STOCKS

News


మరోసారి ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు?

Tuesday 12th November 2019
news_main1573544412.png-29531

తయారీ, మైనింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో ఉత్పత్తి క్షీణించడంతో సెప్టెంబర్‌లో పారిశ్రామిక రంగం నేలచూపులు చూసింది. ఫలితంగా పారిశ్రామికోత్పత్తి సూచి(ఐఐపీ) గత ఏనిమిదేళ్లలో అత్యల్ప స్థాయికి చేరుకుంది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌లో ఐఐటీ సూచీ -4.3శాతంగా నమోదైంది. ఏడాది క్రితం సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 4.6శాతంగా నమోదైంది. 2011-12 సిరీస్‌లో సెప్టెంబర్‌ వృద్ధి అత్యల్పం కావడం గమనార్హం. గణాంకాలు నిరుత్సాహపరిచిన నేపథ్యంలో డిసెంబర్‌లో జరిగే ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమావేశంలో మానిటరీ కమిటీ వడ్డీరేట్ల తగ్గింపునకు మొగ్గుచూపే అవకాశాలున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. 
ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ పారిశ్రామిక రంగ గణాంకాలపై మార్కెట్‌ నిపుణులు, ఆర్థికవేత్తలు స్పందనలు ఇలా ఉన్నాయి. 

దేశీయంగా పారిశ్రామిక రంగం తీవ్ర అస్థిరతకు లోనవుతోంది. ఈ స్థితి నుంచి బయటపడేందుకు మరిన్ని కొన్నినెలల సమయం పడుతుంది. గృహ పొదుపు రేటు, వ్యవసాయ వృద్ధి క్షీణత లాంటి నిర్మాణాత్మక మందగమనంతో భారత ఆర్థిక వృద్ధి తీవ్ర ఒత్తిడికి ఎదుర్కోంటుంది. వ్యవసాయ వృద్ధి తక్కువ స్థాయిలో నమోదు కావడం అనేది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర వేతన వృద్ధి క్షీణింపజేస్తుంది. ఈ అంశం గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. డిసెంబర్ ద్రవ్య విధానంలో ఆర్‌బీఐ నుంచి మరింత రేటు తగ్గింపును ఆశిస్తున్నాము.  దేవేంద్ర కుమార్‌ పంత్‌, చీఫ్‌ ఎకనామిస్ట్‌, ఇండియా రేటింగ్స్‌, రీసెర్చ్‌

 

సెప్టెంబర్‌లో ‍పారిశ్రామికోత్పత్తి గణాంకాలు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. అయితే నిర్మాణ రంగం మాత్రం పురోగతిని సాధించింది. మధ్యంతర వినియోగం 7శాతం పెరిగింది. ఇది డిసెంబర్‌ కల్లా డిసెంబర్‌ నాటికి పారిశ్రామికోత్పత్తి పుంజుకునే అవకాశాల్ని సూచిస్తుంది. వీకే విజయ్‌కుమార్‌, జియోజిత్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ 

 
ఆర్థిక మందగమనం పారిశ్రామికోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా అటో రంగంలో నెలకొన్న మందగమనం మొత్తం అన్ని రంగాల్ని ప్రభావితం చేసింది. ఇది మరో రేటు తగ్గింపు కోసం అంచనాలను పెంచుతుంది. 
అంబరీష్ బలిగా, మార్కెట్ నిపుణుడు

రానున్న నెలల్లో, పండుగ సీజన్‌, పంటకోత తరువాత గ్రామీణ వ్యయంలో మెరుగుదల లాంటి అంశాల నేపథ్యంలో డిమాండ్ మెరుగుపడే అవకాశం ఉంది. ఈ నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి కొంత మెరగయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.ఈ ఆర్థిక సంవత్సరంలో 4శాతం వృద్ధిని సాధించాలంటే, వచ్చే రెండో అర్థ సంవత్సరపు వృద్ధి సగటు 6-65శాతం నమోదు కావాల్సి ఉంటుంది. కేర్‌ రేటింగ్‌ సంస్థ

సెప్టెంబర్‌లో ఐఐపీ సూచీ గత ఆగస్ట్‌ నెలలతో నమోదైన -1.1శాతంతో పోలిస్తే -4.3శాతంగా క్షీణించింది. నిరంతర మందగమనం ఆర్‌బీఐని రెండోసారి వడ్డీరేట్ల తగ్గింపునకు పురికొల్పవచ్చు. అయినప్పటికీ.., ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపు కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరుణంలో.. రేటు తగ్గింపు విషయంలో జాగ్రత్త వహించే అవకాశం ఉంది. క్యాపిటల్‌ గూడ్స్‌, మైనింగ్,  వినియోగదారుల నాన్-డ్యూరబుల్స్‌ రంగాల్లో డిమాండ్‌ తగ్గడం ద్వారా సెప్టెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి ప్రధానంగా ప్రభావితమైంది.
యస్‌ రంగనాథన్‌, ఎల్‌కేపీ సెక్యూరీటీస్‌

 

 You may be interested

పెరిగిన స్టీల్‌ ధరలు..ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందా?

Tuesday 12th November 2019

దేశీయ అతి పెద్ద స్టీల్‌ కంపెనీలయిన టాటా స్టీల్‌, జేఎస్‌డబ్యూ స్టీల్‌, గత ఆరు నెలల్లో మొదటి సారిగా ప్రాధమిక స్టీల్‌ అయిన హెచ్‌ఆర్‌సీ(హాట్‌ రోల్డ్‌ కాయిల్‌) ధరలను పెంచాయి. కాగా వ్యవస్థలో ధరలు, డిమాండ్‌ పరంగా ఉన్న మందగమనం బాటమ్ ఔట్‌ అవుతోందనే సంకేతాలను ఇది ఇస్తోందని విశ్లేషకులు తెలిపారు. ఈ రెండు కంపెనీలు టన్ను హెచ్‌ఆర్‌సీపై రూ. 500 నుం‍చి రూ. 750 వరకు ధరలను పెంచాయి. గత

లాభాలు రక్షించుకోవడమే అతిపెద్ద పాఠం!

Tuesday 12th November 2019

ఏక్యూఎఫ్‌ అడ్వైజర్స్‌ కోఫౌండర్‌ నితిన్‌ రహేజా స్టాక్‌మార్కెట్లో ఎప్పటికప్పుడు వచ్చిన లాభాలను పరిరక్షించుకోవడమే తాను నేర్చుకున్న పెద్ద పాఠమని ఏక్యూఎఫ్‌ అడ్వైజర్స్‌ కోఫౌండర్‌ నితిన్‌ రహేజా చెప్పారు. ఇందుకు తగిన సూత్రాలను ఫాలో కావడం వల్లనే గత రెండేళ్ల కాలంలో పలు మిడ్‌క్యాప్స్‌పై మంచి లాభాలు ఆర్జించామని చెప్పారు. ఎప్పటికప్పుడు ప్రాఫిట్‌ బుకింగ్‌ చేసుకోవడం మంచిదని చాలామంది అనలిస్టులు సలహా ఇస్తుంటారని కానీ తాను తద్భిన్నంగా వెళ్లానని చెప్పారు. కొన్నిసార్లు స్వల్పలాభాలను

Most from this category