News


నె‍స్లేకు రూ.100 కోట్ల అక్రమార్జన!

Tuesday 23rd October 2018
news_main1540271091.png-21393

న్యూఢిల్లీ: జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయకుండా అగ్రగామి ఎఫ్‌ఎంసీజీ కంపెనీ నెస్లే ఇండియా రూ.100 కోట్ల మేర అక్రమ లాభార్జనకు పాల్పడింది. ఈ విషయం జీఎస్‌టీ అక్రమార్జన నిరోధక విభాగం (డీజీఏపీ) దర్యాప్తులో తేలింది. దీంతో కంపెనీ స్వచ్ఛందంగా రూ.16.58 కోట్లను వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేసింది. అక్రమార్జన నిరోధక జాతీయ విభాగానికి (ఎన్‌ఏఏ) ఈ మేరకు డీజీసీఏ నివేదిక సమర్పించింది. దీనిపై నెస్లే అధికార ప్రతినిధి స్పందిస్తూ... పన్ను రేటు తగ్గింపును వినియోగదారులకు బదిలీ చేయనందున తాము స్వచ్చందంగా రూ.16.58 కోట్లను వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేసినట్టు తెలిపారు. ‘‘తక్షణమే గరిష్ట విక్రయ ధరను తగ్గించే అవకాశం లేని లేక గ్రాములను పెంచలేని పరిస్థితుల్లో రూ.16.58 కోట్లను పక్కన పెట్టాం. విక్రయాలు, లాభాల్లో చూపించకుండా ఉండేందుకు, క్రమంగా బదిలీ చేసేందుకు ఇలా చేశాం. వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలన్న అధికారిక యంత్రాంగం సూచన మేరకు నడుచుకున్నాం’’ అని నెస్లే ఇండియా తెలిపింది. మ్యాగి నూడుల్స్‌, నెస్‌కెఫే, కిట్‌క్యాట్‌, మంచ్‌ చాక్లెట్లు, సెరిలాక్‌ తదితర ఉత్పత్తులను నెస్లే ఇండియా తయారు చేస్తోంది. చట్టంలోని నిబంధనల ప్రకారం పన్ను రేటు తగ్గింపును కస్టమర్లకు బదిలీ చేయలేని పరిస్థితుల్లో కంపెనీలు ఆ మొత్తాన్ని డిపాజిట్‌ చేసేందుకు వినియోగదారుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. 



You may be interested

దేశీ బ్యాంకుల లాభం.. అంతంతే!

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారతీయ బ్యాంకుల లాభదాయకత తక్కువగా ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. మూలధనంపరంగా చూసినా దేశీ బ్యాంకులు బలహీనంగా ఉన్నాయని తెలిపింది. అయితే, అసెట్ క్వాలిటీ స్థిరపడే కొద్దీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పరిస్థితి మెరుగుపడొచ్చని ఒక నివేదికలో పేర్కొంది. "కీలకమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల‍్లో ఒత్తిళ్ల కారణంగా భారత బ్యాంకింగ్ వ్యవస్థలో అసెట్ క్వాలిటీ బలహీనంగా ఉంది. అయితే,

టాటా టెలీ రూ.28,651 కోట్ల పెట్టుబడులు రైటాఫ్‌

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: టాటాలకు చెందిన నష్టాల్లో ఉన్న టెలికం కంపెనీ టాటా టెలీ సర్వీసెస్‌కు ఊరటనిచ్చే నిర్ణయాన్ని టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ తీసుకుంది. టాటా టెలీ సర్వీసెస్‌ పెట్టిన మొత్తం రూ.28,652 కోట్ల పెట్టుబడులను రైటాఫ్‌ చేసింది. టాటా టెలీసర్వీసెస్‌కు చెందిన కన్సూమర్‌ మొబైల్‌ వ్యాపారాన్ని భారతీ ఎయిర్‌టెల్‌కు బదలాయించిన విషయం తెలిసిందే. మరోవైపు ఎంటర్‌ప్రైజ్‌ సెగ్మెంట్‌ను టాటా గ్రూప్‌నకే చెందిన టాటా కమ్యూనికేషన్స్‌లో విలీనం చేసింది.

Most from this category