేయగలవని పేర్కొన్నారు. ‘‘బ్యాంకింగ్‌ నిపుణులు, నియంత్రణ సంస్థలు దీన్నే చూస్తాయి. సీఆర్‌ఏఆర్‌ 8 శాతం అన్నది అంతర్జాతీయ నిబంధన కాగా, భారతీయ బ్యాంకుల సగటు సీఆర్‌ఏఆర్‌ 14.3 శాతంగా ఉంది’’ అని సుబ్రమణియన్‌ వివరించారు. 



You may be interested

పదేళ్ల అతిపెద్ద నష్టాన్ని చవిచూసిన రిలయన్స్‌ షేరు

Monday 9th March 2020

ఇంట్రాడేలో 13.50శాతం నష్టపోయిన షేరు క్రూడాయిల్‌ పతనంతో సౌదీ ఆర్‌కాం అనుమానాలు దేశీయ ప్రైవేట్‌ రంగ దిగ్గజం కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు సోమవారం పదేళ్లలో అతిపెద్ద ఇంట్రాడే నష్టాన్ని చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ భారీ పతనం నేపథ్యంలో సౌదీ ఆరాం కో కుదుర్చుకున్న ఒప్పందంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఫలితంగా రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు నేటి ట్రేడింగ్‌లో ఏకంగా 13.50శాతం నష్టాన్ని చవిచూసింది. అంతర్జాతీయ వృద్ధి మందగమన నేపథ్యంలో క్రూడాయిల్‌ ఉత్పత్తి

ఏడాది కనిష్టానికి పడిపోయిన 660 షేర్లు

Monday 9th March 2020

సోమవారం ఎన్‌ఎస్‌ఈలో 660 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వీటిలో  20 మైక్రాన్స్‌, 63 మూన్స్‌ టెక్నాలజీస్‌, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఆదిత్యా మిర్లా క్యాపిటల్‌, అదాని పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌, ఏడీఎఫ్‌ ఫుడ్స్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అడోర్‌ వెల్డింగ్‌, అద్వాని హోటల్స్‌ అండ్‌ రిసార్ట్‌​‍్స ఇండియా, అండ్వాన్డ్‌​ ఎంజెమై్‌ టెక్నాలజీస్‌, అగర్వాల్‌ ఇండస్ట్రీయల్‌ కార్పొరేషన్‌,అగ్రిటెక్‌ ఇండియా, ఆగ్రోఫోస్‌ ఇండియా, అమ్మీర్‌ రియాల్టీ అండ్‌

Most from this category