News


సున్నిత అంశాల డేటా భారత్‌లోనే ఉండాలి: రవిశంకర్ ప్రసాద్

Saturday 21st September 2019
news_main1569042328.png-28465

న్యూఢిల్లీ: దేశ డేటా సార్వభౌమాధికారం చేజారి పోనిచ్చేది లేదని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఉద్ఘాటించారు. సున్నిత, అతి సున్నిత అంశాలకు సంబంధించిన సమాచారం దేశంలోనే ఉండాలని వ్యాఖ్యానించారు. డేటా లభ్యత, వినియోగం, ఆవిష్కరణ.. డేటా గోప్యతల మధ్య సమతుల్యత అవసరమని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ ఆవిర్భావం, ప్రభావం అనే అంశంపై జైపురియా స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆయన ఈ వాఖ్యలు చేశారు. వ్యక్తిగత డేటా రక్షణపై సుదీర్ఘ చర్చ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశ సరిహద్దుల్లోనే డేటాను పరిమితం చేయడం కంటే.. అంతర్జాతీయంగా ఎటువంటి హద్దులు లేకుండా డేటా చేరుకునేలా స్వేచ్ఛనివ్వాలని గతవారంలో ఫేస్‌బుక్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఒకరు ఈ అంశంపై ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన రవిశంకర్ ప్రసాద్.. ‘డిజిటల్ ఇండియా భారతీయుల జీవితాలను మార్చాలని చూస్తోంది. ఐటి సేవల్లో భారత్‌ ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసింది’ అని అన్నారు. 



You may be interested

భెల్‌ డివిడెండ్‌ వంద శాతం

Saturday 21st September 2019

గతంలో 40 శాతం చెల్లింపు  ఏజీఎమ్‌లో 60 శాతం తుది డివిడెండ్‌ ప్రకటన  న్యూఢిల్లీ: భెల్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరానికి మొత్తం వంద శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. గతంలోనే 40 శాతం డివిడెండ్‌(రూ.279 కోట్లు)ను చెల్లించిన ఈ కంపెనీ గురువారం జరిగిన వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్‌)లో 60 శాతం అదనపు తుది డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో గత నలభై ఏళ్లుగా అప్రతిహతంగా డివిడెండ్‌ను చెల్లిస్తున్నట్లయిందని భెల్‌ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో

రూపాయికీ 38 పైసలు బూస్ట్‌

Saturday 21st September 2019

70.94 వద్ద ముగింపు కార్పొరేట్‌ పన్నులను తగ్గిస్తూ, ప్రభుత్వం చేసిన ప్రకటన రూపాయికీ ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 40పైసలు లాభపడి, 70.94 వద్ద ముగిసింది. గురువారం రూపాయి ముగింపు 71.34. అయితే శుక్రవారం ట్రేడింగ్‌లో 71.19 వద్ద ప్రారంభమైంది. అయితే వారంవారీగా చూస్తే, 2పైసలు నష్టంలోనే రూపాయి ఉంది. కాగా రూపాయి 68కిపైగా బలపడ్డం కష్టమేనన్న విశ్లేషణలూ ఉన్నాయి. అక్టోబర్‌ 9వ తేదీన

Most from this category