News


దేశీ కాఫీ కింగ్‌ సిద్ధార్థ ..

Wednesday 31st July 2019
news_main1564545356.png-27425

దాదాపు 140 ఏళ్లుగా కాఫీ వ్యాపారంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సిద్ధార్థ జీవితంలో పలు మలుపులు ఉన్నాయి. ఆయన ముందుగా భారతీయ ఆర్మీలో చేరాలనుకున్నారు. కానీ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ పట్టా తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకరుగా మారారు. 1984లో సొంతంగా శివన్‌ సెక్యూరిటీస్ పేరిట ఇన్వెస్ట్‌మెంట్‌, వెంచర్ క్యాపిటల్ సంస్థను ప్రారంభించారు. దాన్నుంచి వచ్చిన లాభాలతో కర్ణాటకలోని చిక్‌మగళూర్‌ జిల్లాలో కాఫీ తోటలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో కుటుంబ కాఫీ వ్యాపారంపై మరింత ఆసక్తి పెంచుకున్నారు. 1993లో అమాల్గమేటెడ్ బీన్ కంపెనీ (ఏబీసీ) పేరిట కాఫీ ట్రేడింగ్ కంపెనీ ‍ప్రారంభించారు. అప్పట్లో రూ. 6 కోట్లుగా ఉన్న ఈ సంస్థ వార్షిక టర్నోవరు ఆ తర్వాత రూ. 2,500 కోట్ల స్థాయికి చేరింది. దేశీయంగా ఇది ప్రస్తుతం అతి పెద్ద గ్రీన్‌ కాఫీ ఎగుమతి సంస్థ. ఇక, జర్మన్‌ కాఫీ చెయిన్‌ 'చిబో' స్ఫూర్తితో సొంత కెఫేలను కూడా సిద్ధార్థ ప్రారంభించారు. తేనీటిప్రియులను కూడా ఘుమఘుమలాడే కాఫీ వైపు మళ్లేలా చేశారు. 1994లో బెంగళూరులో తొలి కెఫే కాఫీ డే ప్రారంభమైంది. ప్రస్తుతం వియన్నా, ప్రాగ్‌, కౌలాలంపూర్ తదితర 200 పైచిలుకు నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా 1,750 కెఫే కాఫీ డే అవుట్‌లెట్స్‌ ఉన్నాయి. 2015లో కాఫీ డే పబ్లిక్ ఇష్యూకి కూడా వచ్చింది. 



You may be interested

బ్లాక్‌మనీ ఉన్నట్లు సిద్దార్థ అంగీకరించారు: ఐటీ శాఖ

Wednesday 31st July 2019

అదృశ్యమైన కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్దార్థను తాము గతంలో దర్యాప్తు సందర్భంగా వేధించామన్న ఆరోపణలను ఆదాయపు పన్ను శాఖ ఖండించింది. సోషల్‌ మీడియాలో వెలుగుచూసిన లేఖలోని సిద్దార్థ సంతకం, తమ దగ్గరున్న సంతకానికి చాలా తేడా ఉందని ఐటీ శాఖ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. గతంలో తాము జరిపిన సోదాల్లో తనవద్ద బ్లాక్‌మనీ ఉన్నట్లు సిద్దార్థ అంగీకరించారని కూడా ఐటీ శాఖ తెలిపింది. భారీ మొత్తంలో పన్ను

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Wednesday 31st July 2019

క్రితం రోజు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనై భారీగా క్షీణించిన భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం సైతం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 139 పాయింట్ల క్షీణతతో 37,259 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 51 పాయింట్ల నష్టంతో 11,034 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్నులతో కొద్దిరోజుల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల తాకిడిని చవిచూస్తున్న సూచీలకు తాజాగా అంతరర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల

Most from this category