News


పన్ను వసూళ్ల లక్ష్యం కుదింపు

Monday 3rd February 2020
news_main1580701977.png-31454

  • కొత్త శ్లాబ్‌లు ట్యాక్స్‌పేయర్లకు ప్రయోజనకరమే
  • సీబీడీటీ చైర్మన్ పీసీ మోదీ వెల్లడి

న్యూఢిల్లీ: వివిధ ఆర్థిక అంశాల వాస్తవిక స్థితిగతులను మదింపు చేసిన మీదట కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని దిగువముఖంగా రూ. 11.80 లక్షల కోట్లకు సవరించినట్లు సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ పీసీ మోదీ వెల్లడించారు. "2019-20లో వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయ పన్ను మొదలైన ప్రత్యక్ష పన్నుల వసూళ్లను రూ. 13.35 లక్షల కోట్లుగా ముందుగా నిర్దేశించుకున్నాం. అయితే, భారీగా రీఫండ్‌లు, కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించడం వల్ల గణనీయంగా రెవెన్యూలో కోత పడింది. దీంతో వాస్తవిక పరిస్థితులు పరిశీలించిన తర్వాత దీన్ని రూ. 11.80 లక్షల కోట్లకు సవరించడం జరిగింది. దీన్ని సులభంగానే సాధించగలం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ. 7.40 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు జరిగాయని చెప్పారు. సాధారణంగా ఆఖరు త్రైమాసికంలో (జనవరి-మార్చి) వసూళ్లు గరిష్ట స్థాయిలో ఉంటాయి కాబట్టి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోగలమని మోదీ పేర్కొన్నారు. 


    అటు కార్పొరేట్లు, ఇటు వ్యక్తులకు కూడా పన్నుల ప్రయోజనాలు మరింతగా అందించేందుకే తాజా బడ్జెట్‌లో కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మోదీ చెప్పారు. దీనివల్ల పన్ను భారాన్ని తగ్గించుకోవడం కోసం సరైన రాబడులివ్వని సాధనాల్లో తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేసే పరిస్థితి తప్పుతుందని తెలిపారు. పన్ను భారం తగ్గడం వల్ల మిగిలే మొత్తాన్ని ఎలా పొదుపు చేసుకోవచ్చో నిర్ణయించుకునే స్వేచ్ఛ ట్యాక్స్‌పేయర్‌కి లభిస్తుందని మోదీ తెలిపారు. ఇక, ఉద్దేశపూర్వకంగా పన్నులు ఎగ్గొట్టే వారిని కట్టడి చేసేందుకే ఎన్నారైలపై బడ్జెట్‌లో కొత్త ప్రతిపాదనలు చేసినట్లు ఆయన వివరించారు. 



You may be interested

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 3rd February 2020

ఎస్‌బీఐ:    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర: రూ.303 టార్గెట్‌ ధర: రూ.400 ఎందుకంటే: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. రుణ నాణ్యత మెరుగుపడింది. స్థూల మొండి బకాయిలు 6.94 శాతానికి, నికర మొండి బకాయిలు 2.65 శాతానికి తగ్గాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, మొండి బకాయిలకు కేటాయింపులు రూ.11,041 కోట్ల నుంచి రూ.8,193 కోట్లకు

దేశీ ఆదాయంపైనే పన్ను

Monday 3rd February 2020

ఎన్‌ఆర్‌ఐ టాక్స్‌పై ఆర్థిక శాఖ వివరణ గల్ఫ్‌ దేశాలు, మర్చంట్ నేవీలో పనిచేసే వారికి ఊరట న్యూఢిల్లీ:  ప్రవాస భారతీయుల (ఎన్నారై) ఆదాయాలపై పన్ను విధించే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. ఎన్నారైలు భారత్‌లో ఆర్జించిన ఆదాయాలపై మాత్రమే దేశీయంగా పన్ను విధింపు ఉంటుందని వివరణ ఇచ్చారు. ఇతర దేశాల్లో వారికి వచ్చే ఆదాయాలపై ట్యాక్స్ విధించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. "ఎన్నారైలకు భారత్‌లో వచ్చిన ఆదాయాలపై

Most from this category