News


రెండు రెట్లు పెరిగిన డీఎల్‌ఎఫ్‌ లాభం

Tuesday 30th July 2019
news_main1564466608.png-27408

  • రూ.415 కోట్లకు నికర లాభం 

న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం, డీఎల్‌ఎఫ్‌ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రెండు రెట్లు పెరిగింది. గత క్యూ1లో రూ.173 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.415 కోట్లకు పెరిగిందని డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. రూ.297 కోట్ల అసాధారణ ఆదాయం కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,658 కోట్ల నుంచి రూ.1,541 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఈ క్యూ1లో నికర అమ్మకాల బుకింగ్స్‌ .రూ.705 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. గత క్వార్టర్‌లో కంపెనీ ప్రమోటర్లు చివరి దశ పెట్టుబడులు కింద రూ.2,250 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారని పేర్కొంది. దీంతో కలుపుకొని ప్రమోటర్లు మొత్తం రూ.11,250 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారని తెలిపింది.  ప్రమోటర్లు భారీగా ఇన్వెస్ట్‌ చేసిన కంపెనీల్లో ఒకటిగా డీఎల్‌ఎఫ్‌ నిలిచిందని పేర్కొంది.  నిర్మాణం పూర్తయిన ఇళ్ల విక్రయాలపై ఇక నుంచి ప్రధానంగా దృష్టి పెట్టనున్నామని వివరించింది. 



You may be interested

25 స్టాకుల్లో బుల్లిష్‌ సంకేతాలు!

Tuesday 30th July 2019

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.   బుల్లిష్‌ సిగ్నల్స్‌ సోమవారం

హైదరాబాద్‌లో తగ్గిన గృహాల విక్రయాలు

Tuesday 30th July 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:- దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. ఏప్రిల్‌ – జూన్‌ మధ్య కాలంలో అమ్మకాల్లో 6 శాతం గ్రోత్‌ కనిపించిందని ప్రాప్‌ఈక్విటీ సర్వే తెలిపింది. అయితే ఇదే సమయంలో కొత్త గృహాల సప్లయిలో మాత్రం 11 శాతం క్షీణత నమోదైందని సర్వే పేర్కొంది. 5,89,503 గృహాల ఇన్వెంటరీ... గుర్గావ్, నోయిడా, ముంబై, కోల్‌కతా, పుణే, హైదరాబాద్, బెంగళూరు, థానే, చెన్నై నగరాల్లో ఏప్రిల్‌ –

Most from this category