News


దేశంలోనే సంపన్న సీఈఓ..నవిల్‌ నోర్నా!

Tuesday 18th February 2020
news_main1582020329.png-31901

 భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానలో ముఖేష్‌ అంబానీ ఉండగా రెండోస్థానంలో ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ అధినేత రాధాకిషన్‌ దమానీ ఉన్నారు. వీరంతా ఆయా కంపెనీల ప్రమోటర్లుగా వ్యవహరిస్తూ సంపన్నుల జాబితాలో నిలవగా.. వృత్తిపరమైన నైపుణ్యాలతో సీఈఓలుగా ఎదిగి ఆయా కపెనీలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వారిలో దేశంలోనే అత్యంత సంపన్న సీఈఓగా నిలిచారు నవిల్‌ నోర్నా. వీల్‌ ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ కంపెనీని లాభాల బాటలో నడిపించడంతో ఇతని ఆదాయం సుమారు రూ.3,100 కోట్లుపైనే చేరింది. దీంతో అత్యంత సంపన్న సీఈఓగా నవిల్‌ రికార్డు సృష్టించారు. కాగా కంపెనీల సీఈఓల జీతభత్యాలతో సంబంధం లేకుండా కంపెనీలో వారి వాటా కింద కంపెనీ ఇచ్చే షేర్లను ఆధారంగా ఈ జాబితాను నిర్ణయించారు

క్రమసంఖ్య  పేరు కంపెనీ షేర్ల సంఖ్య షేర్ల విలువ (రూ.కోట్లలో)
  1 నవిల్‌ నోర్నా ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ 13,388,561 3,128
  2 ఆదిత్య పురి  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 7,745,088 943
 3 రమాకాంత్‌ బహెటీ  ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ 2,850,339
 
666
 4 సిపీ గుర్మనీ టెక్‌ మహీంద్రా 7,139,059
 
594
  5 రేను సుద్‌ కర్నాడ్‌ హెచ్‌డీఎఫ్‌సీ 2,326,672 547
  6 మిలింద్‌ బ్రావే హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ 1,040,000 337
  7 దీపక్‌ పరేఖ్‌ - హెచ్‌డీఎఫ్‌సీ 1,160,000 273
  8 కైజద్‌ భరుఛా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2,107,102 256
  9 శాంతి ఏకాంబరం కోటక్‌ బ్యాంక్‌ 1,485,865 251
  10 ముకుంద్‌ భట్‌ కోటక్‌ బ్యాంక్‌ 1,319,079 223
  11 దీపక్‌ గుప్తా కోటక్‌ బ్యాంక్‌ 1,134,761 192
  12 కేకీ మిస్త్రీ హెచ్‌డీఎఫ్‌సీ  656,500 154

 


CEO

You may be interested

యాపిల్‌ దెబ్బ- 12,000 దిగువకు నిఫ్టీ

Tuesday 18th February 2020

41,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్‌ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం డౌన్‌ మీడియా, ఐటీ రంగాలు ఎదురీత పలు ప్రతికూల అంశాల నడుమ వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్‌ 161 పాయింట్లు క్షీణిం‍చి 40,894 వద్ద నిలవగా.. నిఫ్టీ 53 పాయింట్లు తక్కువగా 11,993 వద్ద ముగిసింది. వెరసి సెన్సెక్స్‌ 41,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరగా.. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 12,000 పాయింట్ల దిగువన

మంచి షేర్లు ఖరీదే..కానీ పెట్టుబడులు వాటిలోకే!

Tuesday 18th February 2020

ఆర్థిక వ్యవస్థతో మార్కెట్లు డిస్కనెక్ట్‌ లార్జ్‌క్యాప్స్‌లోనే అధిక పెట్టుబడులు - మనీషి రాయ్‌చౌధురి, బీఎన్‌పీ పరిబాస్‌ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ స్టాక్‌ మార్కెట్లు ఎందుకు పురోగమిస్తున్నాయన్న ప్రశ్నకు.. డిస్కనెక్ట్‌ కావడమే కారణమంటున్నారు మనీషి రాయ్‌చౌధురి. బీఎన్‌పీ పరిబాస్‌లో ఏషియా పసిఫిక్‌ ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ అయిన రాయ్‌ లార్జ్‌ క్యాప్స్‌లోకే ఇకపైన కూడా పెట్టుబడులు ప్రవహించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఒక ఇంటర్వ్యూలో రాయ్‌ వెలిబుచ్చిన పలు అభిప్రాయాలను చూద్దాం.. దేశ ఆర్థిక వ్యవస్థ, స్టాక్‌

Most from this category