News


అటోకు మొబైల్స్‌కు పండుగ

Tuesday 12th November 2019
news_main1573529050.png-29516

  • అక్టోబర్‌లో కార్ల విక్రయాల్లో స్వల్ప వృద్ధి
  • 11 నెలల క్షీణతకు బ్రేక్‌
  • కలిసొచ్చిన కొత్త మోడల్స్‌

న్యూఢిల్లీ: పండుగల సీజన్‌ సందర్భంగా మెరుగుపడిన సెంటిమెంటు, కొత్త మోడల్స్‌ ఊతంతో అక్టోబర్‌లో ప్యాసింజర్‌ వాహనాల విభాగం కాస్త ఊపిరి పీల్చుకుంది. గత నెల అమ్మకాల్లో స్వల్ప వృద్ధి నమోదు చేసింది. దీంతో వరుసగా 11 నెలల క్షీణతకు బ్రేక్‌ పడినట్లయింది. ఆటోమొబైల్‌ సంస్థల సమాఖ్య సియామ్‌ సోమవారం ఈ విషయాలు వెల్లడించింది. సియామ్‌ గణాంకాల ప్రకారం ప్యాసింజర్‌ వాహనాల (కార్లు, వ్యాన్లు మొదలైనవి) అమ్మకాలు గత నెల 0.28 శాతం వృద్ధితో 2,85,027 యూనిట్లకు చేరాయి. గతేడాది ఆక్టోబర్‌లో అమ్మకాలు 2,84,223 యూనిట్లు. యుటిలిటీ వాహన విక్రయాలు 22 శాతం పెరిగాయి. నవంబర్, డిసెంబర్‌లో కూడా విక్రయాలు మెరుగుపడగలవని, తద్వారా మందగమనం ప్రభావాల నుంచి పరిశ్రమ నెమ్మదిగా బైటపడగలదని ఆశిస్తున్నట్లు సియామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వధేరా తెలిపారు. రుణాల లభ్యత మెరుగుపడుతుండటం, వడ్డీ రేట్లు తగ్గుతుండటంతో పాటు కంపెనీలు కొత్త మోడల్స్‌ ప్రవేశపెట్టడం తదితర అంశాలు ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలకు దోహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు. 
    వాణిజ్య వాహనాల క్షీణతపై స్పందిస్తూ.. దేశ ఎకానమీని ఇవి ప్రతిబింబిస్తాయని, ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సంస్కరణలతో ఈ విభాగానికి ఊతం లభించగలదని భావిస్తున్నామని చెప్పారు. అమ్మకాల డేటాకు సంబంధించి రాబోయే రోజుల్లో రిటైల్‌ డేటానే ప్రామాణికంగా మారనున్నప్పటికీ.. ప్రస్తుతానికి టోకు గణాంకాలనే పరిగణనలోకి తీసుకోవడం శ్రేయస్కరమని వధేరా తెలిపారు. ప్రస్తుత రిటైల్‌ డేటాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గణాంకాలు ఉండటం లేదన్నారు. 

అత్యధికంగా మారుతీ సుజుకీ...
ప్యాసింజర్‌ వాహనాల విభాగంలో అక్టోబర్‌లో మారుతీ సుజుకీ విక్రయాలు 2.33 శాతం వృద్ధితో అత్యధికంగా 1,39,121 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా అమ్మకాలు 3.83 శాతం క్షీణించి 50,010 యూనిట్లకు, మహీంద్రా అండ్‌ మహీంద్రా విక్రయాలు 23.33 శాతం తగ్గి 18,444 యూనిట్లకు పరిమితమయ్యాయి. 

మిగతా విభాగాల్లో తగ్గుదల...

  • ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు మెరుగైనప్పటికీ.. ఇతరత్రా వాహనాల విక్రయాలు మాత్రం అక్టోబర్‌లో సుమారు 13 శాతం తగ్గి 21,76,136 యూనిట్లకు పరిమితమయ్యాయి.
  • గతేడాది అక్టోబర్‌లో వీటి అమ్మకాలు 24,94,345 యూనిట్లు. వాణిజ్య వాహనాల విక్రయాలు 23 శాతం క్షీణించి 66,773 యూనిట్లకు తగ్గాయి.
  •  మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలు అక్టోబర్‌లో 14 శాతం తగ్గి.. 17,57,264 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ విభాగంలో మోటార్‌సైకిల్స్‌ విక్రయాలు సుమారు 16 శాతం తగ్గి 11,16,970 యూనిట్లకు క్షీణించాయి. స్కూటర్స్‌ అమ్మకాలు సుమారు 10 శాతం తగ్గి 5,80,120 యూనిట్లుగా నమోదయ్యాయి. 
  • హీరో మోటోకార్ప్‌ అమ్మకాలు 18 శాతం తగ్గి 5,86,988 యూనిట్లకు క్షీణించాయి. హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా విక్రయాలు 0.47 శాతం క్షీణించి 4,87,819 యూనిట్లకు, టీవీఎస్‌ మోటార్‌ విక్రయాలు 25 శాతం తగ్గి 2,52,684 యూనిట్లకు పరిమితమయ్యాయి. 



You may be interested

కోల్‌ ఇండియా లాభం రూ.3,522 కోట్లు

Tuesday 12th November 2019

భారీగా తగ్గిన పన్ను భారం  రూ.22,013 కోట్లకు మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మైనింగ్‌ దిగ్గజం, కోల్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.3,523 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.3,085 కోట్ల నికర లాభం ఆర్జించామని కోల్‌ ఇండియా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.23,486 కోట్ల నుంచి రూ.22,013 కోట్లకు తగ్గిందని పేర్కొంది. మొత్తం ఆదాయం తగ్గినా, నికర లాభం

70వేలకు చేరిన బీఎస్‌ఎన్‌ఎల్‌ వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు

Tuesday 12th November 2019

బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్‌ పుర్వార్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) కింద ఇప్పటికి 70,000కి మందికి దరఖాస్తు చేసుకున్నారు. సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీకే పుర్వార్‌ సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. నవంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో ప్రస్తుతం దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో

Most from this category