News


ఫిబ్రవరిలో 9% పెరిగిన విమాన యానం

Thursday 19th March 2020
news_main1584591153.png-32573

న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ ఈ ఏడాది ఫిబ్రవరిలో 8.98 శాతం వృద్ధితో 1.236 కోట్లుగా నమోదైంది. డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం.. జనవరితో పోల్చితే అన్ని ప్రధాన విమానయాన సంస్థల ప్యాసింజర్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) గణనీయంగా పెరిగింది. ఇక జనవరిలో ప్రయాణికుల రద్ధీ కేవలం 2.2 శాతంగానే ఉన్న విషయం తెలిసిందే కాగా.. కంపెనీలు ప్రకటించిన భారీ ఆఫర్ల కారణంగా స్పైస్ జెట్ ఫిబ్రవరి పీఎల్‌ఎఫ్‌ అత్యధికంగా 93 శాతం ఉండగా.. రెండవ స్థానంలో ఉన్న గోఎయిర్ 90.5 శాతాన్ని నమోదుచేసింది. సీటు వినియోగ సామర్థ్యం ఈ స్థాయిలో పెరిగిన కారణంగా గత నెల్లో ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరిగింది.



You may be interested

అమ్మకాల షాక్‌ -39 నెలల కనిష్టం

Thursday 19th March 2020

1892 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్‌ 522 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ 27,000 పాయింట్ల స్థాయి దిగువకు సెన్సెక్స్‌ 8,000 పాయింట్ల మైలురాయినీ కోల్పోయిన నిఫ్టీ 2016 డిసెంబర్‌ స్థాయికి స్టాక్‌ మార్కెట్లు మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 5 శాతం చొప్పున పతనం ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు పిట్టల్లా వణుకుతున్నాయి. బుధవారం అమెరికా, యూరోప్‌ మార్కెట్లు 6 శాతం చొప్పున కుప్పకూలగా.. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు 8-3 శాతం మధ్య పతనమయ్యాయి. ఈ ప్రభావంతో

కరోనాపై పోరుకు 650 కోట్ల డాలర్లు

Thursday 19th March 2020

ప్యాకేజీని ప్రకటించిన ఏడీబీ  కోవిడ్‌-19 (కరోనా) వైరస్‌పై పోరుకు ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ) 650 కోట్ల డాలర్ల (రూ.48,100 కోట్లు)ప్యాకేజీని ప్రకటించింది. కోవిడ్‌-19 వైరస్‌ అతి పెద్ద ప్రపంచ ఉపద్రవంగా మారిపోయిందని  ఏడీబీ ప్రెసిడెంట్‌ మస్సాత్సు అసకవ వ్యాఖ్యానించారు. దీనిని ఎదుర్కొనడానికి జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తీవ్రమైన చర్యలు తీసుకోవలసి ఉందని వివరించారు. తమ సభ్య దేశాల తక్షణ అవసరాల నిమిత్తం 650 కోట్ల డాలర్ల ప్యాకేజీని అందిస్తున్నామని తెలిపారు.

Most from this category