News


ఏజీఆర్‌పై స్వీయ మదింపు వివరాలు ఇవ్వండి

Tuesday 25th February 2020
news_main1582600182.png-32060

  • టెలికం కంపెనీలను కోరిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బకాయిల విషయమై స్వీయ మదింపునకు సంబంధించి వివరాలు ఇవ్వాలని టెలికం కంపెనీలు వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా టెలీసర్వీసెస్‌లను టెలికం శాఖ కోరింది. ఏజీఆర్‌ లెక్కలను పరిశీలించేందుకు ఈ ఆధారాలు టెలికం శాఖకు సాయపడతాయని ఓ అధికారి తెలిపారు. 15 టెలికం కంపెనీలు రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాలన్నది టెలికం శాఖ డిమాండ్‌. ఇందులో రూ.92,642 కోట్లు లైసెన్స్‌ ఫీజు, రూ.55,054 కోట్లు స్పెక్ట్రమ్‌ యూసేజీ చార్జీల రూపంలో చెల్లించాల్సి ఉంది. ఇందులో 60 శాతం వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ కంపెనీలకు సంబంధించినదే. టెలికం శాఖ లెక్కల ప్రకారం వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సిన బకాయిలు రూ.53,000 కోట్లు. కానీ, వొడాఫోన్‌ లెక్కుల ప్రకారం ఇది రూ.35,000 కోట్లుగానే ఉంది. అంటే టెలికం కంపెనీల లెక్కలకు, టెలికం శాఖ లెక్కలకు మధ్య అంతరం ఉండడంతో, మరో విడత అన్ని సర్కిళ్లలోనూ టెలికం అధికారులు ఖాతాల మదింపు కార్యక్రమం చేపట్టారు.  
గెయిల్‌కు రూ.7,608 కోట్ల నోటీస్‌...
2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.7,608 కోట్లు చెల్లించాలంటూ ప్రభుత్వరంగ గెయిల్‌కు టెలికం శాఖ నోటీసు జారీ చేసింది. ఏజీఆర్‌ బకాయిల రూపంలో రూ.1.83 కోట్లు చెల్లించాలంటూ గెయిల్‌కు గతంలో జారీ చేసిన డిమాండ్‌ నోటీసు గురించి తాజాగా ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతర్గత సమాచార అవసరాల కోసం గెయిల్‌, ఆయిల్‌ ఇండియా, పవర్‌గ్రిడ్‌ సంస్థలు ఐపీ-2 లైసెన్స్‌లను గతంలో తీసుకున్నాయి. టెలికం కంపెనీల అన్ని రకాల ఆదాయంపై చార్జీలను రాబట్టాలన్నది సుప్రీంకోర్టు ఆదేశం. అంటే టెలికం కంపెనీలు, టెలికం సేవలు కాకుండా ఇతర రూపాల్లో ఆర్జించే ఆదాయంపైనా ప్రభుత్వానికి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా టెలికం లైసెన్స్‌లు కలిగిన ప్రభుత్వరంగ కంపెనీలూ గత 14 ఏళ్ల కాలానికి సంబంధించిన ఆదాయాలపై బకాయిలు చెల్లించాలంటూ టెలికం శాఖ నోటీసులు జారీ చేయడం గమనార్హం. 



You may be interested

మేక్‌మైట్రిప్‌, ఓయోలపై సీసీఐ విచారణ

Tuesday 25th February 2020

న్యూఢిల్లీ: అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ మేక్‌మైట్రిప్ (ఎంఎంటీ), హోటల్ సేవల సంస్థ ఓయోలపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ కంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆదేశించింది. ఓయో ప్రత్యర్థి ట్రీబో హోటల్స్ మాతృసంస్థ రబ్‌టబ్ సొల్యూషన్స్ ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పోటీ నిబంధనలను ఉల్లంఘించాయన్న ప్రాథమిక ఆధారాలతో ఈ రెండు సంస్థల మీద సీసీఐ విచారణకు ఆదేశించడం ఆరు

నగదు రాజు అయితే.. డిజిటల్‌ దైవం

Tuesday 25th February 2020

ఆర్‌బీఐ సరికొత్త నినాదం ముంబై: నగదు రాజు అయితే డిజిటల్‌ కరెన్సీ దైవంగా ఆర్‌బీఐ పేర్కొంటోంది. డీమోనిటైజేషన్‌ తర్వాత వ్యవస్థలో రూ.3.5 లక్షల కోట్ల మేర నగదు వినియోగం తగ్గిందన్న ఆర్‌బీఐ, డిజిటల్‌ చెల్లింపులను గొప్ప అనుభవంగా మార్చడమే తన ప్రయత్నమని తెలిపింది. వ్యవస్థలో నగదు చెల్లింపులకు సంబంధించి కచ్చితమైన కొలమానాలు లేవని, డిజిటల్‌ చెల్లింపుల ప్రగతిని మాత్రం కచ్చితంగా లెక్కించొచ్చని పేర్కొంది. గత ఐదేళ్లలో డిజిటల్‌ చెల్లింపులు సంఖ్యా పరంగా

Most from this category