News


ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌.... మిట్టల్‌కు లైన్‌ క్లియర్‌!

Friday 15th November 2019
news_main1573810590.png-29618

ఎస్సార్‌ స్టీల్‌ను సొంతం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఆర్సెలార్‌ మిట్టల్‌కు శుక్రవారం అనుమతినిచ్చింది. 2018 అక్టోబర్‌ 23న ప్రకటించిన ప్రణాళిక ప్రకారం మిట్టల్‌ డీల్‌పూర్తి చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. ఇప్పటివరకు ఈ డీల్‌పై ఉన్న స్టేను ఎత్తేసింది. విక్రయ సొత్తును ఎలా పంచుకోవలన్నది రుణదాతల కమిటీ(సీఓసీ- అంటే బ్యాంకుల కన్సార్టియం) ఇష్టమని తెలిపింది. కంపెనీని విక్రయించిన సొత్తును ఫైనాన్షియల్‌, ఆపరేషనల్‌ క్రెడిటర్లు సమానంగా పంచుకోవాలని గతంలో ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుతో కంపెనీ రుణదాతలైన బ్యాంకుల్లో వాటిల్లో వాటికి, మరియు వాటితో, ఆపరేషనల్‌ క్రెడిటర్లకు మధ్య గొడవ ఆరంభమైంది.

మిట్టల్‌ చెల్లించే సొమ్ము తమకు సరిపోదని రుణదాతలు తీర్మానించారు. అప్పటికే మిట్టల్‌ కంపెనీ రూ.42వేల కోట్ల బిడ్‌కు ఎన్‌సీఎల్‌టీ అనుమతి పొందింది. ఈ గొడవంతా చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. తాజాగా సుప్రీం తీర్పుతో ఎస్సార్‌ స్టీల్‌ సొంతం చేసుకోవడానికి ఆర్సెలార్‌ మిట్టల్‌కు అడ్డంకులు తొలగినట్లయింది. బ్యాంకుల కన్సార్టియం అందరు వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించేలా వ్యవహరించాలని కోర్టు హితవు చెప్పింది. అలాగే సెక్యూర్డ్‌, అన్‌సెక్యూర్డ్‌ రుణదాతలను ఒకేలా చూడలేమని తేల్చిచెప్పింది. అలాగని వారి ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయకూడదని తెలిపింది. మొత్తం డీల్‌ 330 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఎస్సార్‌ స్టీల్‌ డజను బ్యాంకులకు దాదాపు రూ. 49వేల కోట్ల బకాయిలుంది. ఇందులో అత్యధికంగా ఎస్‌బీఐకి రూ. 15వేల కోట్లబాకీ ఉంది. 



You may be interested

ఇండియాపై సీఎల్‌ఎస్‌ఏ అండర్‌వెయిట్‌!

Friday 15th November 2019

‘అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల(ఈఎం)లో ఇండియా అండర్‌పెర్ఫార్మ్‌ చేస్తుందని అంచనావేస్తున్నాం. నా సలహా ఏంటంటే ఈఎం మార్కెట్లలో మొదట ఉత్తరాసియా మార్కెట్లు ఔట్‌పెర్ఫార్మ్‌ చేస్తాయి. ఈ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాం’ అని సీఎల్‌ఎస్‌ఏ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ అడ్రియన్‌ మావత్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో... డిమాండ్‌ తగ్గింది.. ప్రభుత్వం కార్పోరేట్‌ పన్ను రేటును 25 శాతానికి తగ్గించడంతో, మేము చూస్తున్న ఇతర దేశాల సరసన ఇండియా నిలిచింది.

నష్టాల్లోంచి లాభాల్లోకి భారతీ ఎయిర్‌టెల్‌ షేరు

Friday 15th November 2019

భారతీ ఎయిర్‌ షేరు మిడ్‌సెషన్‌ తిరిగి లాభాల బాట పట్టింది. గురువారం క్యు2 ఫలితాల్లో భారీ నష్టాలు నమోదు చేసిన ఈ షేరు ఉదయం ట్రేడింగ్‌లో నష్టాల్లో ప్రారంభమైంది. బీఎస్‌ఈలో 2.50శాతం నష్టంతో రూ.357.85 వద్ద ట్రేడ్‌ ప్రారంభమైంది. ఎయిర్‌టెల్‌ ఏజీఆర్‌పై సుప్రీం తీర్పుతో రెండో త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించింది. ఈ క్యూ2లో రూ.23045 కోట్ల నికర నష్టం వచ్చినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక

Most from this category