News


చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం

Saturday 22nd June 2019
news_main1561176981.png-26488

  • కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ హెచ్చరిక
  • తప్పుడు సలహాలు ఇవ్వొద్దని అకౌంటింగ్‌ సంస్థలకు సూచన
  • తప్పు చేయని వారికి సమస్యలు ఉండవని భరోసా

న్యూఢిల్లీ: చట్ట స్ఫూర్తిని ఉల్లంఘించొద్దని పరిశ్రమకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ హితవు పలికారు. రౌండ్‌ ట్రిప్పింగ్‌ (ఒకరి నుంచి ఒకరు చేతులు మార్చుకోవడాన్ని) వంటి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ‘‘ఏ తప్పూ చేయని వారికి ఎటువంటి సమస్య ఉండదని నేను భరోసా ఇస్తున్నాను. కానీ, అదే సమయంలో తప్పుడు పనుల్లో పాల్గొనే వారిపై చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. దేశ సంస్కృతి, మైండ్‌సెట్‌ను మార్చేస్తాం’’ అని పీయూష్‌ గోయల్‌ సీఐఐ సభ్యులతో సమావేశం సందర్భంగా స్పష్టం చేశారు. న్యాయవాదులు, అంతర్జాతీయంగా నాలుగు అతిపెద్ద ట్యాక్స్‌ కన్సల్టెన్సీ సంస్థలు (పీడబ్ల్యూసీ, డెలాయిట్‌, కేపీఎంజీ, ఈఅండ్‌వై) ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. భారత చట్ట స్ఫూర్తికి విరుద్ధమైన సలహాలు ఇవ్వొద్దని పరోక్షంగా హెచ్చరించారు. బహుళ బ్రాండ్ల ఉత్పత్తుల రిటైల్‌ విభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) చట్టాన్ని కంపెనీలు గౌరవించాలని, లొసుగుల ద్వారా దీన్నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించొద్దని హితవు పలికారు.
చట్టానికి అనుగుణంగా...
‘‘మల్టీ బ్రాండ్‌ రిటైల్‌లో 51 శాతం వరకు ఎఫ్‌డీఐని అనుమతించే విధానం అమల్లో ఉంది. దీనికి కట్టుబడి ఉన్నాం. ప్రతీ ఒక్కరూ దీన్ని అనుసరించాలి, గౌరవించాలి. చట్టానికి అనుగుణంగా ఉన్నంత వరకు సమస్య ఏమీ ఉండదు’’ అని మంత్రి పేర్కొన్నారు.  చట్టానికి అనుగుణంగా నడచుకోండి. రౌండ్‌ ట్రిప్పింగ్‌ను చట్టం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. మీలో ఎవరైనా అది చేసుంటే అంగీకరించి ప్రక్షాళన చేసుకుని, ఆ అధ్యాయానికి ముగింపు పలకండి’’ అని మంత్రి సూచించారు. దొడ్డిదారిన వచ్చిన వారు బయటపడే మార్గం కోసం కామా, పుల్‌స్టాప్‌లను వెతకొద్దన్నారు. ఆసియాన్‌ దేశాలతో స్వేచ్ఛాయుత వాణిజ్యం ఒప్పందాలకు సంబంధించిన అంశాలపై గోయల్‌ స్పందిస్తూ... చట్టంలో కొన్ని నిబంధనలు భారంగా ఉన్నాయని, వాటిని సభ్యదేశాల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. సబ్సిడీల కోసం ఎగుమతిదారులు ప్రభుత్వంపై ఆధారపడకుండా, నాణ్యమైన ఉత్పత్తులతో పోటీతత్వాన్ని అలవరుచుకోవాలని సూచించారు. 



You may be interested

ఓపెన్‌ ఆఫర్‌ నుంచి మినహాయింపునివ్వాలి

Saturday 22nd June 2019

స్లాట్స్‌పై హామీ కావాలి జెట్‌ టేకోవర్‌కు ఎతిహాద్‌ డిమాండ్లు ముంబై: రుణ సంక్షోభంతో మూతబడిన జెట్‌ ఎయిర్‌వేస్‌ను టేకోవర్ చేయాలంటే ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపునివ్వాలని, ఎయిర్‌పోర్టులలో స్లాట్స్‌పై హామీ ఇవ్వాలని ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ డిమాండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ వెల్లడించింది. అయితే, ఆయా మినహాయింపులపై హామీ ఇచ్చేందుకు తమకు అధికారాలేమీ లేవని పేర్కొంది.  జెట్ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్న నేపథ్యంలో గతేడాది కాలంగా సముచిత పరిష్కార

అక్రమ లాభార్జనపై 10 శాతం జరిమానా

Saturday 22nd June 2019

విద్యుత్‌ వాహనాలపై పన్ను తగ్గింపును తేల్చనున్న ఫిట్‌మెంట్‌ కమిటీ  జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు లాటరీలపై ఒకే పన్ను అంశంలో కుదరని ఏకాభిప్రాయం న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాలపై, ఎలక్ట్రిక్‌ చార్జర్లపై పన్ను తగ్గింపు ప్రకటన జీఎస్టీ కౌన్సిల్‌ నుంచి వెలువడుతుందని భావించగా, నిర్ణయాన్ని ఫిట్‌మెంట్‌ కమిటీకి నివేదిస్తూ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తొలిసారి అధ్యక్షత వహరించిన జీఎస్టీ కౌన్సిల్‌ 35వ భేటీ శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా

Most from this category