News


ఫేస్‌మాస్క్‌లకు భారీగా పెరిగిన డిమాండ్‌

Friday 14th February 2020
news_main1581668074.png-31795

కోవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వ్యాపారాలు దెబ్బతింటే మరికొన్ని లాభపడ్డాయి. వాటిలో శానిటైజర్స్‌, ఫేస్‌మాస్కులు విక్రయించే ఫ్మార్మా కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో కోవిడ్‌-19 భయంతో అధిక సంఖ్యలో వినియోగదారులు ఫేస్‌మాస్కులు కొనుగోలు చేశారు. ఈ నాలుగు నగరాల్లో ఇప్పటికే ఫేస్‌మాస్క్‌లు నిల్వలు అయిపోయాయి. మరికొన్ని వారాల్లో శానిటైజర్స్‌ కూడా అయిపోతాయని చెబుతూ.. ‘‘ఆల్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ లైసెన్స్‌ హోల్డర్స్‌ ఫౌండేషన్‌ (ఏఎఫ్‌డీఎల్‌హెచ్‌ఎఫ్‌)’’ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ఇచ్చిన డేటా ప్రకారం...ఈ నాలుగు  నగరాల్లో 7 వేల ఫార్మసీలలో ఏడాదికి ఫేస్‌మాస్క్‌ల విక్రయాల వ్యాపారం రూ.200 కోట్లుగా ఉంటుంది. కానీ కోవిడ్‌ భయానికి గడిచిన రెండునెలల్లోనే రూ.450 కోట్లకు చేరింది. కాగా 20-30లక్షల స్టాక్‌ అందుబాటులో ఉండగా, నెలకు 3-4 లక్షల మాస్క్‌లను తయారు చేయగల సామర్థ్యం ఇండియాకు ఉందని ఏఎఫ్‌డీఎల్‌హెచ్‌ఎఫ్‌ పేర్కొంది. ఫిబ్రవరి ప్రారంభంలో ఫేస్‌మాస్క్‌ల డిమాండ్‌ 6-7 లక్షల వరకు ఉందని, ఇప్పటిదాక  10-12 లక్షల విక్రయాలు జరిగాయని ఏఎఫ్‌డీఎల్‌హెచ్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు అభయ్‌ పాండే తెలిపారు. పెద్దమెట్రోనగరాల తర్వాత అమ్మాదాబాద్‌, హైదరాబాద్‌, జైపూర్‌లలో హ్యాండ్‌ శానిటైజర్స్‌, ఫేస్‌ మాస్క్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని ఆన్‌లైన్‌ ఫార్మసీ ఫామ్‌ఈజీ వెల్లడించింది.ఇండియా, ఉత్తర అమెరికా, యూరప్‌,చైనాలో ఫేస్‌మాస్క్‌లకు అధిక డిమాండ్‌ ఏర్పడిందని ఫామ్‌ఈజీ తెలిపింది. ఆన్‌లైన్‌లోగానీ, ఆఫ్‌లైన్‌లోగాని ఢిల్లీలో రోజుకి 12-15వేల మాస్క్‌లు విక్రయించామని నిరావన్‌ బీయింగ్‌ అనే  ఫార్మా సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకు ఉన్న స్టాక్‌ మరో వారంరోజుల్లో అయిపోతుందని పేర్కొంది. 
 You may be interested

ఇన్వెస్ట్‌మెంట్స్‌కు వినియోగ రంగాలే భేష్‌

Friday 14th February 2020

లార్జ్‌ క్యాప్స్‌, మిడ్‌ క్యాప్స్‌ అంతరం తగ్గనుంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రియల్టీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఓకే ఇకపై ఆర్థిక వృద్ధి ఊపందుకుంటుంది - పంకజ్‌ బొబాడే, ఫండమెంటల్‌ రీసెర్చ్‌ హెడ్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం, పాలసీ సమీక్షలో రిజర్వ్‌​బ్యాంక్‌ చేసిన ప్రతిపాదనలు ఆర్థిక పురోగతికి దోహదం చేయనున్నాయి. దీంతో మధ్య, దీర్ఘకాలాలలో స్టాక్‌ మార్కెట్లు పుంజుకుంటాయని విశ్వసిస్తున్నట్లు యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ పంకజ్‌ బొబాడే చెబుతున్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనలు, మార్కెమార్కెట్లతోపాటు, వివిధ

సంపదలో భళా.. డీమార్ట్‌ దమానీ

Friday 14th February 2020

కుబేర జాబితాలో ఐదో ర్యాంకు రూ. 1.6 లక్షల కోట్లకు మార్కెట్‌ విలువ రూ. 2560 వద్ద సరికొత్త గరిష్టానికి షేరు డీమార్ట్‌ రిటైల్‌ స్టోర్ల ప్రమోటర్‌ రాధాకిషన్‌ దమానీ తాజాగా సంపదలో మరో మెట్టు ఎక్కారు. ఈ వారం మొదట్లో దేశీ కుబేరుల్లో ఆరో ర్యాంకును సాధించిన రాధాకిషన్‌ ప్రస్తుతం ఐదో స్థానాన్ని ఆక్రమిస్తున్నారు. డీమార్ట్‌ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌​ షేరు ఇటీవల ర్యాలీ బాటలో సాగుతోంది. గురువారం ఈ

Most from this category