STOCKS

News


దేశీయ పాసింజర్‌ వాహన విక్రయాలు 6 శాతం డౌన్‌!

Monday 10th February 2020
news_main1581330566.png-31665

గ్రేటర్‌ నోయిడా: ఈ జనవరిలో దేశీయ పాసింజర్‌ వాహన విక్రయాలు 6.2 శాతం పడిపోయాయి. జీడీపీ వృద్ధి నెమ్మదించడం, వాహన ధరలు పెరగడంతో వాహన కొనుగోలుదార్లపై ఒత్తిడిపడి దేశీయ పాసింజర్‌ వాహన విక్రయాలు పడిపోయాయని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చర్స్‌( సియామ్‌) సోమవారం వెల్లడించింది. సియామ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ..గత ఏడాది జనవరిలో దేశీయ పాసింజర్‌ వాహన విక్రయాలు 2,80,091 యూనిట్లుగా ఉంటే ఈ ఏడాది జనవరిలో 2, 62,714 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే క్రమంలో గతనెలలో కార్ల విక్రయాలు కూడా పడిపోయాయి. గతేడాది జనవరిలో కార్ల విక్రయాలు 1,79,324 యూనిట్లుగా ఉంటే ఈ జనవరిలో 8.1 శాతం తగ్గి 1,64,794 యూనిట్లకు చేరింది. దీంతో వాహనాల రిజిస్ట్రేన్‌లు 1.83 శాతం తగ్గి 17,39,975 యూనిట్లకు చేరింది. గతేడాది ఈ సంఖ్య 20,19,253 యూనిట్లుగా ఉంది. ఏప్రిల్‌ 1 నుంచి అన్ని వాహనాలను BS-IV నుంచి BS-VI నిబంధనలకు లోబడి విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వాహన తయారీ కంపెనీలన్నీ BS-VI ప్రమాణాలకు అనుగుణంగా జనవరి నుంచి వాహన ధరలను పెంచాయి. దీంతో కొనుగోళ్లు తగ్గాయని సీయామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వదేరా వెల్లడించారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూరల్‌ ఎకానమీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ప్రభుత్వం సానుకూల ప్రకటనలు చేసింది. దీనివల్ల టూవీలర్‌ విక్రయాలు పెరిగే అవకాశం ఉందన్నారు. కాగా గతేడాది జనవరిలో టూవీలర్‌ విక్రయాలు 14,97,528 యూనిట్లుగా ఉంటే ఈ ఏడాది జనవరిలో 16.06 శాతం పడిపోయి 13,41,005 యూనిట్లకు చేరింది. ఇక మోటర్‌ సైకిల్‌ విక్రయాలు గతేడాదితోపోలిస్తే 15.17 శాతం తగ్గి 10,27,766 యూనిట్ల నుంచి 8,71,886 యూనిట్లకు చేరింది. స్కూటర్‌ విక్రయాలు కూడా 16.21 శాతం తగ్గాయి. వాణిజ్య వాహనాలు సైతం ఇదేబాట పట్టాయి. గతేడాది జనవరిలో వాణిజ్య వాహన విక్రయాలు 14.04 శాతం తగ్గి  87,591 యూనిట్ల నుంచి 75,289 యూనిట్లకు చేరాయి. మొత్తంగా చూస్తే వాణిజ్య వాహనాల్లో త్రిచక్ర వాహనాలు మినహాయిస్తే మిగతా వాహనాల విక్రయాలన్నీ పడిపోయాయి. ప్రస్తుతం జరుగుతున్న ఆటోఎక్స్‌పో-2020 వల్ల విక్రయాలు పెరిగే అవకాశం ఉందని, కొత్త కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్న ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతారని రాజన్‌ తెలిపారు. You may be interested

షార్ట్‌టర్మ్‌కు స్ట్రాంగ్‌ సిఫార్సులు

Monday 10th February 2020

వచ్చే కొన్ని వారాల్లో మంచి రాబడినిచ్చే డజన్‌ స్టాకులను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. శ్రీకాంత్‌ చౌహాన్‌, కోటక్‌ సెక్యూరిటీస్‌ 1. బయోకాన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 325. స్టాప్‌లాస్‌ రూ. 300. బలమైన ప్రైస్‌వాల్యూం బ్రేకవుట్‌ సాధించింది. ఏడీఎక్స్‌ సహా పలు ఇండికేటర్లు బుల్లిష్‌గా ఉన్నాయి.  2. టాటామోటర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 190. స్టాప్‌లాస్‌ రూ. 167. బడ్జెట్‌ అనంతరం మంచి ర్యాలీ జరుపుతోంది. చార్టుల్లో హయ్యర్‌ బాటమ్‌ ఫార్మేషన్‌ ఏర్పడడం అప్‌ట్రెండ్‌

రూ.2000 నోటు కనుమరుగు?

Monday 10th February 2020

చలామణిలోకి పంపకుండా నిరోధిస్తున్న టాప్‌ బ్యాంకు ప్రింటింగ్‌ అపేసిన ఆర్‌బీఐ కస్టమర్లకు జరిపే విత్‌డ్రాయల్స్‌లో రూ.2000 నోటును ఇవ్వవద్దంటూ ప్రముఖ పబ్లిక్‌ సెక్టర్‌ బ్యాంకు తన సీనియర్‌ మేనేజ్‌మెంట్‌కు సూచనలిచ్చినట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ ఒక కథనంలో వెల్లడించింది. తమ ఏటీఎంల్లో సైతం ఈ నోటును ఉంచొదని బ్యాంకు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలిచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు బ్యాంకు ఎంప్లాయిస్‌కు పంపిన ఈమెయిల్‌లో వివరాలను బిజినెస్‌ ఇన్‌సైడర్‌ బయటపెట్టింది. కస్టమర్లకు రూ.2000 నోటు ఇవ్వవద్దని బ్యాంకు

Most from this category