పీవీఆర్ ఆదాయం రూ.979 కోట్లు
By Sakshi

న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ చెయిన్, పీవీఆర్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసిక కాలంలో రూ.49 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం, రూ.35 కోట్లతో పోల్చితే 35 శాతం వృద్ది సాధించామని పీవీఆర్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.715 కోట్ల నుంచి 37 శాతం వృద్ధితో రూ.979 కోట్లకు పెరిగిందని పేర్కొంది. దేశవ్యాప్తంగా 69 నగరాల్లో 170 ప్రొపర్టీల్లో 800 స్క్రీన్లను ఈ కంపెనీ నిర్వహిస్తోంది.
You may be interested
భయపెడుతున్న చైనా వృద్ధి రేటు..నష్టాల్లో చమురు
Friday 18th October 2019చైనా మూడవ త్రైమాసికపు జీడీపీ వృద్ధిరేటు 3 దశాబ్దాల కనిష్ఠానికి పడిపోతుందని విశ్లేషకులు అంచనా వేయడంతో చమురు ధరలు శుక్రవారం సెషన్లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుఎస్-చైనా ట్రేడ్‌వార్ వలన, ప్రపంచంలోనే అత్యధిక చమురు వినియోగ దేశమైన చైనా ఆర్థిక వ్యవస్థ మందగించిన విషయం విదితమే. ఉదయం 10.17 సమయానికి బ్రెంట్ క్రూడ్ 0.55 శాతం నష్టపోయి బారెల్ 59.58 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్ 0.22
డీహెచ్ఎఫ్ఎల్కు రూ.242 కోట్ల నష్టాలు
Friday 18th October 2019క్యూ2 ఫలితాల ప్రకటన న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గృహ రుణాల సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలను గురువారం విడుదల చేసింది. రూ.242 కోట్ల నష్టాలను ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.431 కోట్ల లాభం కంపెనీకి రావడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.3,154 కోట్లుగా ఉండగా, తాజాగా అది రూ.2,400 కోట్లకు తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం రెండో భాగం నుంచి తీవ్ర