News


అంచనాలు తగ్గించినా.. భారత్‌దే అగ్రస్థానం

Saturday 19th October 2019
news_main1571458183.png-28992

  • ఐఎంఎఫ్‌ వృద్ధి నివేదికపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
  • వృద్ధి వేగవంతం చేసేందుకు మరిన్ని చర్యలు

వాషింగ్టన్‌: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనాలను కుదించినా.. ఇప్పటికీ అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్‌ కూడా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అధిక వృద్ధి సాధన దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోందని ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె విలేకరులకు చెప్పారు. భారత్‌ వృద్ధి రేటు ఈ ఏడాది 6.1 శాతానికే పరిమితం కావొచ్చని, 2020లో 7 శాతానికి పెరగవచ్చని ఐఎంఎఫ్‌ ఒక నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. "అంచనాలు కుదించినా అంతర్జాతీయంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ భారత్‌ వేగవంతమైన వృద్ధి సాధిస్తోందన్న విషయం గుర్తుంచుకోవాలి. వృద్ధి రేటు మరింతగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకోసం అన్ని ప్రయత్నాలూ చేస్తాను" అని నిర్మల చెప్పారు. మరోవైపు, వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం నుంచి ఆయా వర్గాలు ఏం ఆశిస్తున్నాయన్నది తెలుసుకుంటున్నామని.. తగు చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు.
 
అమెరికాతో త్వరలో వాణిజ్య ఒప్పందం...
వాణిజ్యపరమైన అంశాలపై అమెరికాతో నెలకొన్న విభేదాలు క్రమంగా తగ్గుతున్నాయని, త్వరలోనే ఇరు దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకోగలవని నిర్మల తెలిపారు. విభేదాల పరిష్కారంపై వాణిజ్య శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోందని, వీటిపై చర్చలు త్వరలోనే పూర్తి కాగలవని ఆమె చెప్పారు. మరోవైపు, ఇటీవలి భారత పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడేలా తమ దేశ వాణిజ్య మంత్రి విల్బర్ రాస్‌ కృషి చేసినట్లు అమెరికా వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత పర్యటన సందర్భంగా కేంద్ర వాణిజ్య మంత్రి పియుష్ గోయల్‌తో పాటు నిర్మలా సీతారామన్ తదితరులతో రాస్ సమావేశమయ్యారు. 



You may be interested

పెద్ద సంస్థలకు డిజిటల్‌ చెల్లింపులపై ఇక చార్జీల్లేవు

Saturday 19th October 2019

న్యూఢిల్లీ: బ్యాంకులు లేదా సిస్టమ్‌ ప్రొవైడర్లు.. రూ.50 కోట్లకు పైగా టర్నోవర్‌ కలిగిన వ్యాపార సంస్థలకు డిజిటల్‌ రూపంలో చేసే చెల్లింపులపై అటు కస్టమర్ల నుంచి కానీ, ఇటు వర్తకుల నుంచి కానీ ఎటువంటి చార్జీలు లేదా మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటును వసూలు చేయరాదంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. వార్షిక టర్నోవర్‌ రూ.50 కోట్లకు పైగా ఉన్న సంస్థలు తమ కస్టమర్లకు

27ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి

Saturday 19th October 2019

1992 తరువాత అతి తక్కువ బీజింగ్‌: చైనా 2019 మూడవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) కేవలం 6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 1992 తరువాత ఒక త్రైమాసికంలో ఇంత తక్కువ స్థాయి వృద్ధి రేటు ప్రపంచ రెండవ ఆర్థిక వ్యవస్థలో నమోదుకావడం ఇదే తొలిసారని నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ పేర్కొంది. పపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకూ మరింత నష్టం వాటిల్లకుండా, అమెరికా-చైనా తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి వచ్చిన కేవలం ఒక్కవారంలోనే

Most from this category