News


ఐడీబీఐ బ్యాంక్‌తో లావాదేవీలపై భయం వద్దు!

Thursday 19th December 2019
news_main1576729890.png-30305

అది ప్రభుత్వానిదే;

పూర్తి సామర్థ్యం ఉంది

ఆర్థికశాఖ భరోసా  

ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు డిపాజిట్లను ఉపసంహరిస్తుండటం... కొత్త డిపాజిట్లు చేయకపోవటం వంటి వ్యవహారాలపై ఆర్థికశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకుతో లావాదేవీల నిర్వహణ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఏదీ లేదని భరోసా ఇచ్చింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ఒక లేఖ రాసింది. ఎప్పటిలాగే బ్యాంకింగ్‌ సేవలు అందించడానికి ఐడీబీఐ బ్యాంక్‌కు తగిన సామర్థ్యం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రమోటర్‌ ఎల్‌ఐసీ పూర్తిగా ప్రభుత్వ సంస్థ అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఎల్‌ఐసీ, ప్రభుత్వం రెండింటికీ కలిపి బ్యాంకులో 97.46 శాతం వాటా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ ఈ ఏడాది జనవరిలో 51 శాతం వాటా కొనుగోలు చేసింది. దీనితో బ్యాంకును ప్రైవేటు రంగ బ్యాం కుగా ఆర్‌బీఐ పునర్‌ వ్యవస్థీకరించింది. బ్యాంకు లో ప్రభుత్వ వాటా ప్రస్తుతం 46.46 శాతం.  



You may be interested

బీఎస్‌ఈ బాండ్స్‌ వేదికపై జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సీపీ

Thursday 19th December 2019

మరో నాలుగు కంపెనీల కమర్షియల్‌ పేపర్స్‌ కూడా న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ తన కమర్షియల్‌ పేపర్స్‌ను (సీపీ) బీఎస్‌ఈ బాండ్స్‌ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్‌ చేయాలని బీఎస్‌ఈకి దరఖాస్తు చేసుకుంది. ఈ కంపెనీతో పాటు ఆదిత్య బిర్లా ఫైనాన్స్, కేఈసీ ఇంటర్నేషనల్, ఆదిత్య బిర్లా మనీ, ఫుల్లర్టన్‌ ఇండియా క్రెడిట్‌.. మొత్తం  ఐదు కంపెనీలు సీపీ లిస్టింగ్‌ కోసం దరఖాస్తు చేశాయి. గురువారం ఈ కంపెనీల కమర్షియల్‌ పేపర్స్‌ను లిస్ట్‌ చేస్తామని బీఎస్‌ఈ

షోకాజు నోటీసును పరిశీలిస్తున్నాం: నెస్లే

Thursday 19th December 2019

ముంబై: జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని నెస్లే ఇండియా వినియోగదారులకు వెంటనే బదిలీ చేయకుండా అక్రమంగా లాభాలను ఆర్జించిందంటూ లాభాపేక్ష నిరోధక విభాగం (ఎన్‌ఏఏ) జారీ చేసిన షోకాజు నోటీసును పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రకటించింది. రేట్ల తగ్గింపును వినియోగదారులకు బదిలీ చేయకుండా ప్రయోజనం పొందినందుకు రూ.90 కోట్లు చెల్లించాలని ఎన్‌ఏఏ ఈ నెల 12న జారీ చేసిన షోకాజు నోటీసులో నెస్లే ఇండియాను ఆదేశించడం గమనార్హం. గ్రాముల్లో చేసిన

Most from this category