News


డీహెచ్‌ఎఫ్‌ల్ ఖాతాల్లో అవకతవకలు

Wednesday 24th July 2019
news_main1563951615.png-27277

  • ఆడిటర్ల వెల్లడి

న్యూఢిల్లీ: హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఖాతాల్లో లొసుగులు ఉన్నాయంటూ ఆడిటింగ్ సంస్థలు వెల్లడించాయి. అలాగే కొన్ని రుణాల మంజూరులోనూ అవకతవకలు జరిగాయని పేర్కొన్నాయి. 2019 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాలను ఆడిట్ చేసిన డెలాయిట్ హాస్కిన్ అండ్ సెల్స్‌, చతుర్వేది అండ్ షా సంస్థలు ఈ మేరకు నివేదికలను స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించాయి. "ఆర్థిక ఫలితాలపై అభిప్రాయాలు తెలపడానికి ఆడిట్‌పరంగా తగిన ఆధారాలేమీ లభించలేదు" అని పేర్కొన్నాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్ అన్‌సెక్యూర్డ్ రుణాలను జారీ చేసిన తీరు, వాటిని రోలోవర్ చేసిన తీరులో చాలా లోపాలు ఉన్నాయని రెండు ఆడిట్ సంస్థలు తెలిపాయి. కొన్ని రుణాల మంజూరులో అవకతవకలు కూడా జరిగాయని పేర్కొన్నాయి. కంపెనీ కార్యకలాపాలు యధాప్రకారం సాగలేకపోవచ్చనే సందేహాలు రేకెత్తించేవిగా ఈ పరిణామాలు ఉన్నాయని వివరించాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన డీహెచ్‌ఎఫ్ఎల్ ప్రస్తుతం దాదాపు రూ. 6,900 కోట్ల మేర నిధుల సమీకరణ ప్రయత్నాల్లో ఉంది. ప్రమోటర్ల వాటాలో దాదాపు 50 శాతం వాటాల కొనుగోలు కోసం లోన్‌ స్టార్‌, కేకేఆర్ వంటి పీఈ సంస్థలు చర్చలు జరుపుతున్నాయి. ప్రస్తుతం ప్రమోటర్లకు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో 40 శాతం వాటాలు ఉన్నాయి.



You may be interested

నిలిచిపోయిన ఆర్‌ఐఎల్‌, అరామ్‌కో డీల్‌..!

Wednesday 24th July 2019

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్‌ వ్యాపారంలో 25 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సౌదీకి చెందిన అరామ్‌కో ఆసక్తి చూపుతుందన్న విషయం తెలిసిందే కాగా, ఈ డీల్‌ నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పాదక కంపెనీల్లో ఒకటైన సౌదీ అరామ్‌కో లెక్కించిన విలువకు.. ఆర్‌ఐఎల్‌ వాల్యుయేషన్‌కు అంతరం అధికంగా ఉన్న కారణంగానే ఈ డీల్‌ నిలిచిపోయినట్లు చెబుతున్నాయి. ఈ

2018-2019కు ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పొడిగింపు

Wednesday 24th July 2019

న్యూఢిల్లీ: 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2019-2020 అసెస్‌మెంట్‌ ఇయర్‌) వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్న్స్‌ (ఐటీఆర్‌) దాఖలుకు గడవును కేంద్రం నెలపాటు పొడిగించింది. నిజానికి అకౌంట్ల ఆడిటింగ్‌ అవసరంలేని వేతన జీవులు, సంస్థలుసహా వ్యక్తిగత ఐటీఆర్‌ దాఖలుకు  గడువు 2019 జూలై 31తో పూర్తి కావాల్సి ఉంది. అయితే ఆయా వర్గాలకు కొంత వెసులుబాటు లక్ష్యంగా సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌) రిటర్న్‌ దాఖలు గడువును ఆగస్టు

Most from this category