News


ఎగవేతదారులతో కఠినంగా వ్యవహరించాలి

Thursday 25th July 2019
news_main1564036219.png-27304

  • నిజాయితీగా పన్నులు కట్టేవారికి తగిన గౌరవమివ్వాలి
  • ఆదాయపు పన్ను శాఖ అధికారులకు 
  • మంత్రి నిర్మలా సీతారామన్ సూచన

న్యూఢిల్లీ: వ్యవస్థలో లొసుగులను అడ్డం పెట్టుకుని పన్నులను ఎగవేయాలనుకునే వారితో కఠినంగా వ్యవహరించాలని ఆదాయ పన్ను శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అయితే, నిజాయితీగా కట్టాలనుకునేవారికి అవసరమైన తోడ్పాటునిచ్చి, తగిన విధంగా గౌరవించాలని పేర్కొన్నారు.  159వ ఆదాయపు పన్ను దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. ఎగవేతదారులను పట్టుకునేందుకు రెవెన్యూ శాఖలోని మూడు కీలక విభాగాలు (ఆదాయపు పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. "తప్పు ఎక్కడ జరుగుతోందో తెలుసుకునేందుకు మీ దగ్గర డేటా మైనింగ్‌, బిగ్ డేటా విశ్లేషణ వంటి సాధనాలు ఉన్నాయి. ఎగవేయాలనుకునే వారితో కఠినంగా వ్యవహరించండి. అలాంటి విషయాల్లో మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది" అని నిర్మలా సీతారామన్ చెప్పారు. సంపన్నులపై అధిక పన్ను భారం అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పన్నులు చెల్లించడాన్ని ప్రజలు జాతి నిర్మాణంలో తమ వంతు కర్తవ్యంగా భావించాలే తప్ప జరిమానాగా అనుకోరాదని మంత్రి చెప్పారు. "ఎక్కువ సంపాదిస్తున్న వారిని శిక్షించాలన్నది మా ఉద్దేశం కాదు. ఆదాయాలు, వనరులను మరింత మెరుగ్గా పంచడానికి ఈ పన్నులు అవసరం. అత్యధికంగా ఆదాయాలు ఆర్జించే వర్గాలు కొంత మేర సామాన్యుల అభ్యున్నతికి కూడా తోడ్పాటు అందించాలన్నదే లక్ష్యం. ఈ భావాన్ని అర్థం చేసుకుంటే చాలు.. ఇన్‌కం ట్యాక్స్ విభాగమంటే భయం ఉండదు" అని ఆమె తెలిపారు. 

సులభసాధ్యమైన లక్ష్యం...
2019-20లో నిర్దేశించుకున్న రూ. 13.35 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం సులభసాధ్యమైనదేనని నిర్మలా సీతారామన్ చెప్పారు."గడిచిన అయిదేళ్లలో పన్ను చెల్లింపుదారుల సంఖ్యను రెట్టింపు స్థాయికి చేర్చగలిగాం. అలాంటప్పుడు పన్ను వసూళ్లను రూ. 11.8 లక్షల కోట్ల నుంచి కాస్త ఎక్కువగా రూ. 13 లక్షల కోట్లకు పెంచుకోవడం పెద్ద కష్టం కానే కాదు. సాధించతగిన లక్ష్యాన్నే మీకు నిర్దేశించడం జరిగింది" అని ఆమె వివరించారు.  ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యించినట్లుగా పన్ను చెల్లింపుదారుల సంఖ్యను ప్రస్తుతమున్న 7 కోట్ల నుంచి 8 కోట్లకు పెంచే దిశగా కృషి చేయాలని చెప్పారు. 

ఆహ్లాదకర వ్యవహారంగా ఉండాలి..
పన్ను చెల్లింపు ప్రక్రియంటే భయం కోల్పేదిగా కాకుండా ఆహ్లాదకరమైన వ్యవహారంగా ఉండే పరిస్థితులు కల్పించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ చెప్పారు. పన్ను వసూళ్లు పారదర్శకమైన, సముచిత రీతిలో జరిగేట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చూడాలని ఆయన సూచించారు. 1860-61లో కేవలం రూ. 13 లక్షలుగా ఉన్న ప్రత్యక్ష పన్ను వసూళ్లను గత ఆర్థిక సంవత్సరంలో రూ. 11.37 లక్షల కోట్లకు చేర్చడంలో ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని మోదీ చెప్పారు. You may be interested

11500 పాయింట్లు దాటకపోతే 11100 వరకు నిఫ్టీ!

Thursday 25th July 2019

నిఫ్టీ వరుస నష్టాలను నమోదు చేస్తూ క్రమంగా 11300 పాయింట్ల దిగువకు చేరింది. పీఎస్‌యూ బ్యాంకులు, ఆటో, ఫార్మా రంగాల్లో అమ్మకాలు సూచీలను కుంగదీసాయి. దీర్ఘకాలిక చార్టుల్లో నిఫ్టీ లోయర్‌ హై, లోయర్‌ లో క్యాండిల్‌ను ఏర్పరిచింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 11200 పాయింట్ల వద్ద నిలదొక్కుకునేందుకు కొంత అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ స్థాయి వద్ద కీలక ఫిబోనాకి సపోర్ట్‌ స్థాయిలున్నాయి. దీనికితోడు మార్కెట్‌ బాగా ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లోకి

రుణాలివ్వడమే కాదు... వినియోగంపైనా పర్యవేక్షణ

Thursday 25th July 2019

రూటు మార్చుకుంటున్న బ్యాంకులు రుణాల వినియోగంపై పర్యవేక్షణకు ఏజెన్సీల సేవలు న్యూఢిల్లీ: రుణాల విషయంలో కార్పొరేట్‌ సంస్థలు మోసాలకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో బ్యాంకులు రూటు మార్చుకుంటున్నాయి. కేవలం రుణాలు జారీ చేయడానికే పరిమితమై పోకుండా, తీసుకున్న రుణాలను కంపెనీలు ఏ విధంగా వినియోగిస్తున్నాయనేది పర్యవేక్షించేందుకు వెలుపలి ఏజెన్సీల సాయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర బ్యాంకులతో కలసి కన్సార్షియం కింద జారీ చేసే రూ.250 కోట్లుకు మించిన రుణాల విషయంలో ఏజెన్సీ

Most from this category