మాట నిలుపుకున్న డీహెచ్ఎఫ్ఎల్
By Sakshi

న్యూఢిల్లీ: డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ జూన్ 4న చెల్లించాల్సిన ఎన్‌సీడీలపై వడ్డీ చెల్లింపులను మంగళవారం నాటికి పూర్తిగా చెల్లించివేసింది. సెక్యూర్డ్ రిడీమబుల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లపై (ఎన్సీడీ) వడ్డీని ఈ కంపెనీ జూన్ 4న చెల్లించాల్సి ఉంది. అయితే నిధుల సమస్యతో ఈ చెల్లింపుల్లో విఫలమైంది. ఏడు రోజుల గ్రేస్ పీరియడ్‌లో వడ్డీ చెల్లింపులు జరుపుతామని ఈ నెల 7న డీహెచ్ఎఫ్ఎల్ ప్రకటించింది. అనుకున్నట్లుగానే ఏడు రోజుల్లోనే ఈ వడ్డీ చెల్లింపులను పూర్తిగా చెల్లించామని స్టాక్ ఎక్స్చేంజ్లకు డీహెచ్ఎఫ్ఎల్ నివేదించింది. మొత్తం 12 ఎన్‌సీడీలపై రూ.962 కోట్ల వడ్డీని చెల్లించామని తెలిపింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన జారీ చేసిన ఎన్‌సీడీలకు చెల్లించాల్సిన రూ.200 కోట్ల మొత్తాలను కూడా గత వారమే చెల్లించామని వివరించింది.
‘ఆధార్ హౌసింగ్’లో వాటా విక్రయం
తన అనుబంధ సంస్థ, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్‌లో పూర్తి వాటాను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.500 కోట్ల మొత్తాన్ని ఈ చెల్లింపులకు డీహెచ్ఎఫ్ఎల్ వినియోగించినట్లు తెలియవచ్చింది. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్‌లో 9.15 శాతం వాటాను (23 లక్షల షేర్లు) విక్రయించడం ద్వారా డీహెచ్ఎఫ్ఎల్కు రూ.500 కోట్లు లభించాయి. ఈ మొత్తం వాటాను బ్లాక్ స్టోన్ సంస్థ నిర్వహణలో ఉండే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ నియంత్రణలోని బీసీపీ టొప్కో సెవెన్ పీటీఈ కొనుగోలు చేసింది. ఈ వాటా విక్రయం ప్రాతిపదికన ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ విలువ రూ.2,200 కోట్లని అంచనా.
ఈ వడ్డీ చెల్లింపుల్లో విఫలం కావడంతో డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ రూ.850 కోట్ల కమర్షియల్ పేపర్ (సీపీ) రేటింగ్‌ను రేటింగ్ సంస్థలు క్రిసిల్, ఇక్రా డౌన్ గ్రేడ్ చేశాయి. ఏడు రోజుల్లో వడ్డీచెల్లింపులను జరుపుతామన్న మాటను డీహెచ్ఎఫ్ఎల్ నిలుపుకుంది. ఇప్పుడు ఈ రేటింగ్ సంస్థలు ఎలా స్పందిస్తాయోనని నిపుణులు వేచి చూస్తున్నారు.
You may be interested
గూగుల్‌ను వెనక్కి నెట్టిన అమెజాన్
Wednesday 12th June 2019అత్యంత విలువైన బ్రాండ్‌గా అవతరణ అత్యుత్తమ కస్టమర్ సేవలు, భిన్న ఉత్పత్తులు ప్లస్ కాంటార్ 100 టాప్ బ్రాండ్స్ నివేదిక వెల్లడి లండన్: అమెరికాకు చెందిన అగ్రగామి రిటైల్ సంస్థ అమెజాన్... టెక్ దిగ్గజాలైన యాపిల్, గూగుల్‌లను వెనక్కి నెట్టేసి ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా అవతరించింది. అమెజాన్ బ్రాండ్ విలువ గతేడాది 52 శాతం (108 బిలియన్ డాలర్ల మేర) పెరిగి 315 బిలియన్ డాలర్లకు (రూ.22.05 లక్షల కోట్లకు) చేరినట్టు అంతర్జాతీయ
ధరలో సగం సుంకాలే.. ఇది దారుణం !
Wednesday 12th June 2019భారత్‌పై మరోసారి విరుచుకపడ్డ ట్రంప్ సుంకాలను పూర్తిగా తొలగించాల్సిందే ఇక భారత్‌తో వాణిజ్య యుద్ధం ! వాషింగ్టన్: అమెరికా నుంచి భారత్‌కు దిగుమతవుతున్న హార్లే డేవిడ్సన్ బైక్‌లపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. గతంలో ఈ సుంకం వంద శాతంగా ఉండగా, నరేంద్ర మోదీ దీనిని 50 శాతానికి తగ్గించారు. అయినా సంతృప్తి చెందని ట్రంప్ బైక్ ధరలో దాదాపు సగం సుంకాలే ఉన్నాయని, ఇది