News


ఇన్ఫీ ఉద్యోగులకు బొనాంజా!

Wednesday 11th December 2019
news_main1576040535.png-30171

డిజిటల్‌ నైపుణ్యాలుంటే నజరానాలు
దాదాపు 25000 మంది మిడ్‌లెవల్‌ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు, వేతనాల పెంపునందించే ఒక టాలెంట్‌ ప్లాన్‌ను ఇన్ఫోసిస్‌ ఆరంభించింది. సరికొత్త డిజిటల్‌ విభాగాల్లో నైపుణ్యాలు సంపాదించినవారిని గుర్తించి నజరానాలు అందించనుంది. డిజిటల్‌ విభాగంలో మరింత దూసుకుపోవాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే డిజిటల్‌ నైపుణ్యాలున్నవారికి పెద్దపీట వేయాలని నిర్ణయించుకుంది. ఇటీవల కాలంలో ఐటీ కంపెనీలు తమ సాం‍ప్రదాయక వ్యాపారంలో పెద్దగా పురోగతి చూపలేకపోతున్నాయి. అందుకే కంపెనీలన్నీ ఇప్పుడు డిజిటల్‌ మంత్రం జపిస్తున్నాయి. ఇందులో భాగంగా డిజిటల్‌ ట్యాగ్స్‌ను సృష్టించామని, వీటికి ఇన్సెంటివ్‌లు అందిస్తామని కంపెనీ హెచ్‌ఆర్‌ అధిపతి కృష్ణమూర్తి చెప్పారు. దీంతో పాటు త్రైమాసిక నైపుణ్య ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయన్నారు. మిడ్‌లెవల్‌ ఉద్యోగుల స్కిల్స్‌ పెంచడంలో నాలుగు అంశాలున్నాయని గుర్తించామని, వీటిపై పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. ఇందులో డిజిటల్‌ స్పెషలైజేషన్‌ ముఖ్యమైనదని, ఈ స్పెషలైజేషన్‌లో 36 రకాల నైపుణ్యాలను గుర్తించామని చెప్పారు. ప్రాసెస్‌ ఏరియాల్లో నైపుణ్యాలు పెంచుకోవడం, సొంత సర్వీస్‌ విభాగాల్లో స్పెషలిస్టుగా మారడం, కన్సల్టెంటుగా మారడం.. అనేవి మిగిలిన మూడు ముఖ్యమైన విషయాలన్నారు. ఈ నాలుగు అంశాల్లో సరైన ప్రోత్సహకాలు అందించడం ద్వారా ఉద్యోగుల్లో డిజిటల్‌ నైపుణ్యాలు పెంచుతామన్నారు. కంపెనీలు పాత విధానాలకు స్వస్తి చెప్పి కన్సల్టేటివ్‌ విధానం దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో మిడ్‌లెవల్‌ ఉద్యోగుల్లో ఈ నైపుణ్యాలు పెంచడం కీలకంగా మారుతోందని ఐటీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 



You may be interested

యస్‌బ్యాంక్‌ షేరులో అమ్మకాలే కొనసాగుతాయి!

Wednesday 11th December 2019

రాహుల్‌ షా అంచనా స్వల్పకాలానికి యస్‌బ్యాంక్‌ షేరులో సెల్లింగే కొనసాగవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ప్రతినిధి రాహుల్‌ షా అంచనా వేశారు. కొన్ని నెలలుగా ఈ షేరు తీవ్ర ఒడిదుడుకులు నమోదు చేస్తుందన్నారు. మార్కెట్లు బ్యాంకు ఫండ్‌రైజింగ్‌ ప్లాన్స్‌ను డిస్కౌంట్‌ చేశాయన్నారు. అందువల్ల ఒకవేళ మంచి డీల్‌ కుదిరినా షేరులో భారీ అప్‌మూవ్‌ ఉండకపోవచ్చన్నారు. గతంలో కూడా క్యూఐపీ అనంతరం షేరు నెగిటివ్‌గా రియాక్టైన విషయాన్ని గుర్తు చేశారు. అందువల్ల షార్ట్‌టర్మ్‌లో అనేక

యస్‌బ్యాంక్‌ 19.50శాతం క్రాష్‌

Wednesday 11th December 2019

యస్‌బ్యాంక్‌లో పెట్టుబడులపై అనిశ్చితి కొనసాగుతుండంతో ఈ బ్యాంక్‌ షేరు బుధవారం మిడ్‌సెషన్‌ సమయానికి కల్లా 19.50శాతం నష్టపోయింది. నిన్న జరిగిన బోర్డు సమావేశంలో సైటాక్స్‌ హోల్డింగ్స్‌, సైటాక్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌ ప్రతిపాదించిన 50 కోట్ల డాలర్లకు సుముఖత చూపుతున్నట్లు బ్యాంక్‌ అధికారులు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చారు. అలాగే ఎర్విన్‌ సింగ్ బ్రెయిచ్‌/ఎస్‌పీజీసీ హోల్డింగ్‌ ప్రతిపాదించిన 1.2బిలియన్‌ డాలర్ల బిడ్డింగ్‌ ఆఫర్‌పై డైరెక్టర్ల బోర్డు ఇంకా పరిశీలన జరుపుతుందని పేర్కోంది. వాస్తవానికి

Most from this category