News


రూ.400 కోట్ల జీఎస్టీ స్కామ్‌ వెలుగులోకి

Wednesday 25th September 2019
news_main1569383215.png-28525

అహ్మదాబాద్‌: జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ విభాగం రూ.400 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించింది. దేశ రాజధాని ప్రాంతానికి (ఎన్‌సీఆర్‌) చెందిను ఎగుమతిదారులు గుజరాత్‌లోని కాండ్లా ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్‌)లోని యూనిట్ల సాయంతో రూ.400 కోట్ల వరకు జీఎస్‌టీ రిఫండ్‌ను పొందినట్టు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారులు గుర్తించారు. తక్కువ నాణ్యతతో కూడిన పొగాకు ఉత్పత్తులు సెంటెడ్‌ జర్దా, ఫిల్టర్‌ ఖైనీ కేంద్రంగా ఈ స్కామ్‌ జరిగినట్టు డీజీజీఐ తెలిపింది. వీటిని కిలో రూ.50-350కు కొనుగోలు చేసి, కాంట్లా ఎస్‌ఈజెడ్‌ యూనిట్లకు కిలో రూ.5,000-9,000కు ఎగుమతి చేసినట్టుగా చూపించారని పేర్కొంది. మార్కెట్‌ విలువ కంటే 3,000 శాతం అధికంగా చూపించడం ద్వారా అక్రమంగా రూ.400 కోట్లను ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ కింద పొందారని తెలిపింది. 20 ఎగుమతి సంస్థలు, కాండ్లా ఎస్‌ఈజెడ్‌లోని పలు యూనిట్ల పాత్ర ఇందులో ఉన్నట్టు తన ప్రకటనలో పేర్కొంది. నకిలీ రూ.1,000 కోట్లకు పైగా విలువకు సమానమైన ఇన్‌వాయిస్‌లు విడుదల చేసిన 25 పరఫరాదారులను గుర్తించినట్టు తెలిపింది. 


GST

You may be interested

పెట్టుబడుల ఆకర్షణీయ దేశంగా భారత్‌!

Wednesday 25th September 2019

- కార్పొ పన్ను కోతతో కీలక పరిణామం - ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ - ఆర్థికమంత్రితో భేటీ న్యూఢిల్లీ: కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో భారత్‌ పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా మారిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనదిగా ఆయన అభివర్ణించారు.   ఆర్థిక మందగమనానికి మందుగా దేశీయ కంపెనీలపై 30 శాతంగా ఉన్న పన్నును 25.2 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మలా

స్వల్ప నష్టాలతో ప్రారంభం

Wednesday 25th September 2019

 ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా బుధవారం భారత్‌ స్టాక్‌ సూచీలు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 9 పాయింట్ల నష్టంతో 39,087 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో 11,565 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. 

Most from this category