News


భారత్‌లో డీబీఎస్‌ బ్యాంక్‌ విస్తరణ

Friday 22nd November 2019
news_main1574392646.png-29770

బ్యాంకింగ్‌ సేవల్లో ఉన్న సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ భారత్‌లో విస్తరిస్తోంది. ప్రస్తుతం సంస్థకు శాఖలు, కియోస్క్‌లు 70 దాకా ఉన్నాయి. ఏడాదిలోగా ఈ సంఖ్య 100కు చేరుతుందని డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ ప్రియాశిష్‌ దాస్‌ తెలిపారు. వైస్‌ ప్రెసిడెంట్‌, బ్రాంచ్‌ హెడ్‌ కె.శ్రీనివాస రావుతో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 25 నగరాల్లో సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ఆరవ ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌ను త్వరలో హైదరాబాద్‌లోని వేవ్‌రాక్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. భాగ్యనగరిలో 40 వేల పైచిలుకు కస్టమర్లున్నారని వివరించారు. బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 2,000లకు పైగా ఉంది. పూర్తిగా కాగిత రహిత విధానాన్ని అనుసరిస్తున్నట్టు ఆయన తెలిపారు. 



You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్ బాకీల సత్వర పరిష్కారంపై ఎస్‌బీఐ ఆశలు

Friday 22nd November 2019

న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియ కింద చర్యలు ఎదుర్కోబోతున్న డీహెచ్ఎఫ్ఎల్ కేసు.. నిర్దిష్ట గడువులోగా పరిష్కారం కాగలదని బ్యాంకులు ఆశిస్తున్నట్లు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. "ఇది ఇప్పుడే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కు చేరింది. ఎన్‌సీఎల్‌టీ అమలు చేసే ప్రక్రియే దీనికీ వర్తిస్తుంది. సాధారణ౾గా పొడిగింపును కూడా పరిగణనలోకి తీసుకుంటే 330 రోజుల గడువు ఉంటుంది. లేకపోతే 180

బీపీసీఎల్‌ రేసులో ఇతర పీఎస్‌యూలకు ఛాన్స్‌ లేదు

Friday 22nd November 2019

స్పష్టం చేసిన చమురు మంత్రి  పోటీ పెరిగితే చౌకగా సేవలు  న్యూఢిల్లీ:- భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) కొనుగోలు రేసులో ఐఓసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవకాశం లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. బీపీసీఎల్‌లో వాటా కొనుగోలు కోసం రూ.90,000 కోట్లు వెచ్చించాలని, ఈ స్థాయిలో వ్యయం చేయగల పీఎస్‌యూలు లేవని స్పష్టం చేశారు. బీపీసీఎల్‌తో సహా మరో రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో  ప్రభుత్వానికి

Most from this category