News


కంపెనీగా కొనసాగలేమేమో !

Monday 15th July 2019
news_main1563169919.png-27062

  • ఆందోళన వ్యక్తం చేసిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌
  • క్యూ4లో రూ.2,224 కోట్ల నికర నష్టాలు 
  • కంపెనీకి ఇవే అత్యధిక నష్టాలు 

న్యూఢిల్లీ: గత కొన్ని క్వార్టర్లలో జరిగిన పరిణామాల కారణంగా,.. భవిష్యత్తులో కంపెనీగా కొనసాగలేమోనన్న ఆందోళనను హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వ్యక్తం చేసింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో క్వార్టర్‌లో రూ.2,224 కోట్ల నికర నష్టాలు వచ్చాయని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తెలిపింది. రూ.3,280 కోట్ల అదనపు కేటాయింపుల కారణంగా ఈ స్థాయిలో నష్టాలొచ్చాయని, తమ కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక నష్టమని పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.134 కోట్ల నికర లాభం వచ్చిందని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి  రూ.1,036 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది.  కాగా గత క్యూ4లో రూ.372 కోట్ల నిర్వహణ లాభం సాధించామని, మొత్తం గత ఆర్థిక సంవత్సరానికి ఇది రూ.2,378 కోట్లని పేర్కొంది. 

ఆర్థికంగా తీవ్ర ఒత్తిడి... 
2018, సెప్టెంబర్‌ తర్వాత రుణాల మంజూరు, రుణ వృద్ది భారీగా పడిపోయాయని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తెలిపింది. దీంతో క్యూ3, క్యూ4 ఫలితాలపై తీవ్రమైన ప్రభావం పడిందని, ఇది మొత్తం ఆర్థిక సంవత్సరం పనితీరుపై ప్రభావం చూపించిందని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడి ఉందని పేర్కొంది. 

సగం ప్రమోటర్ల వాటా విక్రయం ద్వారా రూ.6,900 కోట్లు ! 
నిధులు సమీకరించే సత్తాను కోల్పోయామని, వ్యాపారం పూర్తిగా అడుగంటిదని, రుణ మంజూరీలు దాదాపుగా నిలిచిపోయాయని తెలిపింది. ఈ పరిణామాలన్నింటి కారణంగా భవిష్యత్తులో కంపెనీగా కొనసాగగలమో లేమోనన్న సందేహాలు వస్తున్నాయని వివరించింది. పరిష్కార ప్రక్రియ తుది దశలో ఉందని, దీనికి సంబంధించిన ప్రణాళికను త్వరలోనే రుణదాతలకు సమర్పిస్తామని తెలిపింది. మూలధన నిధులందించే వ్యూహాత్మక ఇన్వెస్టర్‌ అన్వేషణ కూడా దాదాపుగా పూర్తి కావచ్చొందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై మరో రెండు వారాల్లో కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపింది. కాగా కంపెనీ ప్రమోటర్లు.. తమ వాటాలో దాదాపు సగాన్ని ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలకు విక్రయించి రూ.6,900 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నారని సమాచారం. ఈ కంపెనీ ప్రమోటర్లైన వాధ్వాన్‌ కుటుంబానికి 40 శాతం వాటా ఉంది.



You may be interested

కరెన్సీ నోట్లను గుర్తించేందుకు మొబైల్ యాప్‌

Monday 15th July 2019

ఆర్‌బీఐ కసరత్తు న్యూఢిల్లీ: చూపులేని వారు సైతం కరెన్సీ నోట్లను సులభంగా గుర్తించగలిగేలా ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేవడంపై రిజర్వ్ బ్యాంక్ కసరత్తు చేస్తోంది. దీని రూపకల్పన కోసం యాప్స్ తయారీ సంస్థల నుంచి బిడ్స్‌ ఆహ్వానించింది. మొబైల్ ఫోన్ కెమెరా ముందు నోటును ఉంచితే.. దాని విలువను తెలియజేసే విధంగా యాప్‌ ఉండాలని ప్రతిపాదించింది. ఒకవేళ కరెన్సీ నోటును కెమెరా ముందు సరైన యాంగిల్‌లో ఉంచని పక్షంలో ఆ

ఈవారం స్టాక్‌ సిఫార్సులు

Monday 15th July 2019

టైటాన్‌ కంపెనీ    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌  ప్రస్తుత ధర: రూ.1,101 టార్గెట్‌ ధర: రూ.1,250 ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో ఆభరణాల విభాగం పనితీరు అంతంతమాత్రంగానే ఉందని కంపెనీ పేర్కొంది. పుత్తడి ధరలు పెరగడం, వినియోగం తగ్గడం వంటి కారణాల వల్ల ఈ విభాగం ఆదాయం 13 శాతం మాత్రమే పెరిగింది. అయితే ఇతర జ్యూయలరీ కంపెనీల మార్కెట్‌ వాటా తగ్గుతుండగా, తనిష్క్‌ బ్రాండ్‌ మార్కెట్‌ వాటా

Most from this category