News


97 విమానాలకు ఇంజన్లు మార్చాల్సిందే

Saturday 2nd November 2019
news_main1572668536.png-29303

  • లేదంటే వాటిని నిలిపివేయాల్సిందే
  • ఇండిగోకు జనవరి వరకు గడువిచ్చిన డీజీసీఏ
  • ఇంజన్లలో తరచూ సమస్యలే కారణం

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో, తన నిర్వహణలో ఉన్న 97 ఏ320 నియో విమానాలకు ప్రస్తుత ‘ప్రట్‌ అండ్ విట్నీ’ (పీడబ్ల్యూ) ఇంజన్లను (రెండు రెక్కల్లోనూ) వచ్చే జనవరి 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాలని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) శుక్రవారం ఆదేశించింది. లేదంటే వాటిని నిలిపివేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇండిగో వద్దనున్న 97 విమానాల్లో 23 విమానాల పీడబ్ల్యూ ఇంజన్లు ఇప్పటికే 2,900 గంటల కంటే ఎక్కువ సమయం పాటు పనిచేసినవి. వీటిని మొదటి దశలో ఈ నెల 19వ తేదీలోపు మార్చాల్సి ఉంటుందని డీసీజీఏ ఆదేశించింది. గడిచిన వారం వ్యవధిలో నాలుగు ఏ320 నియో విమానాల ఇంజన్లలో లోపాలు తలెత్తాయి. ఇవి తీవ్ర ఆందోళనకు, అంతరాయానికి దారితీసినట్టు డీజీసీఏ పేర్కొంది. ఈ నెల 19 తర్వాత 23 నియో320 విమానాల్లో కనీసం ఒక ‘లో ప్రెషర్‌ టర్బైన్‌ (ఎల్‌పీటీ) మోడిఫైడ్‌ ఇంజన్‌’ లేకుంటే వాటిని వాణిజ్య కార్యకలాపాలకు అనుమతించేది లేదని డీజీసీఏ స్పష్టం చేసింది. మొత్తం 247 విమానాలతో ఇండిగో దేశ విమానయాన రంగంలో 48 శాతం వాటాతో అగ్రగామి సంస్థగా ఉంది. మూడు రోజుల క్రితమే 300 ‘ఎయిర్‌బస్‌ 320 నియో’ విమానాలకు ఇండిగో ఆర్డర్‌ ఇవ్వడం గమనార్హం. అయితే, వీటికి సంబంధించి ఇంజన్లు ఏవి ఉండాలన్నది తర్వాత తెలియజేసే అవకాశాన్ని కలిగి ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో విమానాలను ప్రవేశపెట్టే ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని, వీటికంటే ముందు ప్రస్తుతం నడుపుతున్న విమానాలకు మోడిఫైడ్‌ ఇంజన్లను అవసరమైన మేర సమకూర్చుకోవాలని డీజీసీఏ సూచించింది. You may be interested

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రెట్టింపు..

Saturday 2nd November 2019

క్యూ2లో రూ. 1,093 కోట్లు పన్ను ప్రయోజనాలు, వన్‌ టైమ్‌ ఆదాయాల ఊతం ఆదాయంలో 26 శాతం వృద్ధి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,093 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 504 కోట్లతో పోలిస్తే 117 శాతం అధికం. క్యూ2లో ఆదాయం రూ. 3,798

మరిన్ని మెట్రో నగరాలకు ఐస్ప్రౌట్‌

Saturday 2nd November 2019

2020లో అదనంగా ఆరు కేంద్రాలు తోడవనున్న 5,000 సీట్ల సామర్థ్యం సాక్షితో ఐస్ప్రౌట్‌ సీఈవో సుందరి పాటిబండ్ల హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- కార్యాలయం ఏర్పాటు పెట్టుబడితో కూడుకున్నది. అందుకే అన్ని సౌకర్యాలు, వసతులతో వినియోగానికి సిద్ధంగా ఉన్న కో-వర్కింగ్‌ స్పేస్‌ కల్చర్‌ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు ఇప్పుడు ఈ కేంద్రాలే అడ్డా అని అంటున్నారు ఐస్ప్రౌట్‌ సీఈవో, కో-ఫౌండర్‌ సుందరి పాటిబండ్ల. కంపెనీ ఆరవ సెంటర్‌ను హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో

Most from this category