News


ప్రపంచ లగ్జరీ మార్కెట్లో ఢిల్లీకి 9వ స్థానం

Wednesday 20th November 2019
news_main1574221357.png-29719

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస మార్కెట్లో మన దేశం నుంచి మూడు నగరాలు చోటు దక్కించుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ 9వ స్థానంలో నిలవగా.. బెంగళూరు 20, ముంబై 28వ స్థానంలో నిలిచాయి.
ప్రభుత్వ విధానాలు అఫర్డబుల్‌ వైపే...
2018 రెండో త్రైమాసికంలో ముంబై 30వ స్థానంలో ఉండగా.. ఇప్పుడది రెండు స్థానాలు ఎగబాకి 28కి చేరితే.. బెంగళూరు మాత్రం 15వ స్థానం నుంచి ఐదు స్థానాలు కిందికి దిగజారి.. 20కి చేరిందని నైట్‌ఫ్రాంక్‌ తాజా నివేదిక తెలిపింది. గతేడాది రెండో త్రైమాసికంలో ఢిల్లీ 10వ స్థానంలో నిలిచింది. ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాష్, వసంత్‌ విహార్, ఆనంద్‌నికేతన్, ఢిఫెన్స్‌ కాలనీ, గ్రీన్‌ పార్క్‌ వంటి ప్రాంతాల్లో లగ్జరీ గృహాల ధరలు 4.4 శాతం వృద్ధి చెందాయి. బెంగళూరులో ధరలు 2.1 శాతం, ముంబైలో 0.8 శాతం వృద్ధి చెందాయి. ఇక, ఆయా నగరాల్లో చ.అ. సగటు ధరలు చూస్తే.. ముంబైలో రూ.64,775, ఢిల్లీలో రూ.33,511, బెంగళూరులో 19,709లుగా ఉన్నాయి. ‘‘మన దేశంలో ప్రభుత్వ విధాన నిర్ణయాలు అఫర్డబుల్, మధ్య స్థాయి గృహాల అభివృద్ధికే పరిమితమయ్యాయి. దీంతో లగ్జరీ ప్రాపర్టీలు సంఘటిత కంపెనీలు, నిధులు సమృద్ధిగా ఉన్న కంపెనీలు మాత్రమే చేస్తున్నాయి’’ అని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశీర్‌ బైజాల్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 
మొదటి స్థానంలో మాస్కో...
గ్లోబల్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్‌ ఫ్రాంక్‌ ‘ప్రైమ్‌ గ్లోబల్‌ సిటీ ఇండెక్స్‌’ స్థానిక మార్కెట్లో రియల్టీ ధరల ఆధారంగా ర్యాంక్‌లను కేటాయిస్తుంది. 2019 రెండో త్రైమాసికం నివేదిక ప్రకారం లగ్జరీ రెసిడెన్షియల్‌ మార్కెట్లో మొదటి స్థానంలో రష్యా రాజధాని మాస్కో నిలిచింది. గత ఏడాది కాలంలో ఇక్కడ గృహాల ధరలు 11.1 శాతం వృద్ధి చెందాయి. ఆ తర్వాతి స్థానంలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ (10.3 శాతం), తైవాన్‌లోని తైపే (8.9 శాతం) నిలిచాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ అత్యంత క్షీణ స్థితిలో ఉంది. ఇక్కడ లగ్జరీ గృహాల ధరలు 12.9 శాతం పడిపోయాయి. 



You may be interested

భారీ గ్యాప్‌అప్‌...12,000పైన నిఫ్టీ

Wednesday 20th November 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతి ఎయిర్‌టెల్‌లతో పాటు బ్యాంకింగ్‌ షేర్లు లాభాలతో ప్రారంభంకావడంతో భారత్‌ స్టాక్‌ సూచీలు భారీగ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 250 పాయింట్ల లాభంతో 40,720 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 12,005 పాయింట్ల గ్యాప్‌అప్‌తోనూ ఆరంభమయ్యాయి. 

భారత్‌కు అంతర్జాతీయ పరిణామాల ముప్పు

Wednesday 20th November 2019

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత్‌పై క్రమంగా పెరుగుతోందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ వై.వి.రెడ్డి అన్నారు. అలాగే అంతర్జాతీయ పరిణామాలకు భారత్‌ కూడా కారణం అవుతోందని చెప్పారు. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ కాంప్లెక్స్‌ చాయిసెస్‌ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన ప్రసంగించారు. ‘చైనా, ఇరాన్‌, మధ్యప్రాచ్య దేశాల్లో ప్రస్తుతం తలెత్తిన

Most from this category