News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్ల హోల్డింగ్‌ స్తంభన

Tuesday 8th October 2019
news_main1570510885.png-28770

  • సీడీఎస్‌ఎల్‌ నిర్ణయం 
  • క్యూ1 ఫలితాలు వెల్లడించలేకపోవడమే కారణం 

న్యూఢిల్లీ: దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పరేషన్‌ లిమిటెడ్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) కంపెనీ ప్రమోటర్ల షేర్ల హోల్డింగ్‌ను డిపాజిటరీ సంస్థ సీడీఎస్‌ఎల్‌ స్తంభింపజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఇప్పటివరకూ వెల్లడించకపోవడమే దీనికి కారణమని సమాచారం. కాగా మరికొన్ని వారాల్లోనే ఆర్థిక ఫలితాలను వెల్లడించే అవకాశాలున్నాయని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయమై ఈ నెల 17న  బోర్డ్‌ మీటింగ్‌ను  ఏర్పాటు చేయనున్నామని ఈ వర్గాలు తెలిపాయి. ఆడిటర్లు రాజీనామా చేయడంతో కొత్త ఆడిటర్లను  నియమించామని, ఈ కొత్త ఆడిటర్లు ఆర్థిక ఫలితాలను మదింపు చేయడానికి సమయం పట్టినందువల్లే ఫలితాలు ఆలస్యమయ్యాయని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ అంటోంది. 

ప్రమోటర్ల షేర్ల హోల్డింగ్‌ను సీడీఎస్‌ఎల్‌ స్తంభింపజేయడంతో బీఎస్‌ఈలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్‌ 7 శాతం నష్టంతో రూ.29 వద్ద ముగిసింది. 



You may be interested

మార్కెట్లోకి బీఎండబ్ల్యూ కొత్త ఎం5 కాంపిటిషన్‌

Tuesday 8th October 2019

- ధర రూ. 1.55 కోట్లు - 3.3 సెకన్లలోనే సున్నా నుంచి 100కి.మీ న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తన ‘ఎం5 కాంపిటిషన్‌’ ప్రీమియం సెడాన్ కారులో అధునాతన వెర్షన్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కేవలం 3.3 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని ఈ కారు అందుకోగలదని ప్రకటించింది. దీని ధర రూ. 1.55 కోట్లు. సీబీయూ (కంప్లీట్‌ బిల్డ్‌ యూనిట్‌) తరహాలో..

నిప్పన్‌ చేతికి రిలయన్స్‌ ఏఎంసీ వ్యాపారం

Tuesday 8th October 2019

- రూ. 6,000 కోట్లు చెల్లించి 75 శాతం వాటా కైవసం - నిప్పన్‌ ఇండియా ఎంఎఫ్‌గా పేరు మార్పు ముంబై: రిలయన్స్‌ క్యాపిటల్‌కు చెందిన అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ)లో.. జపాన్‌కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం నిప్పన్‌ లైఫ్ తనకు ఉన్న వాటాను పెంచుకోవడం ద్వారా ఏఎంసీ వ్యాపారాన్ని కైవసం చేసుకుంది. అనీల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌కు రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌ (ఆర్‌నామ్‌)లో ఉన్న మొత్తం

Most from this category