News


యస్‌బ్యాంక్‌లో వాటా కోసం పోటాపోటీ!

Thursday 7th November 2019
news_main1573104219.png-29412

రంగంలో రెండు బడా విదేశీ ఫండ్స్‌
దేశీయ ఫండ్స్‌ నుంచి కూడా ఆసక్తి
అంతర్జాతీయ ఫండ్స్‌ డిస్కవరీ క్యాపిటల్‌, మార్షల్‌ వేస్‌తో పాటు మరికొన్ని సంస్థలు కూడా యస్‌బ్యాంక్‌ వాటాలు కొనేందుకు రేసులో ఉన్నాయని విశ‍్వసనీయ వర్గాలు తెలిపాయి. విదేశీ సంస్థలే కాకుండా దేశీయ ఇన్వెస్టర్లైన ఆదిత్య బిర్లా ఎంఎఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ తదితరాలు కూడా యస్‌బ్యాంకులో వాటా కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వాటా విక్రయం ద్వారా నిధులు సమకూర్చుకొని ఇబ్బందుల్లోంచి బయటపడాలని యస్‌బ్యాంక్‌ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవలే ఒక అమెరికా సంస్థ నుంచి వాటా కొనుగోలు కోసం 120 కోట్ల డాలర్ల ఆఫర్‌ వచ్చినట్లు బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం బ్యాంకు వాటా కొనుగోలుకు కార్లైల్‌ గ్రూప్‌, ఫరాలాన్‌ ఫండ్‌, ఎస్‌ఎస్‌జీ క్యాపిటల్‌ తదితరాలు ఆసక్తి వ్యక్తం చేశాయి. వాటా కొనుగోలుకు దాదాపు 8 సంస్థలు రేసులో ఉన్నాయని గతవారం బ్యాంకు సీఈఓ గిల్‌ వెల్లడించారు. కాగా తాజాగా పోటీలోకి వచ్చినట్లు చెబుతున్న ఫండ్స్‌ మాత్రం కొనుగోలు విషయమై ఎలాంటి అధికారిక స్పందన వ్యక్తం చేయలేదు.

పోటీలోని సమర్ధవంతమైన కొనుగోలు సంస్థలకు దాదాపు 20 నుంచి 40 కోట్ల డాలర్ల విలువైన వాటాలను విక్రయించాలని, ముందుగా రంగంలోకి వచ్చిన అమెరికా సంస్థకు పెద్దవాటా విక్రయించాలని  బ్యాంకు యోచిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు కొందరు ఇన్వెస్టర్లకు బోర్డులో డైరెక్టర్ల నియామక అవకాశం కూడా కల్పించవచ్చని తెలుస్తోంది. డిసెంబర్‌ చివరినాటికి మూలధన సమీకరణ పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు సీఈఓ గిల్‌ చెప్పారు. బ్యాంకుతో పాటు పయనించేందుకు బలమైన, నమ్మకమైన వాటాదారుల కోసమే తమ అన్వేషణ అని తెలిపారు. బ్యాంకు పునరుజ్జీవంపై నమ్మకంతో ఇటీవలే ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా దాదాపు 1.29 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. 



You may be interested

4శాతం నష్టపోయిన టాటాస్టీల్‌

Thursday 7th November 2019

మెప్పించని క్యూ2 ఫలితాలు టాటా స్టీల్‌ ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలు దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలను మెప్పించలేకపోయాయి. ఫలితంగా నేడు ఉదయం సెషన్‌లో కంపెనీ షేరు 3.85శాతం మేర నష్టపోయింది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన కంపెనీ సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.3302.31 కోట్ల నికరలాభాన్ని అర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ ఆర్జించిన రూ.3,116 కోట్ల

కనిష్టస్థాయి నుంచి పసిడి రికవరీ

Thursday 7th November 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర కనిష్టస్థాయి నుంచి రికవరీని సాధించింది. అయినప్పటికి.., 1500 డాలర్ల దిగువున ట్రేడ్‌ అవుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 9.50డాలర్లు మేర లాభపడి 1,493.10 వద్ద స్థిరపడింది. అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ క్షీణించడటం, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడటం తదితర కారణాలు పసిడి బలపడేందుకు తోడ్పాటునిచ్చాయి. అమెరికా చైనాల మధ్య కుదరాల్సిన మొదటి దశ వాణిజ్య ఒప్పందం డిసెంబర్‌కు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు

Most from this category