News


ఐయూసీపై జాప్యం .. టెలికం సేవలకు ప్రతికూలం

Saturday 16th November 2019
news_main1573876893.png-29635

  • రిలయన్స్ జియో వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఇంటర్‌కనెక్ట్ యూసేజీ చార్జీల (ఐయూసీ) విధానాన్ని 2020 జనవరిలోగా ఎత్తివేయకుండా కొనసాగించిన పక్షంలో అందుబాటు రేట్లలో టెలికం సేవలను అందించడంపై ప్రతికూల ప్రభావం పడుతుందని రిలయన్స్ జియో వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్ కాల్స్ నిష్పత్తి దాదాపు సరిసమాన స్థాయిలో ఉందని, ఈ రెండింటి మధ్య భారీ అసమతౌల్యం ఉందన్న కారణంతో ఐయూసీ ఎత్తివేతను వాయిదా వేయడం సరికాదని  జియో డైరెక్టర్ మహేంద్ర నహతా పేర్కొన్నారు. ఐయూసీపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ అభిప్రాయాలు తెలిపారు. అటు, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌ సంస్థలు దీన్ని వ్యతిరేకించాయి. ఐయూసీని సున్నా స్థాయికి తగ్గించేయరాదని, దీన్ని పూర్తిగా తొలగించే బిల్‌ అండ్ కీప్ (బీఏకే) విధానం అమలును మూడేళ్ల దాకా వాయిదా వేయాలని కోరాయి. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే కాల్స్‌ను అందుకున్నందుకు గాను ఆపరేటర్లు పరస్పరం చెల్లించుకునే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది నిమిషానికి 6 పైసలుగా ఉంది. 2020 జనవరి నుంచి దీన్ని పూర్తిగా ఎత్తివేయాలని ముందుగా నిర్ణయించినప్పటికీ .. కొనసాగించే అంశాన్నీ ట్రాయ్ పరిశీలిస్తోంది.

ప్రభుత్వ తోడ్పాటుపై వొడాఫోన్ ఆశలు...
టెలికం రంగంలో తీవ్ర సంక్షోభం గురించి ప్రభుత్వానికి తెలుసనే భావిస్తున్నామని, త్వరలోనే కేంద్రం ఊరట చర్యలేవైనా ప్రకటించవచ్చని ఆశిస్తున్నామని ఇన్వెస్టర్లతో సమావేశంలో వొడాఫోన్ ఐడియా పేర్కొంది. టెలికం రంగంలో మూడు ప్రైవేట్ సంస్థలు, ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉండాలన్నది తన అభిమతంగా కేంద్రం గతంలో చెప్పిందని ఈ సందర్భంగా తెలిపింది. దానికి అనుగుణంగానే టెలికం రంగానికి తోడ్పాటు అందించగలదని ఆశిస్తున్నట్లు వివరించింది. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారీ బకాయిల కారణంగా రెండో త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ. 50,921 కోట్ల నష్టం ప్రకటించిన సంగతి తెలిసిందే. You may be interested

లక్ష్మీ విలాస్‌ బ్యాంకుకు కమిషన్‌ మొట్టికాయ

Saturday 16th November 2019

సేవా లోపానికి పరిహారం చెల్లించాలని ఆదేశాలు న్యూఢిల్లీ: అకారణంగా ఓ ఖాతా నుంచి లక్ష్మీ విలాస్‌ బ్యాంకు నగదును డెబిట్‌ చేసినందుకు.. ఆ మొత్తంతో పాటు పరిహారం కూడా చెల్లించాలని వినియోగదారుల వివాదాల జాతీయ కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ) ఆదేశించింది. తమ సేవా లోపం లేదన్న బ్యాంకు వాదనను తిరస్కరించింది. పరిహారం కింద రూ.25,000తోపాటు, నగదును డెబిట్‌ చేసి నాటి నుంచి ఆ మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాలని తీర్పు చెప్పింది. కర్ణాటక

ఆర్‌కామ్‌ నష్టాలు రూ.30,142 కోట్లు

Saturday 16th November 2019

రూ.28,314 కోట్ల ఏజీఆర్‌ కేటాయింపులు  రూ.302 కోట్లకు తగ్గిన ఆదాయం  న్యూఢిల్లీ: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.30,142 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం దివాలా ప్రక్రియ నడుస్తున్న ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,141 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఏజీఆర్‌(సవరించిన స్థూల రాబడి) విషయమై సుప్రీం కోర్ట్‌ ఇచ్చిన తీర్పు కారణంగా రూ.28,314 కోట్ల కేటాయింపులు జరపడంతో ఈ

Most from this category