News


తగ్గిన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు

Thursday 11th July 2019
news_main1562825899.png-26982

  • జూన్‌లో 17.54 శాతం క్షీణత

న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు మరింత నీరసించాయి. సియామ్‌ తాజా గణాంకాల ప్రకారం.. గతనెల్లో మొత్తం పీవీ అమ్మకాలు 17.54 శాతం తగ్గి 2,25,732 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది జూన్‌ విక్రయాలు 2,73,748 యూనిట్లు కాగా, ఈసారి అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దేశీ కార్ల విక్రయాలు 24.97 శాతం క్షీణించి 1,39,628 యూనిట్లుగా వెల్లడైంది. 2018 ఏడాదిలో ఇవి 1,83,885 యూనిట్లుగా ఉన్నాయి. మోటార్‌ సైకిళ్ల అమ్మకాలు 9.57 శాతం తగ్గి 10,84,598 యూనిట్లుగా నిలిచాయి. గతేడాది ఇదేనెల్లో 11,99,332 యూనిట్లుగా తేలింది. మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 18,67,884 యూనిట్ల నుంచి 16,49,477 యూనిట్లకు తగ్గిపోయాయి. ఈ విభాగంలో 11.69 శాతం క్షీణత నమోదైంది. వాణిజ్య వాహన అమ్మకాలు 12.27 శాతం తగ్గి 70,771 యూనిట్లుగా నిలిచాయి. అంతక్రితం జూన్‌లో ఇవి 80,670 యూనిట్లుగా ఉన్నాయి. అన్ని విభాగాల అమ్మకాలు కలిపి 12.34 శాతం తగ్గి 19,97,952 యూనిట్లు కాగా, గతేడాదిలో 22,79,186 యూనిట్లుగా ఉన్నాయి. ఏప్రిల్‌-జూన్‌ కాలంలో పీవీ విక్రయాలు 18.42 శాతం తగ్గి 7,12,620 యూనిట్లుగా నమోదైయ్యాయి. గతేడాది ఈకాలంలో 8,73,490 యూనిట్లుగా ఉన్నట్లు తాజా సమాచారం ద్వారా వెల్లడైంది.



You may be interested

టాక్స్‌ భయాలతో షార్ట్స్‌కు దిగిన ఎఫ్‌ఐఐలు

Thursday 11th July 2019

నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ ఫ్యూచర్లలో విదేశీ సంస్థాగత మదుపరులు(ఎఫ్‌ఐఐ) నికర విక్రయదారులుగా మారారు. కార్పొరేట్‌ నిర్మితిలేని ట్రస్ట్‌ స్ట్రక్చర్‌ ఉన్న ఎఫ్‌ఐఐలు అధిక పన్నులను ఎదుర్కోవాల్సి వస్తుందని బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎఫ్‌ఐఐలు అమ్మకాలకు దిగినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇండెక్స్‌ ఫ్యూచర్లలో జూలై4న దాదాపు 41వేల వరకు లాంగ్స్‌ ఉన్న ఎఫ్‌ఐఐలు జూలై9కి తమ లాంగ్‌ పొజిషన్లను 15745కు తగ్గించుకున్నారు. అధిక పన్నుతో పాటు లిస్టెడ్‌ కంపెనీల బైబ్యాక్‌పై

ఆండ్రాయిడ్‌ ఫోన్లు జాగ్రత్త!!

Thursday 11th July 2019

2.5 కోట్ల ఫోన్లకు ఏజెంట్‌ స్మిత్‌ మాల్‌వేర్‌ వీటిల్లో 1.5 కోట్ల ఫోన్లు భారత్‌లోనే వెల్లడించిన చెక్‌పాయింట్‌ రీసెర్చ్‌ న్యూఢిల్లీ: ఏజెంట్‌ స్మిత్‌ అనే పేరున్న మొబైల్‌ మాల్‌వేర్‌ (హానికార వైరస్‌) ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఆండ్రాయిడ్‌ ఫోన్లలోకి చొరబడినట్టు చెక్‌ పాయింట్‌ రీసెర్చ్‌ సంస్థ తన పరిశోధనలో గుర్తించింది. వీటిల్లో 1.5 కోట్ల ఫోన్లు భారత్‌లోనే ఉన్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. యూజర్లకు తెలియకుండానే... వారి ఫోన్లలో ఉన్న మొబైల్‌ అప్లికేషన్ల స్థానంలో,

Most from this category